US Greesn Card: అమెరికా గ్రీన్కార్డ్ ప్రక్రియ మరింత కఠినం.. భారతీయులపై ప్రభావం చూపనున్న కొత్త మార్పులు!

US Greesn Card: అమెరికాలో ఉద్యోగం చేసి శాశ్వతంగా స్థిరపడాలని కలలు కనే వేలాది మంది భారతీయులకు గ్రీన్కార్డ్ ప్రక్రియ మరింత క్లిష్టంగా మారుతోంది. ఇప్పటికే సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న దరఖాస్తుదారులకు తాజాగా వచ్చిన మార్పులు మరింత జాగ్రత్త అవసరమనే సంకేతాలు ఇస్తున్నాయి. వీసా కోటా పూర్తవడం, దరఖాస్తు నిబంధనలు కఠినతరం కావడం, అధికారుల పరిశీలన విధానంలో మార్పులు వంటి అంశాలు ముఖ్యంగా భారతీయ ఐటీ నిపుణులు, పెట్టుబడిదారులపై ప్రభావం చూపే అవకాశముందని ఇమ్మిగ్రేషన్ నిపుణులు చెబుతున్నారు.

US Green Card
US Green Card

EB-2, EB-5 వీసా కోటా పూర్తి.. గ్రీన్కార్డ్ కోసం మరింత నిరీక్షణ..

గ్రీన్కార్డ్ దరఖాస్తుల్లో చిన్న పొరపాటే భారీ నష్టం..

అమెరికాలో ఉద్యోగం చేసి శాశ్వతంగా స్థిరపడాలని కలలు కనే వేలాది మంది భారతీయులకు గ్రీన్కార్డ్ ప్రక్రియ మరింత క్లిష్టంగా మారుతోంది. ఇప్పటికే సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న దరఖాస్తుదారులకు తాజాగా వచ్చిన మార్పులు మరింత జాగ్రత్త అవసరమనే సంకేతాలు ఇస్తున్నాయి. వీసా కోటా పూర్తవడం, దరఖాస్తు నిబంధనలు కఠినతరం కావడం, అధికారుల పరిశీలన విధానంలో మార్పులు వంటి అంశాలు ముఖ్యంగా భారతీయ ఐటీ నిపుణులు, పెట్టుబడిదారులపై ప్రభావం చూపే అవకాశముందని ఇమ్మిగ్రేషన్ నిపుణులు చెబుతున్నారు.

గ్రీన్కార్డ్ కోసం ఎదురుచూస్తున్న వారికి మూడు కీలక మార్పులు
తాజా పరిణామాల్లో ముఖ్యంగా మూడు అంశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మొదటిగా, ఈ ఆర్థిక సంవత్సరానికి EB-2 మరియు EB-5 కేటగిరీల్లో అందుబాటులో ఉన్న వీసా కోటా పూర్తైంది. రెండోది, దరఖాస్తులో చిన్న పొరపాటు, అవసరమైన చోట సంతకం లేకపోవడం లేదా అసంపూర్ణ సమాచారం ఉంటే కూడా దరఖాస్తు తిరస్కరించే అవకాశం పెరిగింది. మూడోది, అర్హతలు ఉన్నంత మాత్రాన గ్రీన్కార్డ్ ఆటోమేటిక్గా మంజూరు కాదని, ప్రతి దరఖాస్తును అధికారులు తమ విచక్షణతో పరిశీలించనున్నట్లు స్పష్టం చేశారు.

జూలై వీసా బులెటిన్లో కీలక సమాచారం
అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ విడుదల చేసిన జూలై వీసా బులెటిన్ ప్రకారం, భారతీయులు ఎక్కువగా ఉపయోగించే ఎంప్లాయ్మెంట్ ఆధారిత EB-2 కేటగిరీలో ఈ ఆర్థిక సంవత్సరానికి వీసా కేటాయింపులు పూర్తయ్యాయి. దీంతో కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే అక్టోబర్ వరకు అదనపు వీసాలు అందుబాటులో ఉండవు.

పెట్టుబడుల ద్వారా అమెరికాలో స్థిరపడే EB-5 కేటగిరీలో కూడా వార్షిక పరిమితి పూర్తయింది. అలాగే అమెరికాలోనే ఉంటూ ఎడ్జెస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ ద్వారా గ్రీన్కార్డ్కు దరఖాస్తు చేసుకునే వారి విషయంలో ఇప్పుడు ఫైనల్ యాక్షన్ డేట్స్ ధారంగా మాత్రమే అర్హతను నిర్ణయించనున్నారు. దీంతో వెయిటింగ్ సమయం మరింత పెరిగే అవకాశం ఉంది.

ఫైలింగ్లో చిన్న పొరపాటు కూడా ఖరీదైనదే 
తాజా మార్పుల్లో అత్యంత ప్రాధాన్యం పొందిన అంశం దరఖాస్తు సమర్పణ విధానం. గతంలో కొన్ని సాంకేతిక లోపాలను సరిదిద్దుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు అవసరమైన చోట సంతకం లేకపోవడం, ఫారమ్ పూర్తిగా నింపకపోవడం లేదా అవసరమైన పత్రాలు జత చేయకపోవడం వంటి కారణాలతో దరఖాస్తు నేరుగా తిరస్కరించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కొన్ని సందర్భాల్లో దరఖాస్తు తిరస్కరించబడితే చెల్లించిన ఫీజు కూడా తిరిగి రాకపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో మళ్లీ కొత్త దరఖాస్తుతో మొత్తం ప్రక్రియను ప్రారంభించాల్సి రావచ్చు.

గ్రీన్కార్డ్ ప్రక్రియ ఆగలేదు.. కానీ మరింత జాగ్రత్త అవసరం
ఈ మార్పులతో గ్రీన్కార్డ్ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోలేదు. అయితే గతంతో పోలిస్తే మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఏర్పడింది. ముఖ్యంగా EB-2, EB-5 కేటగిరీల్లో ఉన్నవారు కొత్త వీసా కేటాయింపుల కోసం అక్టోబర్ వరకు వేచి చూడాల్సి రావచ్చు. చిన్న ఫైలింగ్ పొరపాట్లు కూడా నెలలు లేదా సంవత్సరాల ఆలస్యానికి కారణమయ్యే అవకాశం ఉంది.

తెలుగు రాష్ట్రాల కుటుంబాలపై కూడా ప్రభావం
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వేలాది మంది అమెరికాలో H-1B వీసాలపై ఐటీ రంగంలో పనిచేస్తున్నారు. మరికొందరు గ్రీన్కార్డ్ కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నారు. అందువల్ల అమెరికా ఇమ్మిగ్రేషన్ విధానంలో వచ్చే ప్రతి మార్పు తెలుగు రాష్ట్రాల్లోని కుటుంబాలకు కూడా కీలక అంశంగా మారుతోంది.

ఎవరిపై ఎక్కువ ప్రభావం?
ఈ మార్పులు ప్రధానంగా H-1B వీసాపై పనిచేస్తున్న ఐటీ నిపుణులు, EB-2 కేటగిరీలో గ్రీన్కార్డ్ కోసం ఎదురుచూస్తున్న భారతీయులు, EB-5 పెట్టుబడి వీసా దరఖాస్తుదారులు, అలాగే అమెరికాలోనే ఉండి ఎడ్జెస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ ప్రక్రియలో ఉన్నవారిపై ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉంది.

దరఖాస్తు చేసే ముందు గుర్తుంచుకోవాల్సిన విషయాలు
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి దరఖాస్తుదారు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఫారమ్ను పూర్తిగా పరిశీలించడం, అవసరమైన ప్రతి చోట సంతకం చేయడం, అన్ని సపోర్టింగ్ డాక్యుమెంట్లు జత చేయడం, సందేహాలు ఉంటే అనుభవజ్ఞులైన ఇమ్మిగ్రేషన్ నిపుణులు లేదా లాయర్ల సలహా తీసుకోవడం మంచిదని చెబుతున్నారు.

అక్టోబర్ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది?
అమెరికాలో కొత్త ఆర్థిక సంవత్సరం అక్టోబర్ 1 నుంచి ప్రారంభమవుతుంది. ఆ సమయంలో కొత్త వీసా కోటా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే పెండింగ్ దరఖాస్తుల సంఖ్య, డిమాండ్, కేటగిరీల వారీగా ఉన్న వెయిటింగ్ను బట్టి పరిస్థితి మారుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. కాబట్టి అక్టోబర్ వచ్చిన వెంటనే వెయిటింగ్ పూర్తిగా తగ్గిపోతుందని చెప్పలేమని వారు స్పష్టం చేస్తున్నారు.

తాజా టైమ్లైన్
గ్రీన్కార్డ్ ప్రక్రియలో ఈ ఏడాది మే నెలలో అధికారుల విచక్షణాధికారంపై కొత్త మార్గదర్శకాలు అమల్లోకి వచ్చాయి. జూలై వీసా బులెటిన్లో EB-2, EB-5 కేటగిరీల వీసా కోటా పూర్తైనట్లు ప్రకటించారు. జూలై 10 నుంచి కొన్ని ఫైలింగ్ నిబంధనలను మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. అక్టోబర్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమై కొత్త వీసా కేటాయింపులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

భారతీయులకు నిపుణుల సూచన
గ్రీన్కార్డ్ కోసం ఇప్పటికే సుదీర్ఘ నిరీక్షణలో ఉన్న భారతీయులు ఇకపై మరింత అప్రమత్తంగా ఉండాలని ఇమ్మిగ్రేషన్ నిపుణులు సూచిస్తున్నారు. వీసా కోటా, దరఖాస్తు నిబంధనలు, అధికారుల పరిశీలన.. ఈ మూడు అంశాలు ఇప్పుడు అత్యంత కీలకంగా మారాయని చెబుతున్నారు. అందుకే ప్రతి దరఖాస్తును పూర్తిగా పరిశీలించి, అన్ని వివరాలు సరిచూసుకుని సమర్పించడం ద్వారా అనవసర ఆలస్యాలను నివారించవచ్చని వారు సూచిస్తున్నారు.

Tags

Be the first to react

Latest