LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
NRI

Singapore: సింగపూర్‌లో ఘనంగా ముగిసిన TSP T10 టోర్నమెంట్.. విజేతగా నిలిచిన తెలుగు వారియర్స్.!

Singapore: టీం శివప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన TSP T10 — తెలుగు సింగపూర్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్, మే డే సందర్భంగా Terusan Recreation Centre వద్ద ఘనంగా ముగిసింది.

AndhraPravasi News Desk 3 min read
Singapore: సింగపూర్‌లో ఘనంగా ముగిసిన TSP T10 టోర్నమెంట్.. విజేతగా నిలిచిన తెలుగు వారియర్స్.!
  • "సైట్‌లో కష్టం.. గ్రౌండ్‌లో శక్తి": సింగపూర్ తెలుగు కార్మికుల క్రికెట్ ఉత్సవం విజయవంతం..
     
  • Associations: "వ్యక్తిగత అవార్డుల్లో బండి శ్రీనివాస్ రెడ్డి హవా": ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా ఎంపిక..

Singapore: టీం శివప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన TSP T10 — తెలుగు సింగపూర్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్, మే డే సందర్భంగా Terusan Recreation Centre వద్ద ఘనంగా ముగిసింది. ఏప్రిల్ 18 నుంచి మే 1 వరకు నాలుగు వారాంతాల్లో నిర్వహించిన ఈ టోర్నమెంట్‌లో, సింగపూర్ నలుమూలల నుంచి వచ్చిన తెలుగు కార్మికులు, ఉద్యోగులు మరియు కుటుంబ సభ్యులు విశేషంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మొత్తం 18 జట్లు పోటీపడిన ఈ టోర్నమెంట్‌లో, లీలా నాగేశ్ నాయకత్వంలోని తెలుగు వారియర్స్ జట్టు విజేతగా నిలవగా, సాహు చంద్రశేఖర్ నాయకత్వంలోని మెగాయార్డ్ రైడర్స్ జట్టు ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకుంది. మొత్తం 17 మ్యాచ్‌లు ఉత్కంఠభరితంగా సాగగా, 250కి పైగా ఆటగాళ్లు తమ ప్రతిభను ప్రదర్శించారు. విజేతలకు వరుసగా SGD1,116 మరియు SGD558 నగదు బహుమతులతో పాటు ట్రోఫీలు అందజేశారు.

వ్యక్తిగత విభాగంలో బండి శ్రీనివాస్ రెడ్డి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు అందుకోగా, శ్యామ్ ఉత్తమ ఆల్‌రౌండర్‌గా, ఆంథోనీ ఉత్తమ బౌలర్‌గా, విజ్జు ఉత్తమ బ్యాట్స్‌మన్‌గా ఎంపికయ్యారు. మెగాయార్డ్ రైడర్స్ జట్టుకు చెందిన ఇద్దరు ఆటగాళ్లు వ్యక్తిగత అవార్డులు గెలుచుకోవడం ఆ జట్టు ప్రతిభను ప్రతిబింబించింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సారిక ప్రసాద్ హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. అలాగే రాంబాబు పాతూరి  (కాకతీయ కల్చరల్ అసోసియేషన్), రత్న కుమార్ కవుటూరు (శ్రీ సాంస్కృతిక కళాసారథి), సింగపూర్ తెలుగు సమాజం పూర్వ అధ్యక్ష్యులు రంగా రవి, చౌదరి జె తదితరులతో పాటు శేషారావు గూడూరి, వినయ్ కుమార్ సూర్యదేవర, సురేంద్ర చెబ్రోలు, చంద్రశేఖర్ చిలుకూరి, హనుమంతరావు మాదాల, అమ్మయ్య చౌదరి, గంగాధర్ తాటి, సతీష్ పారేపల్లి, వేణు నార్నే తదితర ప్రముఖులు విచ్చేసి నిర్వాహకులను మరియు క్రీడాకారులను అభినందించారు.

ఈ టోర్నమెంట్ విజయవంతం కావడంలో పీఎస్వీ ఇంజినీరింగ్, యూనిక్ గ్రూప్, బీఆర్‌ఎం ఇంజినీరింగ్, వీవీ ఇంజినీరింగ్, ఎస్‌జీడీ ఆర్ మెరైన్, ఫ్యూషన్ ఇంజినీరింగ్, ఏఎస్ఏపీ మెరైన్, సాంకో, టెక్ ఇంటర్నేషనల్, ఫాబ్‌టెక్ ఏషియా ఇంజినీరింగ్, డ్యూన్ ఆఫ్‌షోర్, శ్రీసత్య సంస్థలు, అలాగే సుధాకర్ జొన్నాదుల, విక్రమ్ సంకిరెడ్డిపల్లి, వంశీ కృష్ణ సిస్ట్లా, సేతు మాధవి మొవ్వ, అనిత జ్యోతి మదిరి, వాసు బాబు పెంట్యాల, శివ కృష్ణ సూరంపల్లి, పాండు రంగారావు సూరవరం, శివ ప్రసాద్ కొల్లా, గిరిధర్ సరాయి, సుదర్శన్ పూల, జమ్ముల సాంబ, కిషోర్ గణపతినీడి వంటి వ్యక్తిగత స్పాన్సర్లు తమ వంతు సహకారం అందించారు.

శివ ప్రసాద్ కొల్లా నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో బి వర ప్రసాద్, గిరిధర్ సరాయి, అనిల్ కుమార్ బొమ్మారెడ్డి తదితరులతో పాటు కోఆర్డినేటర్లు, లాజిస్టిక్స్ టీమ్, అంపైర్లు, స్కోరర్లు మరియు వాలంటీర్లు అహర్నిశలు శ్రమించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సురేంద్ర చేబ్రోలు, ఉమా మహేశ్వర రావు, గురురాజ్ బనకర్, శ్రీను యాదవ్, గొర్రెపాటి లక్ష్మీ రెడ్డి అంపైర్లుగా వ్యవహరించగా, రమేష్ వ్యాఖ్యాతగా కార్యక్రమానికి మరింత ఆకర్షణ తీసుకువచ్చారు. RK Videography ద్వారా రాధాకృష్ణ గణేశ్న మరియు కాత్యాయిని గణేశ్న  ఫైనల్ మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేయగా, సుదర్శన్ పూల ఫోటోగ్రఫీ ద్వారా టోర్నమెంట్‌ను అందంగా చిత్రీకరించారు.

ఈ టోర్నమెంట్ కేవలం క్రికెట్ పోటీ మాత్రమే కాకుండా, కుటుంబ సభ్యులు, స్నేహితులు కలిసి ఆనందంగా గడిపిన ఒక కమ్యూనిటీ ఉత్సవంగా నిలిచింది. ఆటగాళ్లకు కుటుంబ సభ్యులు ఇచ్చిన ప్రోత్సాహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

టీం శివప్రసాద్ ప్రతినిధులు మాట్లాడుతూ, ఈ టోర్నమెంట్ విజయవంతం కావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, వచ్చే సంవత్సరం TSP T10 2027ను మరింత విస్తృతంగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. మహిళల విభాగం ప్రవేశపెట్టడం, మెరుగైన లైవ్ స్ట్రీమింగ్ మరియు మరిన్ని సదుపాయాలు అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు.

“సైట్‌లో కష్టం… గ్రౌండ్‌లో శక్తి” అనే నినాదంతో నిర్వహించిన ఈ టోర్నమెంట్, సింగపూర్ తెలుగు సమాజ ఐక్యత, శక్తి మరియు కృషికి ప్రతీకగా నిలిచింది.

Be the first to react

More Coverage

TCA: టీ‌సీఏ స్వర్ణోత్సవ వేడుకలకు నృత్య కళాకారుల ఆహ్వానం.. ‘స్వాగత గీతం’, ‘స్వర్ణ వైభవం’ కోసం దరఖాస్తుల స్వీకరణ!

TCA: టీ‌సీఏ స్వర్ణోత్సవ వేడుకలకు నృత్య కళాకారుల ఆహ్వానం.. ‘స్వాగత గీతం’, ‘స్వర్ణ వైభవం’ కోసం దరఖాస్తుల స్వీకరణ!

TCA: అమెరికాలో తెలుగు సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు కృషి చేస్తున్న హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమి…