Shahnaz: మస్కట్ నరకం నుండి విముక్తి... పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు! Saudi Arabia: సౌదీ ఎడారిలో జగిత్యాల యువకుడి నరకయాతన... సీఎం ప్రవాసీ ప్రజావాణికి చేరిన బాధితుడి గోడు.. తక్షణ చర్యలకు అధికారుల ఆదేశం!! Russia: పుతిన్ హత్యకు కుట్ర.. ఎక్కువ కాలం బంకర్లోనే గడుపుతున్న రష్యా అధినేత! భద్రత మరింత కట్టుదిట్టం.. Visa Rules: అమెరికా స్టూడెంట్ వీసా నిబంధనల్లో భారీ మార్పులు - తెలుసుకోకుంటే నష్టమే! Singapore: సింగపూర్‌లో ఆధ్యాత్మిక వెల్లువ... ఘనంగా 409వ భాగవత సప్తాహ వేడుకలు! Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. హార్ముజ్ జలసంధిలో నౌకాదళ రక్షణ నిలిపివేత! TFAS: అమెరికాలో ప్రవాస భారతీయుడికి ఘన సత్కారం! TFAS ఉగాది వేడుకలు! NRI Techie: ఇండియాకు వచ్చేస్తా.. తక్కువ జీతమైనా సరే.. అమెరికా టెక్కీ ఆవేదన! నెట్టింట వైరల్ పోస్ట్.. Texas Gun Fire: టెక్సాస్‌లో కాల్పుల కలకలం: తుపాకీ తూటాలకు ఇద్దరు బలి! Iran Attack: యూఏఈలో ఫుజైరా ఆయిల్ సెంటర్ పై ఇరాన్ దాడి.. ముగ్గురు భారతీయులకు గాయాలు! Shahnaz: మస్కట్ నరకం నుండి విముక్తి... పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు! Saudi Arabia: సౌదీ ఎడారిలో జగిత్యాల యువకుడి నరకయాతన... సీఎం ప్రవాసీ ప్రజావాణికి చేరిన బాధితుడి గోడు.. తక్షణ చర్యలకు అధికారుల ఆదేశం!! Russia: పుతిన్ హత్యకు కుట్ర.. ఎక్కువ కాలం బంకర్లోనే గడుపుతున్న రష్యా అధినేత! భద్రత మరింత కట్టుదిట్టం.. Visa Rules: అమెరికా స్టూడెంట్ వీసా నిబంధనల్లో భారీ మార్పులు - తెలుసుకోకుంటే నష్టమే! Singapore: సింగపూర్‌లో ఆధ్యాత్మిక వెల్లువ... ఘనంగా 409వ భాగవత సప్తాహ వేడుకలు! Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. హార్ముజ్ జలసంధిలో నౌకాదళ రక్షణ నిలిపివేత! TFAS: అమెరికాలో ప్రవాస భారతీయుడికి ఘన సత్కారం! TFAS ఉగాది వేడుకలు! NRI Techie: ఇండియాకు వచ్చేస్తా.. తక్కువ జీతమైనా సరే.. అమెరికా టెక్కీ ఆవేదన! నెట్టింట వైరల్ పోస్ట్.. Texas Gun Fire: టెక్సాస్‌లో కాల్పుల కలకలం: తుపాకీ తూటాలకు ఇద్దరు బలి! Iran Attack: యూఏఈలో ఫుజైరా ఆయిల్ సెంటర్ పై ఇరాన్ దాడి.. ముగ్గురు భారతీయులకు గాయాలు!

TANA: విద్యార్థులకు మార్గదర్శిగా తానా స్కాలర్‌షిప్ వెబినార్.. విద్యార్థుల్లో భారీ స్పందన!

TANA: అమెరికాలోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా మిడ్ అట్లాంటిక్ విభాగం నిర్వహించిన తానా స్కాలర్‌షిప్ వెబినార్ విజయవంతంగా జరిగింది. కొత్తగా కాలేజీలో చేరబోయే విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కళాశాల అడ్మిషన్లు, స్కాలర్‌షిప్ అవకాశాలపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యంగా నిర్వాహకులు తెలిపారు.

Published : 2026-05-10 10:44:00

కళాశాల అడ్మిషన్లు, స్కాలర్‌షిప్ అవకాశాలపై అవగాహన..

విద్యార్థులు, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరు..

అమెరికాలోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా మిడ్ అట్లాంటిక్ విభాగం నిర్వహించిన తానా స్కాలర్‌షిప్ వెబినార్ విజయవంతంగా జరిగింది. కొత్తగా కాలేజీలో చేరబోయే విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కళాశాల అడ్మిషన్లు, స్కాలర్‌షిప్ అవకాశాలపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యంగా నిర్వాహకులు తెలిపారు.

ఈ వెబినార్‌కు విద్యార్థులు, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అమెరికాలో ఉన్నత విద్య అవకాశాలు, కాలేజీ అడ్మిషన్ ప్రక్రియ, స్కాలర్‌షిప్‌లను పొందేందుకు పాటించాల్సిన వ్యూహాలు వంటి అంశాలపై నిపుణులు విలువైన సూచనలు అందించారు. పోటీ ప్రపంచంలో విద్యార్థులు తమ ప్రొఫైల్‌ను ఎలా బలోపేతం చేసుకోవాలి, భవిష్యత్తు లక్ష్యాలకు ఎలా సిద్ధం కావాలి అనే విషయాలను కూడా వివరించారు.

కార్యక్రమం విజయవంతం కావడంలో తానా అధ్యక్షులు డా. నరేన్ కొడాలి, బోర్డ్ డైరెక్టర్ రవి పొట్లూరి, మిడ్-అట్లాంటిక్ ప్రాంతీయ ప్రతినిధి ఫణి కంతేటి, బెనిఫిట్స్ కోఆర్డినేటర్ వెంకట్ సింఘు, ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్ వెంకట రావు అడుసుమల్లి అందించిన సహకారం కీలకంగా నిలిచిందని నిర్వాహకులు పేర్కొన్నారు.

వెబినార్‌లో పాల్గొన్న వారికి అమెరికా కాలేజీ దరఖాస్తుల కోసం ఉపయోగపడే ప్రత్యేక స్కాలర్‌షిప్ గైడ్‌ను తానా నాయకులు అందించారు. ఈ సందర్భంగా తానా బోర్డ్ డైరెక్టర్ రవి పొట్లూరి మాట్లాడుతూ, “విద్యే భవిష్యత్తు విజయాలకు బలమైన పునాది. విద్యార్థులను ప్రోత్సహించడం, వారికి సరైన దిశానిర్దేశం చేయడం కోసం తానా ఎప్పుడూ కట్టుబడి ఉంటుంది” అని అన్నారు.

అలాగే తమ అనుభవంతో విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచి, ఉన్నత విద్య వైపు ప్రేరేపించిన కాలేజీ కౌన్సెలర్, అకడమిక్ కోచ్ జో కేతర్ కు తానా నాయకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ఇలాంటి మార్గదర్శక కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించేందుకు తానా ముందుకు వస్తోందని నిర్వాహకులు వెల్లడించారు.

Spotlight

Read More →