LIVE
Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  •  Vishaka: ప్రభుత్వ స్కూల్‌గా మారిన విశాఖ విమల విద్యాలయం.. కలెక్టర్, ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా ప్రారంభం!  •  6G Network: భారత్‌లో 6G సంచలనం.. టెలికాం రంగం రూపురేఖలు మార్చబోతున్న కేంద్ర ప్రభుత్వ మాస్టర్ ప్లాన్!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
NRI

TAMA: అట్లాంటాలో ‘తెలుగు బాల పోటీలు’! చిన్నారుల్లో భాషా ప్రేమ పెంపొందించేందుకు TAMA ప్రత్యేక కార్యక్రమం..

TAMA: తెలుగు భాషా, సంస్కృతులను తర్వాతి తరాలకు అందించాలనే లక్ష్యంతో ‘తెలుగు బాల పోటీలు’. తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా (TAMA) ఆధ్వర్యంలో..

AndhraPravasi News Desk 1 min read
TAMA: అట్లాంటాలో ‘తెలుగు బాల పోటీలు’! చిన్నారుల్లో భాషా ప్రేమ పెంపొందించేందుకు TAMA ప్రత్యేక కార్యక్రమం..

పిల్లల్లో తెలుగు భాషపై ఆసక్తిని పెంపొందించేందుకు ‘తెలుగు బాల పోటీలు’.. 

వయస్సు ఆధారంగా మూడు విభాగాలుగా.. 

రిజిస్ట్రేషన్ పూర్తి వివరాలు.. 

తెలుగు భాషా, సంస్కృతులను తర్వాతి తరాలకు అందించాలనే లక్ష్యంతో తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా (TAMA) చిన్నారుల కోసం ప్రత్యేకంగా ‘తెలుగు బాల పోటీలు’ నిర్వహిస్తోంది. ఈ సాంస్కృతిక వేడుక 2026 ఏప్రిల్ 11 శనివారం మధ్యాహ్నం 1 గంట నుండి అట్లాంటా సమీపంలోని అల్ఫారెట్టాలోని డెన్మార్క్ హైస్కూల్‌లో జరగనుంది.

ఈ పోటీల ద్వారా విదేశాల్లో పెరుగుతున్న తెలుగు పిల్లల్లో భాషపై ఆసక్తిని పెంపొందించడం, వారి ప్రతిభను వెలికితీయడం ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.

పోటీలను పిల్లల వయస్సు ఆధారంగా మూడు విభాగాలుగా విభజించారు: 
బుడతలు: 5 నుంచి 8 ఏళ్లలోపు
సిసింద్రీలు: 9 నుంచి 12 ఏళ్లలోపు
చిరుతలు: 13 నుంచి 16 ఏళ్లలోపు

చిన్నారులను ఆకట్టుకునేలా విభిన్న రకాల పోటీలు ఏర్పాటు చేశారు: 
అక్షరాల అల్లరి: తెలుగు పదాలు చదవడం, రాయడం, అలాగే ఇంగ్లీష్ నుంచి తెలుగుకు అనువదించడం
పద్య ప్రపంచం: పద్యాలను పఠించడం, వాటి అర్థాన్ని వివరించడం
మాటల సందడి: సామాజిక మాధ్యమాలు, కుటుంబ విలువలు లేదా రామాయణం, మహాభారతం పాత్రలపై 2-3 నిమిషాల ప్రసంగం

ఈ పోటీల ద్వారా పిల్లల్లో భాషా పటిమతో పాటు ఆత్మవిశ్వాసం, వేదికపై మాట్లాడే నైపుణ్యాలు కూడా పెరుగుతాయని నిర్వాహకులు పేర్కొన్నారు.

రిజిస్ట్రేషన్ వివరాలు 
పోటీల్లో పాల్గొనాలనుకునే వారు పోస్టర్‌లో ఇచ్చిన గూగుల్ ఫామ్ లింక్ లేదా QR కోడ్ ద్వారా సులభంగా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు.

ఈ కార్యక్రమాన్ని TAMA అధ్యక్షురాలు సునీత పొట్నూరు మరియు చైర్మన్ మధుకర్ యార్లగడ్డ పర్యవేక్షిస్తున్నారు. మరిన్ని వివరాల కోసం నరేన్ నల్లూరి లేదా శేఖర్ కొల్లు ను సంప్రదించవచ్చని తెలిపారు.

తెలుగు భాషను చిన్నారుల్లో సజీవంగా ఉంచేందుకు ఈ తరహా కార్యక్రమాలు ఎంతో అవసరమని, ఈ పోటీలు పిల్లలకు ఒక మంచి వేదికగా నిలుస్తాయని అట్లాంటా తెలుగు సమాజం అభిప్రాయపడుతోంది.

Be the first to react

More Coverage

TCA: టీ‌సీఏ స్వర్ణోత్సవ వేడుకలకు నృత్య కళాకారుల ఆహ్వానం.. ‘స్వాగత గీతం’, ‘స్వర్ణ వైభవం’ కోసం దరఖాస్తుల స్వీకరణ!

TCA: టీ‌సీఏ స్వర్ణోత్సవ వేడుకలకు నృత్య కళాకారుల ఆహ్వానం.. ‘స్వాగత గీతం’, ‘స్వర్ణ వైభవం’ కోసం దరఖాస్తుల స్వీకరణ!

TCA: అమెరికాలో తెలుగు సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు కృషి చేస్తున్న హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమి…