LIVE
Supreme Court: మీనాక్షి నటరాజన్‌కు సుప్రీంకోర్టులో దక్కని ఊరట! రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై పిటిషన్ కొట్టివేత!  •  Praja Vedika: రేపు (13/6) తెలుగుదేశం పార్టీ కేంద్రంలో 'ప్రజా వేదిక' కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!  •  అమెరికా మిస్సైల్ దాడిలో విశాఖ యువకుడి దుర్మరణం... చంద్రబాబు ఆరా!!  •  Jobs: దుబాయ్‌లో ఉద్యోగాలు... నెలకు రూ.1.12 లక్షల జీతం... గోల్డెన్ ఛాన్స్ మీకోసమే!  •  Amaravathi Works: అమరావతి నిర్వాసితులకు గుడ్ న్యూస్... ఏడాది పాటు నెలకు రూ.10 వేల అద్దె!  •  Horticulture: భారత్‌లో ఉద్యానవన పంటల ఉత్పత్తికి భారీ వృద్ధి! 3,778 లక్షల టన్నులకు చేరనున్న హార్టికల్చర్ ఉత్పత్తి!  •  Indian Railways: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. టికెట్ బుకింగ్ ఇక చాలా ఈజీ! కేవలం 30 రోజుల్లో..  •  AP Farmers: అగ్రిగోల్డ్ బాధితులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు... కీలక ఆదేశాలు... దాదాపు పదేళ్ల తర్వాత...!!  •  H1B Visa: వీసా బాదుడుకు యూఎస్ కోర్టు బ్రేక్... వెనక్కి తగ్గని ట్రంప్!  •  Weather Alert: రాగల 24 గంటల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు... ఏపీలో ఈ జిల్లాలకు హై అలర్ట్!!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
NRI

TAMA: జెనరేటివ్ ఏఐపై ఉచిత ఆన్‌లైన్ శిక్షణకు టామా శ్రీకారం!

TAMA: వేగంగా అభివృద్ధి చెందుతున్న కృత్రిమ మేధస్సు (AI) రంగంలో ఆసక్తి ఉన్న తెలుగు యువత, ఉద్యోగులు, విద్యార్థుల కోసం అట్లాంటాలోని ప్రముఖ తెలుగు సంస్థ "తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా" (TAMA) ఒక ప్రత్యేక అవకాశాన్ని అందిస్తోంది.

AndhraPravasi News Desk 1 min read
TAMA: జెనరేటివ్ ఏఐపై ఉచిత ఆన్‌లైన్ శిక్షణకు టామా శ్రీకారం!

జెనరేటివ్ ఏఐపై ఉచిత ఆన్‌లైన్ శిక్షణకు టామా ముందడుగు..

సాంకేతికతపై ఆసక్తి ఉన్నవారికి టామా నుంచి ఉచిత ఏఐ కోర్సు..

అట్లాంటా: వేగంగా అభివృద్ధి చెందుతున్న కృత్రిమ మేధస్సు (AI) రంగంలో ఆసక్తి ఉన్న తెలుగు యువత, ఉద్యోగులు, విద్యార్థుల కోసం అట్లాంటాలోని ప్రముఖ తెలుగు సంస్థ "తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా" (TAMA) ఒక ప్రత్యేక అవకాశాన్ని అందిస్తోంది. టామా కెరీర్ గైడెన్స్ టీమ్ ఆధ్వర్యంలో, ‘KKR GENAI INNOVATIONS’ సహకారంతో పూర్తిగా ఉచితంగా "Generative AI" ఆన్‌లైన్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జనరేటివ్ ఏఐ సాంకేతికతకు విపరీతమైన ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో, ఈ రంగంలో నైపుణ్యాలను పెంపొందించుకోవాలనుకునే వారికి ఈ శిక్షణ ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది. పరిశ్రమలో చోటుచేసుకుంటున్న తాజా పరిణామాలు, ఏఐ ఆధారిత అనువర్తనాలు, భవిష్యత్ ఉద్యోగ అవకాశాలపై అవగాహన కల్పించే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ శిక్షణ కార్యక్రమం జులై 11, 2026 శనివారం ప్రారంభమై ఆగస్టు 2, 2026 వరకు కొనసాగుతుంది. ప్రతి శనివారం, ఆదివారం ఆన్‌లైన్ ద్వారా తరగతులు నిర్వహించబడతాయి. శిక్షణ సమయం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు (EST), అలాగే ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు (CST)గా నిర్ణయించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకునే వారు జులై 10, 2026లోపు తమ పేర్లను నమోదు చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు. పరిమిత సీట్లు ఉండే అవకాశం ఉన్నందున ఆసక్తి గల వారు ముందుగానే నమోదు చేసుకోవాలని కోరారు.

శిక్షణకు సంబంధించిన పూర్తి వివరాలు లేదా ఇతర సందేహాల కోసం అపురూప్‌ను +1 781 308 9100 లేదా +1 470 861 6312 నంబర్లలో సంప్రదించవచ్చని తెలిపారు. అలాగే టామా సభ్యత్వం పొందాలనుకునే వారు బ్రోషర్‌లో అందుబాటులో ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి సభ్యత్వానికి దరఖాస్తు చేసుకోవచ్చని నిర్వాహకులు వెల్లడించారు.

సాంకేతిక రంగంలో కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవాలనుకునే వారికి ఈ ఉచిత శిక్షణ కార్యక్రమం మంచి వేదికగా నిలుస్తుందని టామా ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేశారు.

Be the first to react

More Coverage

Uganda: సినిమా, రాజకీయ రంగాల్లో సరికొత్త అధ్యాయం ఎన్టీఆర్.. కంపాలా మినీ మహానాడులో ఎన్నారైల హర్షం!

Uganda: సినిమా, రాజకీయ రంగాల్లో సరికొత్త అధ్యాయం ఎన్టీఆర్.. కంపాలా మినీ మహానాడులో ఎన్నారైల హర్షం!

Uganda: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నట సార్వాబౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారి 103జయంత…