⚡ BREAKING

Silicon Andhra: సిలికానాంధ్ర రజతోత్సవ వేడుకలు, గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రయత్నం.. ఆగస్టు 1న ఓక్లాండ్ అరేనా వేదిక!

Silicon Andhra: అమెరికాలో తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి పరిరక్షణకు గత 25 ఏళ్లుగా విశేష సేవలు అందిస్తున్న సిలికానాంధ్ర సంస్థ తన రజతోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు సిద్ధమైంది. సంస్థ 25 ఏళ్ల విజయవంతమైన ప్రస్థానాన్ని పురస్కరించుకుని 2026 ఆగస్టు 1న కాలిఫోర్నియాలోని ఓక్లాండ్ అరేనాలో ‘సిలికానాంధ్ర రజతోత్సవ వేడుకలు’ నిర్వహించనుంది.

Silicon Andhra Silver Jubilee
Silicon Andhra Silver Jubilee

25 ఏళ్ల సిలికానాంధ్ర ప్రస్థానం.. వైభవంగా రజతోత్సవ వేడుకలు..

ప్రపంచ తెలుగు వైభవానికి వేదికగా సిలికానాంధ్ర రజతోత్సవం..

కాలిఫోర్నియా: అమెరికాలో తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి పరిరక్షణకు గత 25 ఏళ్లుగా విశేష సేవలు అందిస్తున్న సిలికానాంధ్ర సంస్థ తన రజతోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు సిద్ధమైంది. సంస్థ 25 ఏళ్ల విజయవంతమైన ప్రస్థానాన్ని పురస్కరించుకుని 2026 ఆగస్టు 1న కాలిఫోర్నియాలోని ఓక్లాండ్ అరేనాలో ‘సిలికానాంధ్ర రజతోత్సవ వేడుకలు’ నిర్వహించనుంది. ఈ వేడుకల్లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా తెలుగు సంస్కృతి వైభవాన్ని చాటిచెప్పేలా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రయత్నాలను కూడా చేపట్టనుండటం విశేషం.

Silicon Andhra Silver Jubilee

ఈ కార్యక్రమం ఉదయం నుంచి రాత్రి వరకు సాంస్కృతిక, ఆధ్యాత్మిక, సాహిత్య, సంగీత, నృత్య వైభవంతో కొనసాగనుంది. ప్రపంచ నలుమూలల నుంచి తెలుగు ప్రజలు, కళాకారులు, సాహితీవేత్తలు, సాంస్కృతిక సంస్థల ప్రతినిధులు పాల్గొనే ఈ వేడుకలను నిర్వాహకులు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నారు.

రజతోత్సవ వేడుకలు ఉదయం 8:30 గంటలకు శోభాయాత్రతో ప్రారంభమవుతాయి. అనంతరం ఉదయం 9:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు రంగపూజ, కుంభహారతి, ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇదే సమయంలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రయత్నంలో భాగంగా ‘సంగీతామృతవర్షిణి’ మరియు ‘లయామృతవర్షిణి’ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. తెలుగు సంగీత సంప్రదాయాన్ని ప్రపంచానికి పరిచయం చేసేలా ఈ కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

మధ్యాహ్నం 1:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు ప్రొక్లమేషన్స్‌తో పాటు కూచిపూడి నాట్యామృతవర్షిణి, లలితామృతవర్షిణి కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లక్ష్యంగా నిర్వహించే ‘శతక శంఖారావం’ కార్యక్రమం కూడా ఈ సెషన్‌లో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.

సాయంత్రం 6:00 గంటల నుంచి రాత్రి 10:00 గంటల వరకు ప్రముఖ అతిథుల సత్కారం, దేశభక్తిని చాటిచెప్పే ‘వందే భారతం’, పురాణ గాథ ఆధారంగా రూపొందించిన ‘దక్ష యజ్ఞం’, సంప్రదాయ కళలను ప్రతిబింబించే ‘జానపద జాతర’ వంటి వైవిధ్యభరిత కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించనున్నాయి.

సిలికానాంధ్ర రజతోత్సవ వేడుకలు కేవలం వార్షికోత్సవం మాత్రమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా తెలుగు భాష, సంస్కృతి, కళలను ఒకే వేదికపై ప్రదర్శించే మహోత్సవంగా నిలవనున్నాయి. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రయత్నాల ద్వారా తెలుగు ప్రజల ఐక్యతను, సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పే లక్ష్యంతో ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు.

వేడుకల్లో పాల్గొనాలనుకునే వారు, పూర్తి కార్యక్రమ వివరాలు తెలుసుకోవాలనుకునే వారు మరియు ముందస్తు నమోదు చేసుకోవాలనుకునే వారు silverjubilee.siliconandhra.org వెబ్‌సైట్‌ను సందర్శించాలని నిర్వాహకులు సూచించారు.

Tags

Be the first to react

Latest