LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
NRI

Australia: ఆస్ట్రేలియాలో భారతీయ మైగ్రేషన్ ఏజెంట్‌కు 5 ఏళ్ల నిషేధం!

Australia: ఆస్ట్రేలియాలో పని చేస్తున్న ఒక భారతీయ మైగ్రేషన్ ఏజెంట్‌పై కఠిన చర్యలు తీసుకున్నారు. వీసా దరఖాస్తుల్లో తప్పుడు సమాచారం సమర్పించడం, వృత్తిపరమైన నిబంధనలను ఉల్లంఘించడం వంటి ఆరోపణలతో ఆమెపై ఐదేళ్ల నిషేధం విధించారు.

AndhraPravasi News Desk 2 min read
Australia: ఆస్ట్రేలియాలో భారతీయ మైగ్రేషన్ ఏజెంట్‌కు 5 ఏళ్ల నిషేధం!

వృత్తిపరమైన ప్రమాణాలను పాటించలేదు..

మైగ్రేషన్ నిబంధనలను దెబ్బతీసేలా ఆమె ప్రవర్తన..

ఆస్ట్రేలియాలో పని చేస్తున్న ఒక భారతీయ మైగ్రేషన్ ఏజెంట్‌పై కఠిన చర్యలు తీసుకున్నారు. వీసా దరఖాస్తుల్లో తప్పుడు సమాచారం సమర్పించడం, వృత్తిపరమైన నిబంధనలను ఉల్లంఘించడం వంటి ఆరోపణలతో ఆమెపై ఐదేళ్ల నిషేధం విధించారు.

వనీట్ కౌర్ చాధా అనే ఈ ఏజెంట్, సిడ్నీ కేంద్రంగా పనిచేస్తున్న రాయల్ మైగ్రేషన్ & ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ సంస్థలో పనిచేసేది. ఇటీవల జరిగిన విచారణ తర్వాత ఆమె రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయడం జరిగింది.

ఈ వ్యవహారాన్ని మైగ్రేషన్ ఏజెంట్స్ రిజిస్ట్రేషన్ అథారిటీ కార్యాలయం (OMARA) పరిశీలించింది. ఆమె సమర్పించిన వీసా దరఖాస్తులను డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్ అఫైర్స్ పరిశీలించగా అనేక అనుమానాస్పద అంశాలు బయటపడ్డాయి.

విచారణలో చాధా తన క్లయింట్లకు ఇచ్చిన ఇమ్మిగ్రేషన్ సేవలను అధికారికంగా వెల్లడించలేదని తేలింది. అలాగే, తాను సమర్పించిన దరఖాస్తుల్లో తప్పుడు సమాచారం ఇచ్చినట్లు కూడా గుర్తించారు. ఆమెకు అవి తప్పని తెలిసినా అలా చేసినట్లు నివేదికలో పేర్కొన్నారు.

ఇంకా, ఆన్‌లైన్ ప్రకటనల ద్వారా ప్రజలను తప్పుదారి పట్టించేలా వ్యవహరించిందని, తాను ప్రభుత్వ విభాగంతో సంబంధం ఉన్నట్టు భావన కలిగించిందని అధికారులు తెలిపారు. తన సిబ్బందిపై సరైన పర్యవేక్షణ లేకపోవడం, అలాగే తన సంస్థలోని మరొకరికి అనధికారికంగా ఇమ్మిగ్రేషన్ సలహాలు ఇవ్వడానికి అవకాశం కల్పించినట్లు కూడా తేలింది.

వృత్తిపరమైన ప్రమాణాలను ఆమె పాటించలేదని, మైగ్రేషన్ రంగం ప్రతిష్టను కాపాడేందుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోలేదని అధికారులు వ్యాఖ్యానించారు. చట్టాన్ని తప్పించుకునే విధంగా, మైగ్రేషన్ నిబంధనల ఉద్దేశాన్ని దెబ్బతీసేలా ఆమె ప్రవర్తించిందని తేల్చారు.

చివరికి OMARA, చాధా “నిజాయితీ లేని వ్యక్తి, మైగ్రేషన్ సేవలు అందించడానికి తగిన వ్యక్తి కాదు” అని స్పష్టం చేస్తూ ఆమెపై నిషేధం విధించింది.

చాధా 2016లో మైగ్రేషన్ ఏజెంట్‌గా రిజిస్ట్రేషన్ పొందింది. ఆమె గతంలో చేసిన సోషల్ మీడియా వీడియోలు ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి. వాటిలో తాను అనుభవజ్ఞురాలిని, వలస ప్రక్రియ ఎంత కష్టమో అర్థం చేసుకుంటానని చెప్పింది. ఆసక్తికరంగా, మరో వీడియోలో వీసా దరఖాస్తుల్లో నకిలీ పత్రాలు ఇవ్వొద్దని, నిజాయితీగా ఉండాలని ఆమె సలహా ఇచ్చింది.

ఈ కేసులో ఆమె పనిచేసిన సంస్థ రాయల్ ఇంటర్నేషనల్ మైగ్రేషన్ కన్సల్టెంట్స్ పై ఎలాంటి ఆరోపణలు లేవు. ఈ సంస్థ 2007 నుండి కార్యకలాపాలు నిర్వహిస్తూ, ప్రతి సంవత్సరం వేలాది మందికి విద్యార్థి వీసాలు, ఇతర వీసా దరఖాస్తుల్లో సహాయం చేస్తున్నట్లు తెలిపింది. ఈ ఘటన వలస దరఖాస్తుల్లో నిజాయితీ ఎంత ముఖ్యమో మరోసారి స్పష్టంచేస్తూ, మైగ్రేషన్ రంగంలో కఠిన నియంత్రణలు కొనసాగుతున్నాయని సూచిస్తోంది.

Be the first to react

More Coverage

TCA: టీ‌సీఏ స్వర్ణోత్సవ వేడుకలకు నృత్య కళాకారుల ఆహ్వానం.. ‘స్వాగత గీతం’, ‘స్వర్ణ వైభవం’ కోసం దరఖాస్తుల స్వీకరణ!

TCA: టీ‌సీఏ స్వర్ణోత్సవ వేడుకలకు నృత్య కళాకారుల ఆహ్వానం.. ‘స్వాగత గీతం’, ‘స్వర్ణ వైభవం’ కోసం దరఖాస్తుల స్వీకరణ!

TCA: అమెరికాలో తెలుగు సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు కృషి చేస్తున్న హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమి…