Israel vs Iran War 2026: ఇరాన్ చమురు కేంద్రాలే టార్గెట్.. అగ్రరాజ్యం సంచలన హెచ్చరికలు! Trump: హర్మూజ్ జలసంధి బాధ్యత మీదే.. చేతులెత్తేసిన ట్రంప్!! NRIలు జాగ్రత్త.. వ్యవసాయ భూములు కొంటున్నారా? ఆస్తి అమ్మకాలపై భారీగా.. ఆ నిబంధనలు అతిక్రమిస్తే 300 శాతం భారీ పెనాల్టీ! NATO: ట్రంప్ సంచలన ప్రకటన... నాటోకు గుడ్ బై చెప్పే యోచనలో అమెరికా? Middle East War: 4,000 లక్ష్యాలు.. వేల సంఖ్యలో బాంబులు: ఇరాన్‌లో ఐడీఎఫ్ విధ్వంసం! Donald Trump: అమెరికాలో నేషనల్ ఎలిజిబుల్ ఓటర్ లిస్ట్: ట్రంప్ కీలక నిర్ణయం Donald Trump: జన్మతః పౌరసత్వ రద్దుపై తగ్గేదే లేదంటున్న ట్రంప్.. సుప్రీంకోర్టు ఏమందంటే? Bunker Buster Bombs: బంకర్ బస్టర్లతో ఇరాన్ పై అమెరికా భీకర దాడులు.. దద్దరిల్లిన ఇస్ఫహాన్ నగరం! TDP 44th Anniversary: అమెరికా బే ఏరియాలో పసుపు జెండా రెపరెపలు... ఘనంగా టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు! Malta TDP 44th Anniversary: మాల్టా తీరాన మిన్నంటిన టీడీపీ ఆవిర్భావ వేడుకలు.. సీఎం చంద్రబాబు విజన్‌పై ఎన్ఆర్ఐల ప్రశంసలు! Israel vs Iran War 2026: ఇరాన్ చమురు కేంద్రాలే టార్గెట్.. అగ్రరాజ్యం సంచలన హెచ్చరికలు! Trump: హర్మూజ్ జలసంధి బాధ్యత మీదే.. చేతులెత్తేసిన ట్రంప్!! NRIలు జాగ్రత్త.. వ్యవసాయ భూములు కొంటున్నారా? ఆస్తి అమ్మకాలపై భారీగా.. ఆ నిబంధనలు అతిక్రమిస్తే 300 శాతం భారీ పెనాల్టీ! NATO: ట్రంప్ సంచలన ప్రకటన... నాటోకు గుడ్ బై చెప్పే యోచనలో అమెరికా? Middle East War: 4,000 లక్ష్యాలు.. వేల సంఖ్యలో బాంబులు: ఇరాన్‌లో ఐడీఎఫ్ విధ్వంసం! Donald Trump: అమెరికాలో నేషనల్ ఎలిజిబుల్ ఓటర్ లిస్ట్: ట్రంప్ కీలక నిర్ణయం Donald Trump: జన్మతః పౌరసత్వ రద్దుపై తగ్గేదే లేదంటున్న ట్రంప్.. సుప్రీంకోర్టు ఏమందంటే? Bunker Buster Bombs: బంకర్ బస్టర్లతో ఇరాన్ పై అమెరికా భీకర దాడులు.. దద్దరిల్లిన ఇస్ఫహాన్ నగరం! TDP 44th Anniversary: అమెరికా బే ఏరియాలో పసుపు జెండా రెపరెపలు... ఘనంగా టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు! Malta TDP 44th Anniversary: మాల్టా తీరాన మిన్నంటిన టీడీపీ ఆవిర్భావ వేడుకలు.. సీఎం చంద్రబాబు విజన్‌పై ఎన్ఆర్ఐల ప్రశంసలు!

Israel vs Iran War 2026: ఇరాన్ చమురు కేంద్రాలే టార్గెట్.. అగ్రరాజ్యం సంచలన హెచ్చరికలు!

Israel vs Iran War 2026: రానున్న రోజుల్లో ఇరాన్ చరిత్రలో ఎన్నడూ చూడని దాడులను ఎదుర్కోబోతోంది." చమురు కేంద్రాలను కూడా ధ్వంసం చేస్తామని హెచ్చరించిన ట్రంప్...

Published : 2026-04-02 10:08:00

 Israel vs Iran: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా హెచ్చరికలు ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్నాయి. వైట్ హౌస్ నుండి జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ట్రంప్  రాబోయే రెండు మూడు వారాల్లో ఇరాన్ ఊహించని రీతిలో భారీ దాడులను ఎదుర్కోబోతోందని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో అగ్రరాజ్యం మరోసారి మధ్యప్రాచ్యంలో తన సైనిక శక్తిని ప్రదర్శించేందుకు సిద్ధమైందని అర్థమవుతోంది.

ట్రంప్ తన ప్రసంగంలో ఇరాన్ రక్షణ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ దేశ నౌకాదళం, వాయుసేన ఇప్పటికే తమ పట్టు కోల్పోయాయని, యుద్ధం చేసే కనీస సామర్థ్యాన్ని కూడా ఆ దేశం కోల్పోయిందని ఆయన విశ్లేషించారు. ముఖ్యంగా ఇరాన్ గర్వంగా చెప్పుకునే క్షిపణి వ్యవస్థ, డ్రోన్ల సాంకేతికత ఇప్పుడు నిర్వీర్యమైపోయాయని ట్రంప్ ఎద్దేవా చేశారు. శత్రువును కోలుకోలేని దెబ్బ తీయడమే తమ లక్ష్యమని, ఇందులో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఆయన నొక్కి చెప్పారు.

ఇరాన్ అగ్ర నాయకత్వంపై కూడా ట్రంప్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆ దేశాన్ని నడిపించే కీలక నేతల ప్రభావం తగ్గిపోయిందని, వారి వ్యూహాలు ఇకపై పనిచేయవని పేర్కొన్నారు. ఇరాన్ తీరు మార్చుకోకపోతే ఆ దేశాన్ని మళ్ళీ 'రాతి యుగానికి' పంపిస్తానని ఆయన ఘాటుగా హెచ్చరించారు. అంటే, ఆధునిక వనరులు ఏవీ లేకుండా ఆ దేశాన్ని దెబ్బతీస్తామన్నది ట్రంప్ పరోక్ష హెచ్చరిక. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి.

మరోవైపు ఇరాన్ ఆర్థిక మూలాలైన చమురు కేంద్రాలపై కూడా అమెరికా కన్నేసింది. ఒకవేళ తమకు అనుకూలంగా ఒప్పందం కుదరకపోతే, ఇరాన్ చమురు క్షేత్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తామని ట్రంప్ స్పష్టం చేశారు. చమురు ఎగుమతులు ఆగిపోతే ఇరాన్ ఆర్థికంగా దివాలా తీయడం ఖాయం. అమెరికా పెట్టిన నిబంధనలకు తలొగ్గి 'డీల్' కుదుర్చుకోకపోతే, ఆ దేశం చరిత్రలో ఎన్నడూ చూడని రీతిలో తీవ్ర పరిణామాలను చవిచూడాల్సి వస్తుందని ఆయన తేల్చి చెప్పారు.

ప్రస్తుత పరిస్థితులను గమనిస్తుంటే ఇరాన్ అమెరికా మధ్య సయోధ్య కుదిరే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ట్రంప్ ఇచ్చిన గడువులోగా ఇరాన్ ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ, ఐక్యరాజ్యసమితి వంటి సంస్థలు ఈ ఉద్రిక్తతలను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ, ట్రంప్ దూకుడు చూస్తుంటే ఇరాన్‌కు గడ్డు కాలం మొదలైనట్లే కనిపిస్తోంది. రానున్న రోజుల్లో పశ్చిమాసియా రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయో వేచి చూడాలి.

Spotlight

Read More →