LIVE
Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  •  Vishaka: ప్రభుత్వ స్కూల్‌గా మారిన విశాఖ విమల విద్యాలయం.. కలెక్టర్, ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా ప్రారంభం!  •  6G Network: భారత్‌లో 6G సంచలనం.. టెలికాం రంగం రూపురేఖలు మార్చబోతున్న కేంద్ర ప్రభుత్వ మాస్టర్ ప్లాన్!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
NRI

TANA: అట్లాంటాలో తానా ఆధ్వర్యంలో సీపీఆర్ శిక్షణ శిబిరం..

TANA: ‘తానా సౌత్ ఈస్ట్’ విభాగం అట్లాంటాలో నిర్వహించిన ‘సీపీఆర్ అవగాహన, శిక్షణ’ కార్యక్రమం విజయవంతంగా జరిగినది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు అత్యవసర పరిస్థితుల్లో చేయాల్సిన ప్రాథమిక వైద్య చర్యలపై అవగాహన పొందారు.

AndhraPravasi News Desk 2 min read
TANA: అట్లాంటాలో తానా ఆధ్వర్యంలో సీపీఆర్ శిక్షణ శిబిరం..

‘సీపీఆర్ అవగాహన, శిక్షణ’ కార్యక్రమం.. 

సుమారు 50 మందికి పైగా సభ్యులు హాజరు.. 

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సమాజ సేవలో భాగంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలకు మంచి ఆదరణ లభిస్తోంది. ఇందులో భాగంగా ‘తానా సౌత్ ఈస్ట్’ విభాగం అట్లాంటాలో నిర్వహించిన ‘సీపీఆర్ అవగాహన, శిక్షణ’ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. మార్చి 29న స్థానికంగా ‘అకేషన్స్’ వేదికగా జరిగిన ఈ శిబిరానికి అక్కడి తెలుగు సమాజం నుంచి మంచి స్పందన కనిపించింది.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు అత్యవసర పరిస్థితుల్లో చేయాల్సిన ప్రాథమిక వైద్య చర్యలపై అవగాహన పొందారు. ముఖ్యంగా గుండెపోటు వంటి ప్రమాదకర పరిస్థితుల్లో సీపీఆర్ (CPR) ఎలా చేయాలి అనే అంశాన్ని ప్రముఖ వైద్యురాలు డాక్టర్ లలిత మేడెపల్లి తన బృందంతో కలిసి సులభంగా, స్పష్టంగా వివరించారు.

సుమారు 50 మందికి పైగా పాల్గొన్న వారికి బొమ్మల ద్వారా హ్యాండ్స్-ఆన్ ప్రాక్టీస్ చేయించడం ఈ శిక్షణకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తికి వైద్య సహాయం అందే వరకు ప్రాణాలను నిలబెట్టే ఈ నైపుణ్యం ఎంత ముఖ్యమో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించారు.

తానా అధ్యక్షుడు నరేన్ కొడాలి, ఈవీపీ శ్రీని లావుల ప్రోత్సాహంతో ఈ కార్యక్రమం నిర్వహించకడం జరిగింది. ఉమెన్ సర్వీసెస్ కో-ఆర్డినేటర్ సోహిని అయనాల ఈ శిబిరాన్ని సమన్వయం చేసి విజయవంతం చేశారు. ఈ సందర్భంగా తానా నాయకులు మాట్లాడుతూ, సమాజంలో ఆరోగ్యంపై అవగాహన పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలను భవిష్యత్తులో మరింత విస్తరించాలని సంకల్పించారు.

ఈ కార్యక్రమంలో సౌత్ ఈస్ట్ రీజినల్ రిప్రజెంటేటివ్ శేఖర్ కొల్లు, ఫౌండేషన్ ట్రస్టీ మధుకర్ యార్లగడ్డ, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ భరత్ మద్దినేని, మాజీ అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు, సోషల్ వెల్ఫేర్ కోఆర్డినేటర్ సునీల్ దేవరపల్లి తదితరులు పాల్గొన్నారు.

అలాగే ఈ శిక్షణ కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసిన స్థానిక తానా ప్రతినిధులు మాలతి నాగభైరవ, పూలని జస్టి, ఆర్థక అన్నే, ఉప్పు శ్రీనివాస్, అనిల్ యలమంచిలి, కోటి కండిమల్ల, నరేన్ నల్లూరి, చైతన్య కొర్రపాటిల సేవలను నాయకత్వం ప్రత్యేకంగా అభినందించింది. కార్యక్రమానికి వేదికను అందించిన కిషోర్ తాటికొండకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

సమాజంలో అత్యవసర సమయంలో ప్రాణాలను రక్షించే సీపీఆర్ వంటి నైపుణ్యాలపై అవగాహన పెంచడంలో ఈ శిబిరం ఒక మంచి ముందడుగుగా నిలిచింది.
 

Be the first to react

More Coverage

TCA: టీ‌సీఏ స్వర్ణోత్సవ వేడుకలకు నృత్య కళాకారుల ఆహ్వానం.. ‘స్వాగత గీతం’, ‘స్వర్ణ వైభవం’ కోసం దరఖాస్తుల స్వీకరణ!

TCA: టీ‌సీఏ స్వర్ణోత్సవ వేడుకలకు నృత్య కళాకారుల ఆహ్వానం.. ‘స్వాగత గీతం’, ‘స్వర్ణ వైభవం’ కోసం దరఖాస్తుల స్వీకరణ!

TCA: అమెరికాలో తెలుగు సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు కృషి చేస్తున్న హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమి…