LIVE
Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  •  Vishaka: ప్రభుత్వ స్కూల్‌గా మారిన విశాఖ విమల విద్యాలయం.. కలెక్టర్, ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా ప్రారంభం!  •  6G Network: భారత్‌లో 6G సంచలనం.. టెలికాం రంగం రూపురేఖలు మార్చబోతున్న కేంద్ర ప్రభుత్వ మాస్టర్ ప్లాన్!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
NRI

New Zealand: న్యూజిలాండ్ వీసా నియమాల్లో మార్పులు! ఏప్రిల్ 30, 2026 నుండి అమలు..

New Zealand: విదేశాలకు వెళ్లి కుటుంబ సభ్యులతో కలవాలనుకునే వారికి కీలకమైన సమాచారం. న్యూజిలాండ్ ప్రభుత్వం పలు వీసా కేటగిరీలలో ఆదాయం, స్పాన్సర్‌షిప్ ప్రమాణాలను పెంచుతున్నట్లు ప్రకటించింది.

AndhraPravasi News Desk 2 min read
New Zealand: న్యూజిలాండ్ వీసా నియమాల్లో మార్పులు! ఏప్రిల్ 30, 2026 నుండి అమలు..

2026 ఏప్రిల్ 30 నుండి అమల్లోకి కొత్త నిబంధనలు..

పేరెంట్ వీసాల్లో కీలక మార్పులు..

విదేశాలకు వెళ్లి కుటుంబ సభ్యులతో కలవాలనుకునే వారికి కీలకమైన సమాచారం. న్యూజిలాండ్ ప్రభుత్వం పలు వీసా కేటగిరీలలో ఆదాయం, స్పాన్సర్‌షిప్ ప్రమాణాలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త నిబంధనలు 2026 ఏప్రిల్ 30 నుంచి అమల్లోకి రానున్నాయి. ముఖ్యంగా పేరెంట్ వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారికి ఈ మార్పులు నేరుగా ప్రభావం చూపనున్నాయి.

ఇమిగ్రేషన్ అధికారుల ప్రకారం, ఈ మార్పులు దేశంలోని వేతనాలు, జీవన వ్యయం, మరియు సంక్షేమ పథకాల ఆధారంగా ప్రతి సంవత్సరం జరిగే సాధారణ సవరణల్లో భాగంగా తీసుకొచ్చినవే.

పేరెంట్ కేటగిరీ రెసిడెంట్ వీసా, పేరెంట్ బూస్ట్ విజిటర్ వీసా కోసం స్పాన్సర్ చేయాలంటే అవసరమైన కనీస ఆదాయం పెరుగుతుంది. ముఖ్యంగా స్పాన్సర్ చేసే తల్లిదండ్రుల సంఖ్య ఆధారంగా ఆదాయం మరింత ఎక్కువగా ఉండాలి.

పేరెంట్ బూస్ట్ విజిటర్ వీసా కోసం స్పాన్సర్ ఆదాయం (ఏప్రిల్ 30, 2026 నుండి):
తల్లి లేదా తండ్రి ఒకరికి: NZD $72,800 (సుమారు రూ. 36.5 లక్షలు)
ఇద్దరికి: NZD $109,200 (రూ. 54.7 లక్షలు)
ముగ్గురికి: NZD $145,600 (రూ. 73 లక్షలు)
నలుగురికి: NZD $182,000 (రూ. 91.2 లక్షలు)
ఐదుగురికి: NZD $218,400 (రూ. 1.09 కోట్లు)
ఆరుగురికి: NZD $254,800 (రూ. 1.27 కోట్లు)
స్పాన్సర్ గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో కనీసం రెండు సంవత్సరాలు ఈ ఆదాయ ప్రమాణాన్ని చేరుకోవాలి.

పేరెంట్ బూస్ట్ విజిటర్ వీసా కింద దరఖాస్తు చేసుకునే వారు తమ ఖర్చులను తాము భరించేందుకు కూడా అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించిన ఆదాయం, సేవింగ్స్ ప్రమాణాలు కూడా పెరుగుతాయి.

వ్యక్తిగత ఆదాయం:
ఒక్కరికి: NZD $33,663.24 (సుమారు రూ. 16.9 లక్షలు)
భాగస్వామితో కలిపి: NZD $51,182.56 (రూ. 25.6 లక్షలు)

సేవింగ్స్ (బ్యాంక్‌లో నిధులు):
ఒక్కరికి: NZD $170,000 (రూ. 85 లక్షలు)
భాగస్వామితో: NZD $260,000 (రూ. 1.3 కోట్లు)
ఈ లెక్కలు ఐదేళ్ల కాలానికి సరిపడే విధంగా ఉండాలని అధికారులు స్పష్టం చేశారు.

పేరెంట్ కేటగిరీ రెసిడెంట్ వీసా కోసం దరఖాస్తు చేసే వారి స్పాన్సర్లు, గత మూడు సంవత్సరాల్లో ఎంపికకు ముందు రెండు సంవత్సరాలలో నిర్దేశించిన ఆదాయం ఉండాలి. ఇప్పటికే దరఖాస్తు చేసిన వారికి ఈ కొత్త నియమాలు వర్తించవు.

పసిఫిక్ యాక్సెస్ కేటగిరీ, సమోవన్ కోటా వీసాలకు కూడా ఆదాయ ప్రమాణాలు పెంచారు. పిల్లలతో దరఖాస్తు చేసే వారికి కనీస ఆదాయం NZD $54,133.04 నుంచి NZD $55,404.96కి పెరిగింది. అయితే ఈ మార్పులు భారతీయులకు వర్తించవని అధికారులు తెలిపారు.

ఎవరికీ ప్రభావం?
పేరెంట్ వీసా కోసం కొత్తగా దరఖాస్తు చేసుకునేవారు
స్పాన్సర్ ద్వారా తల్లిదండ్రులను తీసుకెళ్లాలనుకునేవారు
2026 ఏప్రిల్ 30 తర్వాత అప్లై చేసే వారు

మొత్తంగా చూస్తే,న్యూజిలెండ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ నిర్ణయం వలస విధానాన్ని మరింత క్రమబద్ధంగా మార్చే దిశగా ఒక అడుగు. అయితే, తల్లిదండ్రులను విదేశాలకు తీసుకెళ్లాలనుకునే కుటుంబాలకు ఇది ఆర్థికంగా కొంత భారంగా మారే అవకాశం ఉంది.

Be the first to react

More Coverage

TCA: టీ‌సీఏ స్వర్ణోత్సవ వేడుకలకు నృత్య కళాకారుల ఆహ్వానం.. ‘స్వాగత గీతం’, ‘స్వర్ణ వైభవం’ కోసం దరఖాస్తుల స్వీకరణ!

TCA: టీ‌సీఏ స్వర్ణోత్సవ వేడుకలకు నృత్య కళాకారుల ఆహ్వానం.. ‘స్వాగత గీతం’, ‘స్వర్ణ వైభవం’ కోసం దరఖాస్తుల స్వీకరణ!

TCA: అమెరికాలో తెలుగు సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు కృషి చేస్తున్న హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమి…