Supreme Court: హతీరామ్‌జీ మఠం కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు! Operation Sindoor: శత్రువుల గుండెల్లో వణుకు.. ఆపరేషన్ సింధూర్ 2.0కు రెడీ అవుతున్నాం- ఆర్మీ చీఫ్! USA: గ్రీన్‌కార్డ్ దరఖాస్తుదారులకు అమెరికా ఊరట.. అమెరికా విడిచి వెళ్లాల్సిన అవసరం లేదు! Chandrababu: వైసీపీపై చంద్రబాబు ఘాటు విమర్శలు.. “గొడ్డలి పార్టీ”గా ప్రజల్లో చర్చ! Double Decker Flyover: డబుల్ డెక్ర్ ఫ్లై ఓవర్‌పై కీలక అప్డేట్... రూ.1,000 కోట్లతో ఈ రూట్లో ఇక ట్రాఫిక్ సమస్యలకు చెక్!! Pawan Kalyan: తెలంగాణలో జనసేన బలోపేతంపై పవన్ కళ్యాణ్ ఫోకస్! Tiger Scare: పొలాల్లో పులి అడుగుజాడలు... భయాందోళనలో స్థానిక గ్రామాల ప్రజలు! Trump: ఇరాన్ యుద్ధంపై ట్రంప్ కీలక సమావేశం.. తుది నిర్ణయం? Green Energy: స్కూళ్లు, హాస్టళ్లకు సోలార్ పవర్! 10 లక్షల ఇళ్లకు సోలార్ ప్యానెళ్లు.. సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ !! Pawan Kalyan: మారేడుమిల్లి అటవీ సిబ్బంది సేవలకు పవన్ కళ్యాణ్ ప్రశంసలు! Supreme Court: హతీరామ్‌జీ మఠం కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు! Operation Sindoor: శత్రువుల గుండెల్లో వణుకు.. ఆపరేషన్ సింధూర్ 2.0కు రెడీ అవుతున్నాం- ఆర్మీ చీఫ్! USA: గ్రీన్‌కార్డ్ దరఖాస్తుదారులకు అమెరికా ఊరట.. అమెరికా విడిచి వెళ్లాల్సిన అవసరం లేదు! Chandrababu: వైసీపీపై చంద్రబాబు ఘాటు విమర్శలు.. “గొడ్డలి పార్టీ”గా ప్రజల్లో చర్చ! Double Decker Flyover: డబుల్ డెక్ర్ ఫ్లై ఓవర్‌పై కీలక అప్డేట్... రూ.1,000 కోట్లతో ఈ రూట్లో ఇక ట్రాఫిక్ సమస్యలకు చెక్!! Pawan Kalyan: తెలంగాణలో జనసేన బలోపేతంపై పవన్ కళ్యాణ్ ఫోకస్! Tiger Scare: పొలాల్లో పులి అడుగుజాడలు... భయాందోళనలో స్థానిక గ్రామాల ప్రజలు! Trump: ఇరాన్ యుద్ధంపై ట్రంప్ కీలక సమావేశం.. తుది నిర్ణయం? Green Energy: స్కూళ్లు, హాస్టళ్లకు సోలార్ పవర్! 10 లక్షల ఇళ్లకు సోలార్ ప్యానెళ్లు.. సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ !! Pawan Kalyan: మారేడుమిల్లి అటవీ సిబ్బంది సేవలకు పవన్ కళ్యాణ్ ప్రశంసలు!

USA: గ్రీన్‌కార్డ్ దరఖాస్తుదారులకు అమెరికా ఊరట.. అమెరికా విడిచి వెళ్లాల్సిన అవసరం లేదు!

USA: అమెరికాలో గ్రీన్‌కార్డ్ కోసం ఎదురుచూస్తున్న వలసదారులకు ఊరటనిచ్చే ప్రకటనను అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ (DHS) విడుదల చేసింది. గ్రీన్‌కార్డ్ దరఖాస్తు చేసుకున్న చాలా మంది వలసదారులు తమ దరఖాస్తుల పరిశీలన సమయంలో అమెరికా విడిచి వెళ్లాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

Published : 2026-05-30 14:47:00

వలసదారుల ఆందోళనకు తెరదించిన అమెరికా ప్రభుత్వం..

గ్రీన్‌కార్డ్ దరఖాస్తుదారులకు అమెరికా నుంచి శుభవార్త..

అమెరికాలో గ్రీన్‌కార్డ్ కోసం ఎదురుచూస్తున్న వలసదారులకు ఊరటనిచ్చే ప్రకటనను అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ (DHS) విడుదల చేసింది. గ్రీన్‌కార్డ్ దరఖాస్తు చేసుకున్న చాలా మంది వలసదారులు తమ దరఖాస్తుల పరిశీలన సమయంలో అమెరికా విడిచి వెళ్లాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఇటీవల యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) విడుదల చేసిన ప్రకటనతో వలసదారుల్లో కలకలం రేగిన నేపథ్యంలో DHS ఈ వివరణ ఇచ్చింది.

గత వారం వచ్చిన ప్రకటనలో గ్రీన్‌కార్డ్ అభ్యర్థులు సాధారణంగా తమ స్వదేశాలకు వెళ్లి అక్కడే వేచి ఉండాల్సి వస్తుందని, కేవలం “అసాధారణ పరిస్థితులు” ఉన్నవారికి మాత్రమే మినహాయింపు ఉంటుందని భావించేలా సందేశం వెళ్లింది. దీంతో అమెరికాలో నివసిస్తున్న వలసదారులు, ముఖ్యంగా భారతీయులు సహా పలు దేశాల ఇమ్మిగ్రెంట్ కమ్యూనిటీల్లో ఆందోళన నెలకొంది.

అయితే తాజా వివరణలో DHS అధికారులు ఇది కొత్త విధానం కాదని తెలిపారు. ఇప్పటికే ఇమిగ్రేషన్ అధికారులకు కేసు ప్రాతిపదికన నిర్ణయం తీసుకునే అధికారం ఉందని, అదే విషయాన్ని గుర్తు చేసేలా మాత్రమే మార్గదర్శకాలు విడుదల చేశామని చెప్పారు. చాలా మంది గ్రీన్‌కార్డ్ దరఖాస్తుదారులు తమ కేసులు పరిశీలనలో ఉన్నంతకాలం అమెరికాలోనే ఉండేందుకు అనుమతి కొనసాగుతుందని స్పష్టం చేశారు.

కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రం అధికారులు వేరే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా వీసా గడువు మించిపోయి ఉండటం, ఇతర ఇమిగ్రేషన్ నిబంధనల ఉల్లంఘనలు వంటి అంశాలు ప్రభావం చూపవచ్చని తెలిపారు. అయితే ఎలాంటి కేసుల్లో అమెరికా విడిచి వెళ్లాల్సి వస్తుందన్న దానిపై మాత్రం ఇంకా స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల కాలేదు.

ఈ ప్రకటనతో గత కొన్ని రోజులుగా నెలకొన్న అనిశ్చితికి కొంతవరకు తెరపడింది. మొదటి ప్రకటన వెలువడినప్పుడు శాఖలోని కొందరు అధికారులకే దాని పరిధిపై స్పష్టత లేకపోయిందని అమెరికా మీడియా కథనాలు పేర్కొన్నాయి. వైట్ హౌస్‌కు చెందిన ఓ సీనియర్ అధికారి ఈ అంశాన్ని సాధారణ పరిపాలనా ప్రక్రియగా పేర్కొన్నారు. అమెరికా ఇమ్మిగ్రేషన్ విధానంలో పెద్ద మార్పు ఏదీ జరగలేదని తెలిపారు.

ప్రస్తుతం గ్రీన్‌కార్డ్ కోసం దరఖాస్తు చేసుకున్న ఎక్కువ మంది వలసదారులు అమెరికాలోనే ఉండగలరన్న సంకేతాలను DHS ఇవ్వడంతో వలసదారుల్లో కొంత ఊరట కనిపిస్తోంది. అయితే భవిష్యత్తులో అమలు విధానంపై మరింత స్పష్టత కోసం ఇమ్మిగ్రేషన్ వర్గాలు ఎదురుచూస్తున్నాయి.

Spotlight

Read More →