పాక్ పౌరుల వీసాలపై బ్రిటన్ ఆంక్షలు విధించింది. ఆసైలం (శాశ్వత నివాసం) దరఖాస్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో పాకిస్థానీ పౌరులకు బ్రిటన్ వీసా నిబంధనలను కఠినతరం చేయనుంది. చదువు, ఉద్యోగం కోసం దేశానికి వచ్చి శాశ్వతంగా స్థిరపడుతున్న వీసా ఓవర్ స్టేలు, ఆసైలం దరఖాస్తులపై కఠినమైన పరిమితులను విధించనున్నట్లు టైమ్స్ వార్తా సంస్థ కథనంలో పేర్కొంది. పాకిస్థానీ పౌరులతో పాటు నైజీరియా, శ్రీలంక నుంచి వచ్చే వారి స్టడీ, వర్క్ వీసాలపైనా నిబంధనలను కఠినతరం చేస్తోంది. బ్రిటన్‌లో శాశ్వత నివాసం కోసం వీసా హోల్డర్ల నుంచి ఇటీవల దరఖాస్తులు అసాధారణ స్థాయిలో పెరుగుతుండగా, ఇందులో పాకిస్థానీ పౌరులు అగ్రస్థానంలో ఉన్నారు. గణాంకాల ప్రకారం 2024లో మొత్తం 1,08,000 మంది ఆసైలం కోసం దరఖాస్తు చేసుకోగా, వీరిలో అత్యధికంగా 10,542 మంది పాకిస్థానీ పౌరులే ఉన్నారు.
ఇది కూడా చదవండి: భారత్‌కు పాక్ మధ్యవర్తిని పంపించిందా! ఢిల్లీలో ల్యాండ్ అయిన ఇస్లామిక్ దేశ మంత్రి!
వర్క్, స్టూడెంట్ లేదా విజిటర్స్ వీసాలపై వచ్చి ఆ తర్వాత ఆసైలం కోసం దరఖాస్తు చేసే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో వీసాలు జారీ చేసే సమయంలోనే కఠినంగా వ్యవహరించాలని బ్రిటన్ ప్రభుత్వం భావిస్తోంది. కొత్త నిబంధనల్లో భాగంగా వీసా దరఖాస్తులను వారి ఆసైలం దరఖాస్తు రిస్క్‌ను అంచనా వేయడానికి ప్రొఫైలింగ్ చేస్తారు. అధిక రిస్క్‌గా భావించిన వారి వీసా దరఖాస్తులను తిరస్కరిస్తారు. అంతే కాకుండా వీసా హోల్డర్లు ఆర్థికంగా స్వతంత్రంగా ఉన్నట్లు నిరూపించుకోకపోతే, వారి పన్ను చెల్లింపుదారుల నిధులతో నడిచే వసతి సౌకర్యాలను నిషేధించాలని ప్రభుత్వం యోచిస్తోంది. బ్రిటన్ ప్రభుత్వం 2024లో కేర్ వర్కర్లు, స్టూడెంట్లకు డిపెండెంట్లను తీసుకురాకుండా కఠిన నిబంధనలు విధించింది. దీంతో అప్పటి నుంచి 2025 మార్చి నాటికి వీసా దరఖాస్తులు 37 శాతం తగ్గాయి.
ఇది కూడా చదవండి: ఆ నామినేటెడ్ పదవుల భర్తీకి డేట్ ఫిక్స్! ఎప్పుడంటే!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీలో వారికి గుడ్ న్యూస్..! తల్లికి వందనం ఎప్పటినుంచంటే..?
ఒక్కసారిగా ఆ ప్రాంతంలో తీవ్ర గందరగోళం.. టీడీపీ నేతలకు తప్పిన ప్రమాదం.!
వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వంశీ తో పాటు వారికి కొడా రిమాండ్ పొడిగింపు!
పహల్గాం ఘటనపై సోనూ నిగమ్ సంచలన కామెంట్స్.. షాకిచ్చిన పోలీసులు..
టీడీపీకి తీరని లోటు..! సీనియర్ నేత మాజీ ఎంపీ కన్నుమూత!
వరుస సమీక్షలతో సీఎం చంద్రబాబు బిజీ బిజీ! అధికారులకు కీలక ఆదేశాలు!
జగన్ కు కొత్త పేరు పెట్టిన కూటమి నేతలు! అంతా అదే హాట్ టాపిక్!
డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త! ఇకపై ఇంటి నుంచే..
షాకింగ్ న్యూస్: జగన్ హెలికాప్టర్ ఘటన దర్యాప్తు వేగవంతం! 10 మంది వైసీపీ కార్యకర్తల అరెస్ట్!
నెల్లూరు రూరల్ అభివృద్ధి అద్భుతం.. 60 రోజుల్లోనే 339 అభివృద్ధి పనులు పూర్తి! మంత్రి ప్రశంసలు
పాన్ ఇండియన్ సోషియో కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో.. జాతీయ సాంస్కృతోత్సవ పురస్కార వేడుక!
ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి!
అడ్డంగా బుక్కైన ప్రపంచ యాత్రికుడు అన్వేష్.. పోలీస్ కేసు నమోదు.. ఏం జరిగిందంటే?
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: