విశాఖలోని (Visakhapatnam) భీమిలిలో టీడీపీ నేతలకు (TDP Leaders) పెను ప్రమాదం తప్పింది. భీమిలి పరిధిలోని పద్మనాభంలో ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ నేతలు హాజరయ్యారు. దీంతో సందడి వాతావరణ నెలకొంది. శంకుస్థాపన పూర్తి అయిన తర్వాత జరిగిన పరిణామంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో తీవ్ర గందరగోళం చోటు చేసుకుంది. స్టేజ్ వద్ద జరిగిన హఠాత్పరిణామంతో టీడీపీ నేతలు కూడా ఉలిక్కిపడ్డారు. ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ (Minister Kondapalli Srinivas), ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు (MLA Ganta Srinivas Rao), ఛైర్మన్ శివశంకర్ పాల్గొన్నారు. అంతా కలిసి శంకుస్థాపన పూర్తి చేశారు. కానీ ఇంతలోనే అనుకోని ఘటన చోటు చేసుకుంది. శంకుస్థాపన సమయంలో స్టేజ్ కూలింది. దీంతో స్టేజ్‌పై ఉన్నవాళ్లు భయాందోళనకు గురయ్యారు. శంకుస్థాపన కార్యక్రమం పూర్తయిన అనంతరం నేతలందరూ కూడా ఒకేసారి స్టేజ్ ముందుకు వచ్చేశారు. అయితే సామర్జానికి మించి నేతలు అంతా స్టేజ్ పైకి వచ్చేయడంతో కుప్పకూలింది. ప్రమాద సమయంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఛైర్మన్ శివశంకర్ స్టేజ్‌పైనే ఉన్నారు. అయితే వీరు ఉన్న ప్రాంతంలో కాకుండా చివరలో స్టేజ్ కూలింది. వెంటనే అప్రమత్తమైన నేతలు అంతా స్టేజ్ నుంచి కిందకు దిగేశారు. టీడీపీ నేతలకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే టీడీపీ నేతలు ఉన్న సమయంలో స్టేజ్ కూలిన వార్త సంచలనంగా మారింది.
ఇది కూడా చదవండి: ఆ నామినేటెడ్ పదవుల భర్తీకి డేట్ ఫిక్స్! ఎప్పుడంటే!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వంశీ తో పాటు వారికి కొడా రిమాండ్ పొడిగింపు!
పహల్గాం ఘటనపై సోనూ నిగమ్ సంచలన కామెంట్స్.. షాకిచ్చిన పోలీసులు..
టీడీపీకి తీరని లోటు..! సీనియర్ నేత మాజీ ఎంపీ కన్నుమూత!
వరుస సమీక్షలతో సీఎం చంద్రబాబు బిజీ బిజీ! అధికారులకు కీలక ఆదేశాలు!
జగన్ కు కొత్త పేరు పెట్టిన కూటమి నేతలు! అంతా అదే హాట్ టాపిక్!
డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త! ఇకపై ఇంటి నుంచే..
షాకింగ్ న్యూస్: జగన్ హెలికాప్టర్ ఘటన దర్యాప్తు వేగవంతం! 10 మంది వైసీపీ కార్యకర్తల అరెస్ట్!
నెల్లూరు రూరల్ అభివృద్ధి అద్భుతం.. 60 రోజుల్లోనే 339 అభివృద్ధి పనులు పూర్తి! మంత్రి ప్రశంసలు
పాన్ ఇండియన్ సోషియో కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో.. జాతీయ సాంస్కృతోత్సవ పురస్కార వేడుక!
ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి!
అడ్డంగా బుక్కైన ప్రపంచ యాత్రికుడు అన్వేష్.. పోలీస్ కేసు నమోదు.. ఏం జరిగిందంటే?
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: