పాకిస్తాన్‌పై భారత్ యుద్ధానికి దిగిన నేపథ్యంలో లైన్ ఆఫ్ కంట్రోల్ (LOC) పొడవునా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. సరిహద్దు మొత్తం కూడా భీకరంగా తయారయ్యాయి. పూర్తిస్థాయి యుద్ధానికి సన్నద్ధం అన్నట్లు తయారయ్యాయి.
ఈ పరిస్థితుల మధ్య ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ సయ్యద్ అబ్బాస్ అరాఘ్చి భారత్‌లో అడుగు పెట్టారు. రెండు రోజుల పాటు ఇక్కడ పర్యటించనున్నారు. భారత్- ఇరాన్ మధ్య 20వ జాయింట్ కమిషన్ సమావేశానికి ఆయన కో ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. 2024 ఆగస్టులో విదేశాంగ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అబ్బాస్ భారత పర్యటనకు రావడం ఇదే మొదటిసారి.
ఇది కూడా చదవండి: 'అన్నదాత సుఖీభవ' వారికే వర్తింపు! తాజా నిర్ణయం, మార్గదర్శకాలు!
భారత్-ఇరాన్ ఫ్రెండ్‌షిప్ ట్రీటీపై సంతకం చేసి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నేడు, రేపు ఈ జాయింట్ కమిషన్ ఉన్నత స్థాయి సమావేశం జరుగబోతోంది. ఇందులో- రాజకీయ, ఆర్థిక, వ్యూహాత్మక రంగాలలో పరస్పర సహకారాన్ని మరింతగా పెంచుకోవడానికి గల మార్గాలపై చర్చిస్తారు. కీలకమైన ద్వైపాక్షిక అంశాలను సమీక్షించడం ఈ సమావేశం ప్రధాన లక్ష్యం.
తన పర్యటనలో భాగంగా నేడు న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్‌తో సమావేశం కానున్నారు. ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొంటారు. అనంతరం రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూరకంగా కలుస్తారు. పహల్గావ్‌లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్- పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో అబ్బాస్ అరాఘ్చి భారత్‌లో అడుగు పెట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కొద్దిరోజుల కిందటే ఆయన పాకిస్తాన్‌లో పర్యటించారు. ఆ దేశ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ సయ్యద్ అసిమ్ మునీర్‌తో సమావేశం అయ్యారు.
ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు శుభవార్త! కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు ప్రారంభం! ఎప్పటి నుండి అంటే!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్! ఆ శాఖలో ఉద్యోగాల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్!
గాలికి ఏడేళ్లు జైలు, మాజీ మంత్రికి క్లీన్ చిట్! ఓఎంసీ కేసులో కోర్టు సంచలన తీర్పు..!
ఏపీ లిక్కర్ స్కాంలో దూకుడు పెంచిన ఎస్‌ఐటీ! మరో ముగ్గురు కీలక నేతలపై కేసు నమోదు!
ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి!
ఏపీ లిక్కర్ స్కాంలో దూకుడు పెంచిన ఎస్‌ఐటీ! మరో ముగ్గురు కీలక నేతలపై కేసు నమోదు!
ఒక్కసారిగా ఆ ప్రాంతంలో తీవ్ర గందరగోళం.. టీడీపీ నేతలకు తప్పిన ప్రమాదం.!
అంగన్‌వాడీ టీచర్లకు శుభవార్త.. ఈ నెల(మే) నుంచి అమల్లోకి ఉత్తర్వులు!
వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వంశీ తో పాటు వారికి కొడా రిమాండ్ పొడిగింపు!
ఏపీలో వారందరికీ శుభవార్త! తెల్లరేషన్ కార్డు ఉంటే చాలు, 50 శాతం రాయితీ!
'తల్లికి వందనం' పై తాజా నిర్ణయం! అర్హులు వీరే, నిబంధనలు..!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: