LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Health Tips: పక్షవాతానికి ముందు వచ్చే డేంజర్ బెల్స్.. మైక్రో స్ట్రోక్ పై వైద్యుల వివరణ!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Lifestyle

Hindu Mythology: తిరుమల రహస్యం.. 200 కోట్ల ఏళ్ల చరిత్ర కలిగిన కలియుగ వైకుంఠం వెనుక ఉన్న అసలు కథ!

Lord Venkateswara Story: తిరుమల శ్రీవారి ఆలయానికి ఉన్న 200 కోట్ల ఏళ్ల నాటి అద్భుత చరిత్ర గురించి మీకు తెలుసా? వరాహ స్వామి భూమిపైకి రావడం నుండి, శ్రీనివాసుడు పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకోవడం వరకు.. అసలు స్వామి వారు శిలగా ఎందుకు మారారు? పురాణాల్లో దాగి ఉన్న ఈ ఆసక్తికరమైన ఆధ్యా…

AndhraPravasi News Desk 2 min read
Hindu Mythology: తిరుమల రహస్యం.. 200 కోట్ల ఏళ్ల చరిత్ర కలిగిన కలియుగ వైకుంఠం వెనుక ఉన్న అసలు కథ!

Lord Venkateswara Story: ప్రపంచంలో ఎన్నో ఆలయాలు.. మరెన్నో శక్తివంతమైన క్షేత్రాలు. కానీ, ఒక్కసారి ఆ నిలువెత్తు మాణిక్యాన్ని కళ్లారా చూస్తే చాలు, అక్కడే అలా నిలబడిపోవాలని ప్రతి భక్తుడికి అనిపిస్తుంది. ఆకర్షణ అన్నా, ఆనందం అన్నా అది కేవలం తిరుమల శ్రీవారికే సాధ్యం. అసలు 25 లక్షలకు పైగా గుడులున్న మన దేశంలో, కేవలం తిరుమలకు మాత్రమే ఎందుకంత క్రేజ్? దీని వెనుక ఉన్న అసలు మిస్టరీ ఏంటి?

పురాణాలు ఏం చెబుతున్నాయి?

మన 18 మహాపురాణాల్లో ఒకటైన స్కంద పురాణం ప్రకారం, కలియుగం అంతమయ్యే వరకు భక్తులను కాపాడటానికి శ్రీమహావిష్ణువు స్వయంగా ఈ వేంకటాచలంపై కొలువై ఉంటానని మాట ఇచ్చారు. అందుకే మన పెద్దలు అంటుంటారు, "ఏ గుడికి వెళ్లకపోయినా పర్వాలేదు కానీ, ఒక్కసారి ఆ ఏడుకొండల వాడిని దర్శించుకుంటే చాలు" అని. ఈ కొండలకు దాదాపు 200 కోట్ల ఏళ్ల చరిత్ర ఉందని శాస్త్రవేత్తలు సైతం చెబుతుండటం విశేషం.

వరాహ స్వామితో మొదలైన ప్రస్థానం

తిరుమల చరిత్ర నిజానికి వరాహ స్వామి అవతారంతో మొదలవుతుంది. హిరణ్యాక్షుడిని సంహరించి భూమిని రక్షించిన వరాహ స్వామిని, తనతోనే ఉండమని భూదేవి కోరుతుంది. ఆమె కోరిక మేరకు వైకుంఠం నుండి ఆదిశేషుడు భూమిపైకి వచ్చి ఏడు కొండలుగా మారాడు. అందుకే ఈ ప్రాంతానికి శేషాచలం అని పేరు వచ్చింది.

తొలుత ఈ క్షేత్రాన్ని రక్షించడానికి 'నిషాదుడు' అనే వేటగాడిని స్వామివారు నియమించారు. ఎటువంటి మంత్రాలు తెలియకపోయినా, స్వచ్ఛమైన భక్తితో అతను చేసిన సేవలకు మెచ్చిన స్వామి, అతనికి క్షేత్ర రక్షకుడి హోదా ఇచ్చారు. కాలక్రమేణా ఆ విగ్రహం అడవిలో కలిసిపోయినప్పుడు, ఉత్తర భారత రాజు శంకన మహారాజు కలలోకి వచ్చి స్వామివారు తన ఉనికిని చాటుకున్నారు.

శ్రీనివాసుడి రాక.. అప్పుల కథ

వైకుంఠంలో భృగు మహర్షి చేసిన పని వల్ల లక్ష్మీదేవి భూమికి రావడం, ఆమెను వెతుకుతూ శ్రీహరి శ్రీనివాసుడిగా తిరుమల కొండపైకి చేరడం మనందరికీ తెలిసిన కథే. అయితే ఇక్కడ కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి:

హరినామం ఎలా పుట్టింది?: పుట్టలో ఉన్న శ్రీనివాసుడికి ఒక ఆవు పాలు ఇస్తుంటే, అది చూసిన పశుల కాపరి కోపంతో విసిరిన కర్ర (లేదా గొడ్డలి) స్వామివారి నుదుటికి తగిలింది. ఆ గాయం నుండి రక్తం కారడం వల్లే మనకు 'హరినామం' ప్రాశస్త్యం వచ్చింది.

తలనీలాల వెనుక సాయం: దెబ్బ తగిలిన చోట జుట్టు కోల్పోయిన శ్రీనివాసుడికి, నీలాంబరి (నీలాదేవి) అనే భక్తురాలు తన జుట్టును ధారపోసింది. ఆమె త్యాగానికి గుర్తుగానే నేటికీ భక్తులు తిరుమలలో తలనీలాలు సమర్పిస్తారు.

వడ్డీ కాసుల వాడు: పద్మావతి అమ్మవారితో పెళ్లి కోసం శ్రీనివాసుడు కుబేరుడి వద్ద అప్పు తీసుకున్నాడు. ఆ అప్పుకు వడ్డీని భక్తులు ఇచ్చే కానుకల ద్వారా చెల్లిస్తానని మాట ఇచ్చాడు. అందుకే ఆయన్ని 'వడ్డీ కాసుల వాడు' అని పిలుచుకుంటాం.

నేటికీ సజీవ సాక్ష్యం

తొండమాన్ చక్రవర్తి నిర్మించిన ఆనంద నిలయంలో స్వామివారు నేటికీ శిలా రూపంలో ఉన్నప్పటికీ, ఆయన ప్రాణం ఉన్న దైవంగానే భక్తులు నమ్ముతారు. శ్రీవారి ఎడమ రొమ్ముపై లక్ష్మీదేవి, కుడి వైపున పద్మావతి అమ్మవారు కొలువై ఉండటం ఈ విగ్రహం యొక్క ప్రత్యేకత.మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, తిరుమలలో మనం చేసే దర్శనం కేవలం భౌతికమైంది మాత్రమే కాదు. మరో  వైకుంఠం లో దేవతలు సైతం నిత్యం శ్రీవారిని సేవిస్తూనే ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. అందుకే అక్కడ అడుగుపెట్టగానే ఒక తెలియని పాజిటివ్ వైబ్రేషన్ మనల్ని చుట్టేస్తుంది.

Be the first to react

More Coverage

Highway Signboards: మీరు ఎప్పుడైనా గమనించారా? రోడ్డు పక్కన ఉండే ఆకుపచ్చ బోర్డుల వెనుక ఇంత పెద్ద సైన్స్ ఉందా? తెలిస్తే అబ్బా అంటారు!

Highway Signboards: మీరు ఎప్పుడైనా గమనించారా? రోడ్డు పక్కన ఉండే ఆకుపచ్చ బోర్డుల వెనుక ఇంత పెద్ద సైన్స్ ఉందా? తెలిస్తే అబ్బా అంటారు!

Highway Signboards: మీరు ఎప్పుడైనా హైవేలపై ప్రయాణించినప్పుడు రోడ్డు పక్కన లేదా పైన ఉండే బోర్డులను గమ…

South Korea: కొరియాలో ఉద్యోగం అంత కష్టమా? ‘భారతీయులెవరూ ఇక్కడికి రావద్దు’ అంటూ యువతి వైరల్ వీడియో!

South Korea: కొరియాలో ఉద్యోగం అంత కష్టమా? ‘భారతీయులెవరూ ఇక్కడికి రావద్దు’ అంటూ యువతి వైరల్ వీడియో!

South Korea: దక్షిణ కొరియాలో ఉద్యోగం చేయాలనుకుంటున్న భారతీయులను హెచ్చరిస్తూ ఓ యువతి పోస్ట్ చేసిన వీడ…