ఇప్పటి కాలంలో స్మార్ట్‌ఫోన్ మన రోజువారీ జీవితంలో ఒక భాగంగా మారిందని చెప్పుకోవాలి. కమ్యూనికేషన్ నుంచి వినోదం వరకు ప్రతి చిన్న పనికి ఫోన్ వాడడం సర్వసాధారణమే. చిన్న దగ్గు నుంచి పెద్ద వ్యాధి వరకు యూట్యూబ్ లో గూగుల్ లో తెగ వెతికేస్తాం కానీ ఫోన్ చార్జింగ్ త్వరగా ఎందుకు అయిపోతున్న అన్న విషయాన్ని మాత్రం ఎవరూ పట్టించుకోరు. చార్జింగ్ అయిపోతే చాలు వెంటనే వెళ్లి ఛార్జింగ్ పెట్టేస్తారు. అసలు మీ ఫోన్ లో చార్జింగ్ ఎక్కువ సేపు ఎందుకు ఉండట్లేదు మీకు తెలుసా. తెలియకపోతే తెలుసుకోండి మరి.
మొదటిగా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే మీ ఫోన్ కి కంపెనీ వారు ఇచ్చే చార్జర్ తో మాత్రమే ఛార్జింగ్ పెట్టడం ద్వారా ఫోన్ త్వరగా వేడెక్కకుండా బ్యాటరీ కూడా ఎక్కువ కాలం మన్నికగా వస్తుంది. చాలామంది ఫోన్ కి ఛార్జింగ్ పెట్టి ఫోన్ చూస్తా ఉంటారు అలా చూడడం కూడా చార్జింగ్ లేకపోవడానికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు. అలా చేయడం ద్వారా మీ బ్యాటరీ అనేది బాగా వేడికి గురై శాశ్వతంగా ఫోన్ పని చేయకుండా పోతుంది.
100% ఛార్జింగ్ పెట్టడం కూడా మంచిది కాదు సుమీ! నైట్ అంతా 100% ఛార్జింగ్ అవ్వాలని ఫోన్ కి ఛార్జింగ్ పెట్టేస్తూ ఉంటాం, గంటన్నరలో ఎక్కాల్సిన చార్జి ఉదయం 6:00 వరకు కూడా చార్జింగ్ పెట్టడం ద్వారా బ్యాటరీ అనేది త్వరగా వేడెక్కి ఫోన్లో ఉండే ప్రతి పార్ట్ ఎఫెక్ట్ అవుతుందని ఎలక్ట్రికల్ నిపుణులు చెప్తున్నారు.
టెక్ నిపుణుల ప్రకారం 80 నుంచి 90 శాతం వరకు మాత్రమే ఛార్జ్ చేయడం మంచిదని చెబుతున్నారు. ఆపిల్, శాంసంగ్ వంటి ప్రముఖ కంపెనీలు కూడా బ్యాటరీ హెల్త్ కోసం ఫీచర్లు అందిస్తున్నాయి. ఇవి వినియోగదారులకు 80 లేదా 90 శాతం వద్దే ఛార్జింగ్ ఆగేలా త్వరలో తీసుకురానున్నారు
మరి ముఖ్యమైన విషయం ఏమిటంటే చాలామంది త్వరగా బ్యాటరీ ఫుల్ చేయడానికి ఫాస్ట్ ఛార్జర్ వాడతారు. సాధ్యమైనంత వరకు సాధారణ ఛార్జింగ్ వాడటం మంచిది. అలాగే ఫోన్ 20% కంటే తక్కువకు ఉండకుండా చూసుకోవాలి. అవసరమైనప్పుడు మాత్రమే ఛార్జింగ్ పెట్టడం వల్ల బ్యాటరీ ఎక్కువకాలం వస్తుందట.