పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘OG’ నుంచి భారీ అప్డేట్ వచ్చేసింది. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి మొదటి పాట విడుదలకు సిద్ధమైంది. ఈ ఫస్ట్ సింగిల్‌ను ఆగస్టు 2న రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో పవన్ కళ్యాణ్ పవర్‌ఫుల్ లుక్‌లో మెరిసిపోతున్నారు. మాస్, స్టైల్ కలబోతగా ఉన్న ఈ పోస్టర్‌కి అభిమానులు ఫిదా అయిపోయారు. పాట కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు ఇది మంచి గిఫ్ట్‌గా నిలుస్తోంది.
ఈ సినిమాలో పవన్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. సంగీత దర్శకుడిగా థమన్ పనిచేస్తుండగా, ఆయన మ్యూజిక్ మరోసారి సినిమాకు హైప్ తీసుకురావడంలో ముఖ్య పాత్ర పోషిస్తుందని అంచనాలున్నాయి.
ఇక సినిమా విషయానికి వస్తే, OG సినిమాను సెప్టెంబర్ 25న గ్రాండ్‌గా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. పవన్ ఫ్యాన్స్‌తో పాటు తెలుగు సినీ ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొన్న ఈ ప్రాజెక్ట్ పక్కా కమర్షియల్ హంగులతో రూపొందుతోంది. తక్కువలోనే సినిమా షూటింగ్ పూర్తిచేసి, త్వరగా థియేటర్లలోకి తీసుకురావడం యూనిట్ లక్ష్యంగా పెట్టుకుంది.
ఇక ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్‌లు, పోస్టర్లు సినిమాపై మరింత క్రేజ్ పెంచాయి. OG చిత్రంతో మరోసారి పవన్ కళ్యాణ్ మాస్ అవతారంలో ప్రేక్షకులను అలరించనున్నారని అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు.