ఎయిర్‌పోర్ట్‌లలో ఉచితంగా లభించే లాంజ్ సదుపాయాలు అనేవి వాస్తవానికి free కావని, వాటి వెనుక ఒక ఎకనమిక్ ప్లాన్ ఉందని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువగా ప్రయాణించే వ్యక్తులకు లాంజ్ యాక్సెస్ ద్వారా ప్రీమియం క్రెడిట్ కార్డులపై ఆసక్తి పెరిగేలా చేసి, వారిని loyal customers గా మార్చేందుకు ఇది ఒక వ్యూహంగా పనిచేస్తుంది. ఫ్రీ లాంజ్ ద్వారా కస్టమర్ లోoyalty పెరిగితే, వారు తర్వాత అధిక రుసుముతో కూడిన ప్రీమియం కార్డుల వైపు మళ్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
నిజానికి లాంజ్ యాక్సెస్ అనేది క్రెడిట్ కార్డ్ ప్రయోజనాల్లో భాగమే తప్ప అది పూర్తిగా ఉచితమని అనుకోవడం పొరపాటు. టెక్ నిపుణుడు తక్రేజా చెప్పిన వివరాల ప్రకారం, కస్టమర్లు వార్షిక రుసుములు చెల్లించడమో లేదా అధిక ఖర్చు చేయడమో ద్వారా ఈ సదుపాయాన్ని వినియోగించగలుగుతున్నారు. అంటే, లాంజ్ యాక్సెస్ కోసం ఖర్చు మనకెప్పుడో ముందే డైరెక్ట్ లేదా ఇన్‌డైరెక్ట్‌గా జరిగింది. ఆయన ఈ విషయంపై చేసిన పోస్ట్‌కు 12 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.