‘అన్నదాత సుఖీభవ’ పథకంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎస్ విజయానంద్‌తో పాటు వ్యవసాయ, ఆర్థిక, రెవెన్యూ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అలాగే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు కూడా ఈ సమీక్షలో భాగమయ్యారు.
ఆగస్టు 2న పీఎం కిసాన్ నిధులతో పాటు అన్నదాత సుఖీభవ కింద రైతుల ఖాతాల్లో మద్దతు నిధులు జమ కానున్నాయి. ఈ నిధుల విడుదలను ప్రకాశం జిల్లాలో ప్రత్యేకంగా నిర్వహించే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు.
ఈ నేపథ్యంలో పథకం అమలు, నిధుల పంపిణీ, మరియు రైతులకు సకాలంలో సాయం అందించే విధానాలపై సీఎం అధికారులతో సమగ్రంగా చర్చించారు. రైతుల సంక్షేమం కోసం పథకం సమర్థవంతంగా అమలు కావాలని ఆయన ఆదేశించారు.