రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) అవేర్ 2.0 వెర్షన్ ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు విపత్తులు, తుపానులు, తదితర వాతావరణ మార్పులపై ఎప్పటికప్పుడు అలర్టులు పంపి అవగాహన (అవేర్‌నెస్) కలిగిస్తోందని రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖ కార్యదర్వి భాస్కర్ కాటంనేని తెలిపారు.
మండల స్థాయి వరకు కూడా వాతావరణం ఎలా ఉంటుంది అనేది, ఎప్పుడు పిడుగుపాటు జరుగుతుంది, భారీ వర్షాలు ఎప్పుడు కురుస్తాయి, ఆయా జిల్లాల్లోని రిజర్వాయర్లలోకి, నదుల్లోకి ఎంత నీరు వస్తోంది, ఎంత నీరు నిల్వ ఉంది తదితర వివరాలన్నీ ఎప్పటికప్పుడు రియల్ టైమ్‌లో పొందుపరుస్తున్నామని, దీన్ని జిల్లా కలెక్టర్లు సద్వినియోగం చేసుకోవాలన్నారు. వాతావరణం గురించి ఆర్టీజీఎస్ అవేర్ విభాగం ప్రత్యేక వెబ్‌సైట్ రూపొందించిందని, ఇది ప్రజలందరికీ అందుబాటులో ఉందన్నారు.
ఇప్పటికే ప్రవైటే సరకు రవాణ సంస్థలు, రవాణ సంస్థలు చాలా బాగా ఉపయోగించుకుంటున్నాయన్నారు. ఎప్పుడు వర్షాలు కురుస్తాయో అవేర్ సైటు లో తెలుసుకుని తదనుగుణంగా తమ సరకు వాహనాల కదలికలను నియంత్రించుకుంటున్నారని చెప్పారు. జిల్లాల్లో ప్రభుత్వాధికారులు దీన్ని సద్వినియోగం చేసుకుంటే ఆయా జిల్లాల్లో అద్భుతమైన ఫలితాలు సాధించవ్చన్నారు.
ప్రత్యేక సైరన్లు..
గ్రామాల్లో ప్రజలు పిడగు పాటు నుంచి కాపాడటానికి ప్రతి గ్రామ సచివాలయంలో ఒక ప్రత్యేక సైరన్ వ్యవస్థ ఏర్పాటు చేయనున్నామన్నారు. ఇప్పటికే ప్రయోగాత్మకంగా జిల్లాలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకుని ఈ ప్రత్యేక సైరన్ వ్యవస్థ పబ్లిక్ అనౌన్స్‌మెంటు వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కింద ఏర్పాటు చేసిన ఈ సైరన్ల పనితీరు అద్భుతంగా ఉందన్నారు.
పిడుగు పడటానికి ముందుగానే ఆ ప్రాంతంలో ఈ సైరన్ గ్రామమంతా మారుమోగేలా పెద్దగా సైరన్ శబ్దం వస్తుందని, దీనికి సెల్‌ఫోన్ సిగ్నళ్లు లేకపోయినా సరే ఇస్రో శాటిలైట్ సహకారంతో ఎలాంటి సిగ్నళ్లు లేకున్నా పనిచేస్తుందన్నారు. దీని ద్వారా ప్రజలు అప్రమత్తమై పిడుగుపాటు, వరదలు, ఉత్పాత సమయాల్లో సురక్షిత ప్రాంతాలకు వెళ్లే వీలు కలుగుతుందన్నారు.
గ్రామంలో ఒక ఎత్తైన భవనం చూసుకుని ఈ సైరన్ వ్యవస్థను రూ.2 లక్షల వ్యయంతో ఏర్పాటు చేయొచ్చని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు ఈ విధానం అమలు చేయాలంటే రూన..340 కోట్లు ఖర్చు అవుతుందని, సీఎంగారి సూచనతో మొదట వల్నరబుల్ గ్రామాలను గుర్తించి అక్కడ రూ.10-15 కోట్ల వ్యయంతో ఈ విధానం అమలు చేస్తామని చెప్పారు. దీనిపైన కూడా జిల్లా కలెక్టర్లు దృష్టి సారించాలని సూచించారు.
అక్టోబరుకల్లా జిల్లా ఆర్టీజీ సెంటర్లు..
ఈ అక్టోబరు నెలాఖరు కల్లా జిల్లా ఆర్టీజీఎస్ కేంద్రాలను పూర్తి చేయనున్నామని తెలిపారు. జిల్లా కలెక్టర్లు కూడా ఈ జిల్లా ఆర్టీజీ కేంద్రాల నిర్మాణ పనుల ప్రగతిని ప్రత్యేకంగా పరిశీలించి ఆ పనులు వేగవంతంగా పూర్తయ్యేలా చూడాలని కోరారు.
డేటా లేక్‌లో 6 పెటాబైట్స్ డేటా..
ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో ఉన్న డేటాను అనుసంధానిస్తూ ఆర్టీజీఎస్ ఒక పెద్ద కేంద్రీకృత డేటా లేక్ ఏర్పాటు చేసిందన్నారు. 6 పెటాబైట్ల డేటా ఇప్పపుడీ డేటా లేక్‌లో నిక్షిప్తమై ఉందన్నారు. జిల్లాల్లో అధికారులు కొత్తగా ఎలాంటి డేటా సెట్స్ ఏర్పాటు చేయొద్దని సూచించారు.
మీ వద్ద ఇప్పటికీ ఎలాటి డేటా ఉన్నా డేటా లేక్‌తో అనుసంధానం చేయాలన్నారు. డేటా లేక్ ఆధారంగా డేటా లెన్స్ ను ఆర్టీజీఎస్ రూపొందించన్నారు. ఇదొక రియల్ టైమ్ డ్యాష్ బోర్డు అని చెప్పారు. ఇది జిల్లా కలెక్టర్లు, అధికారులకు ఎంతో ఉపయోగపడే సాధనమన్నారు. జిల్లాల్లో మీకు కావాల్సిన సమస్త సమాచారం కూడా ఈ డేట్ లెన్స్‌లో నిక్షిప్తమై ఉంటుందన్నారు.
దీని కోసం మళ్లీ జిల్లా స్థాయిలో అధికారులు ప్రత్యేక కసరత్తు చేయాల్సిన అవసరం లేదన్నారు. దీన్ని జిల్లా కలెక్టర్లంతా సద్వినియోగం చేసుకోవడంతో పాటు జిల్లాల్లో కింది స్థాయి అధికారులు సైతం సద్వినియోగం చేసుకునే చర్యలు తీసుకోవాలని కోరారు.
ఏఐ ఆధారిత సింగిల్ సెర్చి బార్..
రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి సమస్త సమాచారాన్ని ప్రజలెవ్వరైనా తెలుసుకోవడానికి వీలుగా ఆర్టీజీఎస్ కృత్రిమ మేథ (ఏఐ) ఆధారిత సింగిల్ సెర్చి టూల్ బార్‌ను రూపొందించిందన్నారు. ఇందులో ప్రభుత్వ సమాచారానికి సంబంధించి 80 లక్షల డాక్యుమెంట్లను పొందుపరిచామన్నారు.
జీఓల సహా ప్రజలకు ఏ శాఖకు సంబంధించి ఎలాంటి సమాచారం కావాలన్నా ఈ సింగిల్ సెర్చి బార్ నుంచే తెలుసుకోవచ్చన్నారు. వాయిస్ ఇంటరాక్టివ్ సదుపాయం కూడా ఇందులో కల్పించామన్నారు. దీనిపైన కూడా ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆయన జిల్లా కలెక్టర్లను కోరారు.
ఆరు నెలల్లో వందశాతం కనెక్టివిటీ….
రాష్ట్రంలోని గిరిజన, మారు మూల ప్రాంతాలకు కూడా మొబైల్ సిగ్నల్, మొబైల్ కనెక్టివిటీ అనే సమస్య లేకుండా ఆరు నెలల్లో పరిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. కొన్ని గిరిజన ప్రాంతాల్లో మొబైల్ కనెక్టివిటీ లేకుండా పలు సమస్యలు వస్తున్నాయని, ఆయా ప్రాంతాల్లో మొబైల్ టవర్ల నిర్మాణం తక్షణం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.
రతన్‌టాటా ఇన్నోవేషన్ హబ్‌పై ప్రత్యేక దృష్టి…
రాష్ట్రంలో ఏర్పాటు చేసిన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌పై జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలని భాస్కర్ కాటంనేని కోరారు. ప్రస్తుతం అమరావతి, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపురం, రాజమండ్రిలో ఈ హబ్‌లు ఏర్పాటవుతున్నాయన్నారు. వీటి ద్వారా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలగబోతున్నాయని చెప్పారు. 20 వేల అంకుర పరిశ్రమలు వీటి ద్వారా ఏర్పాటు కాబోతున్నాయని, దాదాపు లక్ష ఉద్యోగావకాశాలు కల్పించనున్నారని చెప్పారు.