ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ప్రీమియం హ్యాండ్‌సెట్‌ల ధరలు సాధారణ వినియోగదారులకు అందని ద్రాక్షలుగా మారాయి. అయితే ఈసారి అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సందర్భంగా శాంసంగ్ తన ఫ్లాగ్‌షిప్ ఫోన్ Samsung Galaxy S25 Ultra 5G ను భారీ తగ్గింపుతో అందుబాటులోకి తెచ్చింది. సాధారణంగా రూ. 1,29,999 ధర కలిగిన ఈ హ్యాండ్‌సెట్ ఇప్పుడు రూ. 24,001 తగ్గింపుతో రూ. 1,05,998కి లభిస్తోంది. అదనంగా ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై రూ. 1,500 వరకు అదనపు డిస్కౌంట్ కూడా పొందవచ్చు. అంటే 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్‌ను కేవలం రూ. 1,04,500కే సొంతం చేసుకోవచ్చు. EMI ఆప్షన్ కింద నెలకు రూ. 5,114 నుంచి చెల్లింపులు ప్రారంభించవచ్చు. అంతేకాకుండా పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్‌లో ఇస్తే గరిష్టంగా రూ. 43,300 వరకు తగ్గింపు పొందే అవకాశం ఉంది.
Galaxy S25 Ultra 5G ప్రీమియం డిజైన్‌తో వస్తోంది. టైటానియం ఫ్రేమ్, Corning Gorilla Armor 2 Glass రక్షణతో ఫోన్ బలంగా, స్టైలిష్‌గా నిలుస్తుంది. IP68 రేటింగ్ ఉన్నందున నీరు, ధూళి వంటి కఠినమైన పరిస్థితుల్లోనూ నమ్మకంగా ఉపయోగించుకోవచ్చు. డిస్‌ప్లే విషయానికొస్తే 6.9 అంగుళాల QHD+ డైనమిక్ LTPO AMOLED 2X స్క్రీన్, 120Hz వేరియబుల్ రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్, విజన్ బూస్టర్ టెక్నాలజీ వంటి ఫీచర్లు ఉన్నాయి. గేమింగ్, వీడియోలు, స్క్రోలింగ్ అన్నీ సూపర్ స్మూత్‌గా అనుభూతి కలిగిస్తాయి. ఈ కారణంగా Galaxy S25 Ultra ప్రీమియం యూజర్లకు అద్భుతమైన ఆప్షన్‌గా నిలుస్తోంది.
ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ ఇష్టపడే వారికి ఈ హ్యాండ్‌సెట్ ఓ వరం అని చెప్పాలి. 200MP OIS ప్రైమరీ కెమెరాతో పాటు 50MP అల్ట్రావైడ్, 50MP పెరిస్కోప్ టెలిఫోటో (5x ఆప్టికల్ జూమ్), 10MP టెలిఫోటో (3x ఆప్టికల్ జూమ్) లెన్స్‌లు కలిపి టాప్-లెవల్ కెమెరా అనుభవాన్ని ఇస్తాయి. 8K వీడియో రికార్డింగ్, నైట్ మోడ్, AI ఇమేజ్ ప్రాసెసింగ్ ఫీచర్లు ఫోటోలను మరింత ఆకర్షణీయంగా మార్చుతాయి. ముందు భాగంలో ఉన్న హై-రెజల్యూషన్ సెల్ఫీ కెమెరా క్లారిటీని కొత్త స్థాయికి తీసుకెళ్తుంది. పనితీరు విషయానికి వస్తే, ఈ ఫోన్ Qualcomm Snapdragon 8 Elite చిప్‌సెట్‌తో వస్తోంది. 4.47GHz స్పీడ్ కలిగిన ఆక్టా-కోర్ CPU, Adreno 830 GPUతో కలిపి హై-పర్ఫార్మెన్స్ అందిస్తుంది. Android 15 ఆధారంగా రూపొందించిన One UI 7 సాఫ్ట్‌వేర్ యూజర్ అనుభవాన్ని మరింత సులభతరం చేస్తుంది.
Galaxy S25 Ultra 5G లో 5,000mAh బ్యాటరీ ఉంది. 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్ మద్దతుతో వేగంగా చార్జ్ అవుతుంది. అలాగే రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ ద్వారా ఇతర పరికరాలను కూడా ఛార్జ్ చేయవచ్చు. Ultrasonic Fingerprint Sensor ద్వారా వేగంగా అన్‌లాక్ చేయవచ్చు. డాల్బీ ఆట్మాస్ సపోర్ట్‌తో డ్యూయల్ స్పీకర్లు అద్భుతమైన ఆడియో అనుభూతిని ఇస్తాయి. కనెక్టివిటీ ఆప్షన్లలో 5G, Wi-Fi 7, Bluetooth 5.4, NFC ఉన్నాయి. దీర్ఘకాలిక సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు, భద్రతా ప్యాచ్‌లతో యూజర్లకు సురక్షితమైన, నమ్మకమైన అనుభవం లభిస్తుంది. ఈ ఆఫర్ కారణంగా ప్రీమియం హ్యాండ్‌సెట్‌ను తక్కువ ధరలో పొందే అరుదైన అవకాశం వినియోగదారులకు దక్కుతోంది.