అధిక-నికర విలువ కలిగిన పెట్టుబడిదారులకు, వ్యాపారవేత్తలకు, నైపుణ్యం కలిగిన నిపుణులకు మరియు సాంకేతిక ఆవిష్కర్తలకు ప్రసిద్ధి చెందిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) ఇప్పుడు పదవీ విరమణ చేసిన వారికి కూడా ఆకర్షణీయమైన నివాస స్థలంగా మారుతోంది.
ఐదేళ్ల పునరుద్ధరించదగిన రిటైర్‌మెంట్ వీసా ద్వారా, 55 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ఆర్థికంగా స్థిరమైన విదేశీయులకు ఉద్యోగం లేదా వ్యాపారం అవసరం లేకుండానే దీర్ఘకాలిక నివాసాన్ని UAE అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తుంది ఇది కేవలం కెరీర్ నిర్మించుకోవడానికి మాత్రమే కాకుండా, ప్రశాంతంగా ఆహ్లాదకరమైన జీవితాన్ని గడపాలనే వారికి ఇది ఒక గొప్ప అవకాశమని చెప్పుకోవచ్చు.
యుఏఈ రిటైర్మెంట్ వీసా అంటే ఏమిటి దానికి సంబంధించిన ప్రతి విషయాలు ముందుగా మనం తెలుసుకోవాలి.యుఏఈ రిటైర్మెంట్ వీసా కార్యక్రమం, విదేశీ పదవీ విరమణదారులు తమ ఉద్యోగ జీవితం తర్వాత దేశంలో స్థిరపడటానికి ఐదేళ్ల పునరుద్ధరించదగిన నివాస అవకాశాన్ని అందిస్తుంది. ఈ విధానం అన్ని ఎమిరేట్స్‌లో వర్తిస్తుంది. దుబాయ్ అయితే దీనికి అదనంగా ప్రత్యేక నిబంధనలను కూడా జోడించింది. ఇది డిసెంబర్ 2024లో ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్‌షిప్, కస్టమ్స్, అండ్ పోర్ట్ సెక్యూరిటీ (ICP) ద్వారా ప్రవేశపెట్టబడింది.
అర్హత ప్రమాణాలు మరియు వీసా కోసం దరఖాస్తు చేయడానికి కొన్ని ప్రాథమిక అర్హతలు తప్పనిసరి. కనీస వయస్సు 55 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ అదేవిధంగా పని అనుభవం యుఏఈ లోపల లేదా వెలుపల కనీసం 15 సంవత్సరాల మొత్తం పని అనుభవం కలిగి ఉండాలి.
అదేవిధంగా ఆర్థిక నిబంధనలలో కనీసం వీటిలో ఒక్కటైనా కలిగి ఉండాలి.యుఏఈలో 1 మిలియన్ AED ($270,000) లేదా అంతకంటే ఎక్కువ విలువైన ఆస్తి కలిగి ఉండాలి.కనీసం 1 మిలియన్ AED ($270,000) పొదుపులు ఉండాలి.నెలవారీ ఆదాయం 20,000 AED ($5,400) తప్పనిసరి దుబాయ్ ప్రత్యేక నిబంధనలో భాగంగా దుబాయ్ నివాసితులకు కనీస నెలవారీ ఆదాయం 15,000 AED ($4,050) గా ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ ICP యొక్క అధికారిక వెబ్‌సైట్ లేదా UAEICP స్మార్ట్ అప్లికేషన్ ద్వారా జరుగుతుంది. దరఖాస్తుదారులు వారి ఆర్థిక అర్హతకు అనుగుణంగా పత్రాలను సమర్పించాలి.రియల్ ఎస్టేట్ యజమానులకు పాస్‌పోర్ట్ కాపీ, ల్యాండ్ అండ్ ప్రాపర్టీ డిపార్ట్‌మెంట్ జారీ చేసిన ఆస్తి యాజమాన్య రుజువు లేదా ఆస్తి పత్రాలు , బ్యాంకులో పొదుపులు ఉన్నవారికి వ్యక్తిగత ఫోటో, పాస్‌పోర్ట్ కాపీ, ఆర్థిక డిపాజిట్ పత్రం మరియు డిపాజిట్‌ను యుఏఈలోకి బదిలీ చేసినట్లు నిర్ధారించే అంగీకార పత్రం తప్పనిసరి.
నెలవారీ ఆదాయం ఉన్నవారికి వ్యక్తిగత ఫోటో, పాస్‌పోర్ట్ కాపీ, గత ఆరు నెలల బ్యాంక్ ఖాతా స్టేట్‌మెంట్ మరియు వారు ఏ ఉద్యోగంలో ప్రావీణ్యతను కలిగి ఉన్నారు అందుకు సంబంధించిన అధికారిక పత్రని సమర్పించాల్సి ఉంటుంది.ఖర్చులు మరియు ప్రయోజనాలు రిటైర్‌మెంట్ వీసా ఉచితం కానప్పటికీ, అనేక ప్రయోజనాలు ఉన్నాయి.
దరఖాస్తు చేయడానికి సుమారుగా 2,300 AED నుండి 3,800 AED ($621 నుండి $1,026) వరకు ఖర్చు అవుతుంది, దీనిలో వైద్య పరీక్ష, ఎమిరేట్స్ ఐడి, వీసా రుసుములు, మరియు దుబాయ్ ల్యాండ్ డిపార్ట్‌మెంట్ ఫీజులు ఉంటాయి. ఆరోగ్య బీమా ఖర్చులు వ్యక్తి వయస్సు మరియు ప్రొవైడర్‌పై ఆధారపడి పడుతూ ఉంటాయి.
ఆదాయం, ఆస్తి లేదా సంపదపై పన్ను ఉండదు.జీవిత భాగస్వామి మరియు పిల్లలకు స్పాన్సర్‌షిప్ అవకాశం. అగ్రశ్రేణి ఆరోగ్య సంరక్షణ సేవలు.వీసా కాలంలో ఎప్పుడైనా దేశంలోకి ప్రవేశించడం మరియు నిష్క్రమించడం అవకాశం ఉంటుంది.
ఐదేళ్ల పునరుద్ధరణ అవకాశం ద్వారా దీర్ఘకాలిక స్థిరత్వం.ఈ కార్యక్రమంలో యుఏఈ యొక్క విజన్ 2031లో భాగం. ఇది దేశ ఆదాయ వనరులను వైవిధ్యపరచడం, ప్రపంచవ్యాప్తంగా ప్రతిభను ఆకర్షించడం మరియు యుఏఈని కేవలం కెరీర్ కోసం కాకుండా పదవీ విరమణకు మరియు నాణ్యమైన జీవితానికి కూడా అనువైన గమ్యస్థానంగా మార్చడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ వీసా రిటైరైన వారికి సురక్షితమైన మరియు పన్ను రహిత వాతావరణాన్ని అందిస్తూ, యుఏఈని మరింత ఆకర్షణీయమైన నివాస గమ్యస్థానంగా మీ జీవితాన్ని మార్చుకోవచ్చు.