నేటి డాక్టర్ లు చెప్పినట్లు ఎప్పుడు ఆకలిగా అనిపిస్తుందో అప్పుడు మాత్రమే ఆహారం తీసుకోవడం వల్ల మన ఆరోగ్యం పదలం గానే ఉంటుంది అలానే అధిక బరువుకు స్వస్తి చెప్పవచ్చు.ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ సన్నని ఆకృతితో ఉన్న శరీరాన్ని ఇష్టపడుతున్నారు. అందుకోసం జిమ్‌లో గంటల తరబడి కష్టపడుతున్నారు,మరికొందరు ఉపవాసం ద్వారా ఊబకాయం తగ్గించుకోవచ్చని తినడం కూడా మానేస్తున్నారు. అయితే సరైన ఆహారం సరైన నిద్ర లేకపోతే ఎన్ని ఉపవాసాలు చేసినా ఫలితం ఉండదని వైద్యులు చెబుతున్నారు.
ఉపవాసం ద్వారా బరువు తగ్గడం అనేది ఒక పద్ధతి. సరైన పద్ధతి లో పోషకాలు, ఖనిజాలు, కొవ్వులు సమతుల్యంగా ఉండే ఆహారం తీసుకుంటే సులభంగా బరువు తగ్గవచ్చని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.ఇటీవల జరిగిన ఒక అధ్యయనంలో 25 ఏళ్ల యువకుడు 36 గంటల ఉపవాసం చేసి 5 కిలోల బరువు తగ్గాడు. కానీ దీనివల్ల అతడు ఎసిడిటీ, కడుపు నొప్పి, నిద్రలేమి, శ్వాసకోశ సమస్యలతో బాధపడ్డాడు.
కుస్తీ వీరులు, బాక్సర్లు తరచుగా ఇలాంటి పద్ధతులు పాటించినప్పటికీ, మనలాంటి వాళ్లు ప్రయత్నిస్తే నీరసం, కళ్ళు తిరగడం, పాలిపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇది తాత్కాలికంగా ఫలితాలు ఇచ్చినా, దీర్ఘకాలంలో ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు.
అధిక బరువుతో బాధపడేవారు 16 గంటలు ఉపవాసం ఉండి, 8 గంటల వ్యవధిలో ఆహారం తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. లేదా 5:2 ప్రణాళిక (5 రోజులు తక్కువ క్యాలరీల ఆహారం, 2 రోజులు సాధారణ ఆహారం) పాటించడం ద్వారా కూడా మంచి ఫలితాలు పొందవచ్చు. ఇది కూడా చేయలేకపోతే రాత్రిపూట 12 నుండి 14 గంటల పాటు సమతుల్యమైన ఆహారంతో ఉపవాసం ఉండడం కూడా మంచి ఫలితాలను ఇస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.
ఈ సమాచారం కేవలం మీ అవగాహనకు మాత్రమే ఎటువంటి సందేహాలు మీ డాక్టర్ ని లేదా మీ డైటీషియన్ సంప్రదించగలరు.