Amaravati iconic bridge: అమరావతి ఐకానిక్ వంతెన మోడల్ ఇదే.. సీఎం చంద్రబాబు ఆమోదం!

కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది. ఆదివారం ఒక్కరోజునే దాదాపు 77,893 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. అందులో 24,604 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. ఆ ఒక్క రోజు హుండీ ఆదాయం రూ.3.53 కోట్లు పలికింది. టోకెన్ లేని భక్తులకు స్వామివారి దర్శనానికి 12 నుంచి 15 గంటల సమయం పట్టిందంటే రద్దీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

Super Six Schemes: మరో సూపర్ సిక్స్ పథకానికి ముహూర్తం ఫిక్స్! మహిళలకు నెలకు రూ.1500... పత్రాలు రెడీ చేసుకోండి!

ఈ నెల 24 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల కోసం టీటీడీ అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, వారి భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. 

AP Politics: టీడీపీకి మరో గవర్నర్ పదవి ఖాయం! లిస్టులో వారి పేర్లు!

టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు గారు విజిలెన్స్, పోలీసు అధికారులతో కలిసి ఒక సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భక్తుల భద్రత, రవాణా, పార్కింగ్, రద్దీని నియంత్రించడం వంటి అంశాలపై చర్చించారు.

Flipkart: కేవలం 10 నిమిషాల్లో డెలివరీ..! ఈసారి TBBDలోనే ఫస్ట్ టైమ్..! ఎప్పటి నుంచీ అంటే..!

బ్రహ్మోత్సవాల సమయంలో భక్తుల రద్దీ భారీగా పెరుగుతుంది. దాని కోసం టీటీడీ, పోలీసులు కలిసి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏపీఎస్‌ఆర్టీసీ వివిధ ప్రాంతాల నుంచి ప్రతిరోజూ 435 బస్సులను తిరుమలకు నడిపిస్తోంది. బ్రహ్మోత్సవాల సమయంలో అదనపు బస్సులను కూడా అందుబాటులోకి తీసుకొస్తారట. దీనివల్ల సుమారు 1.60 లక్షల మంది భక్తులు తిరుమలకు రాకపోకలు సాగిస్తారని అంచనా.

IT Companies: దేశంలోనే తొలిసారిగా రెండు దిగ్గజ ఐటీ కంపెనీలు.. 30 కొత్త పారిశ్రామిక క్లస్టర్లు! ఏపీ పంట పండినట్టే!

పార్కింగ్: వాహనాల పార్కింగ్ కోసం తిరుపతిలో 23 ప్రదేశాలను గుర్తించారు. దీనివల్ల వాహనాలు ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేసి ట్రాఫిక్ సమస్య సృష్టించకుండా ఉంటారు.
భద్రత: ఈసారి భద్రత విషయంలో టీటీడీ మరింత కట్టుదిట్టంగా వ్యవహరిస్తోంది. 4,200 మంది పోలీసులు, 1,500 మంది విజిలెన్స్ సిబ్బందితో పటిష్టమైన భద్రత కల్పిస్తున్నారు.

Financial Support: ఏపీ సర్కార్ బంపర్ ఆఫర్! వారికి ఒక్కొకరికి రూ.20 వేలు... ఆర్థిక సహాయం!

కమాండ్ కంట్రోల్ సిస్టమ్: కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా రద్దీ ప్రాంతాలను ఎప్పటికప్పుడు గుర్తిస్తారట. దీనివల్ల రద్దీని సులభంగా నియంత్రించవచ్చు.
ప్రత్యేక ప్రణాళికలు: ముఖ్యమంత్రి, వీఐపీల రాకపోకల కోసం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

Praja Vedika: నేడు (16/9) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

సోషల్ మీడియాలో తప్పుదారి పట్టించే ప్రచారాలను వెంటనే అడ్డుకోవడానికి ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తల వల్ల చాలా సమస్యలు వస్తున్నాయి. 

AP Government: ఏపీలో పేదలకు గుడ్ న్యూస్! ఇళ్ల పట్టాల పంపిణీ పై అప్డేట్... సీఎం కీలక ఆదేశాలు జారీ!

ఈ విషయం దృష్టిలో పెట్టుకుని టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయం చాలా మంచిది. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులు వీలైనంత వరకు సురక్షితమైన ప్రజా రవాణా సేవలను వినియోగించుకోవాలని అదనపు ఈవో విజ్ఞప్తి చేశారు.

Fridge Tips: పొరపాటున కూడా.. మీ ఫ్రిజ్‌పై ఈ 5 వస్తువులు పెడుతున్నారా..? అయితే చాలా నష్టపోతారు గురూ!

బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమల నాలుగు మాడ వీధుల్లోని గ్యాలరీల్లో 1.85 లక్షల నుండి 2 లక్షల వరకు భక్తులు కూర్చునే సదుపాయం ఉందని అధికారులు తెలిపారు. ఎటువంటి అసౌకర్యం లేకుండా వాహన సేవలను వీక్షించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారట. ఈ ఏర్పాట్లు చూస్తుంటే, బ్రహ్మోత్సవాలు ఎంతో విజయవంతం అవుతాయని ఆశిద్దాం. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు సురక్షితంగా వెళ్లేలా అన్ని చర్యలు తీసుకోవడం అభినందనీయం.

Railway Big Alert: రైల్వే బిగ్ అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి ఆధార్ తప్పనిసరి.. ఎందుకంటే!
Mirais box office: బాక్సాఫీస్ వద్ద మిరాయ్ కలెక్షన్ల సునామీ.. మూడు రోజుల్లోనే!
Fire Stations: ఏపీలో మరో శుభవార్త..! 17 కొత్త అగ్నిమాపక కేంద్రాలకు 15వ ఆర్థిక సంఘం గ్రీన్ సిగ్నల్!