క్రికెటర్ హార్దిక్ పాండ్యా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్రికెట్‌పై ఆసక్తి ఉన్నా లేకపోయినా, ఆయన పేరు చాలామందికి సుపరిచితమే. గత సంవత్సరం నటి, మోడల్ అయిన తన భార్య నటాషా స్టాంకోవిక్‌తో విడాకుల తర్వాత, ఆయన వ్యక్తిగత జీవితం సోషల్ మీడియాలో బాగా చర్చనీయాంశంగా మారింది.
ప్రస్తుతం హార్దిక్ ప్రేమ జీవితం మరోసారి వార్తల్లో నిలిచింది. హార్దిక్ మోడల్-నటి మహీక శర్మతో డేటింగ్ చేస్తున్నట్లు ఇంటర్నెట్‌లో ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ పుకార్లకు ప్రధాన కారణం హార్దిక్ పాండ్యా, మహీక శర్మ ఇద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు ఫాలో అవుతున్నట్లు నెటిజన్లు గుర్తించడం. అంతేకాకుండా గతంలో హార్దిక్ ధరించే రోబ్‌లో ( గౌను లో )మహీక కనిపించడంతో, వీరిద్దరి మధ్య ఏదో ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇటీవల దుబాయ్‌లో జరిగిన భారత్-పాకిస్తాన్ ఆసియా కప్ మ్యాచ్‌కి కూడా మహీక శర్మ హాజరైంది. అక్కడ ఆమె టీమ్ ఇండియాకు ముఖ్యంగా తన కొత్త ప్రియుడికి మద్దతు తెలుపుతూ కనిపించింది.
హార్దిక్ విడాకుల అనంతరం బ్రిటీష్ గాయని జాస్మిన్ వాలియాతో కలిసి ఉన్న వీడియోలు కూడా గతంలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. జాస్మిన్ కూడా హార్దిక్ మ్యాచ్‌లకు ప్రోత్సహించడానికి వెళ్ళేవారు.
హార్దిక్ కొత్త జీవితాన్ని ప్రారంభించనున్నాడా లేదా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మహీక శర్మ తో అయినా హార్దిక్ ప్రేమ బంధం వివాహ బంధంగా మారనుందా. అనే విషయంపై హార్దిక్ అధికారిక ప్రకటన చేస్తారేమోనని అందరూ ఆశిస్తున్నారు.