సీనియర్ పొలిటీషియన్, విజయవాడ వెస్ట్ బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరికి విదేశీ పర్యటనలో ప్రమాదం చోటు చేసుకుంది. లండన్ పర్యటనలో భాగంగా అక్కడి ఓ సూపర్ మార్కెట్‌లో ప్రమాదవశాత్తూ బాత్రూమ్‌లో జారిపడిన ఆయనకు కుడిచేయికి తీవ్రంగా గాయమైంది. ఎముక విరిగినట్టు సమాచారం. ప్రమాదం అనంతరం లండన్‌లో ప్రాథమిక వైద్యం పొందిన సుజనా చౌదరిని మెరుగైన చికిత్స కోసం వెంటనే హైదరాబాద్‌కు తరలించారు.
తెల్లవారుజామున 3 గంటల సమయంలో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ఆయనను బేగంపేటలోని కిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు సర్జరీకి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం సుజనా చౌదరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే పూర్తిస్థాయి సమాచారం కోసం ఆసుపత్రి నుంచి అధికారిక హెల్త్ బులిటెన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ ఊహించని ఘటనతో బీజేపీ కార్యకర్తలు, సుజనా చౌదరి అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఆ నామినేటెడ్ పదవుల భర్తీకి డేట్ ఫిక్స్! ఎప్పుడంటే!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
వరుస సమీక్షలతో సీఎం చంద్రబాబు బిజీ బిజీ! అధికారులకు కీలక ఆదేశాలు!
జగన్ కు కొత్త పేరు పెట్టిన కూటమి నేతలు! అంతా అదే హాట్ టాపిక్!
డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త! ఇకపై ఇంటి నుంచే..
షాకింగ్ న్యూస్: జగన్ హెలికాప్టర్ ఘటన దర్యాప్తు వేగవంతం! 10 మంది వైసీపీ కార్యకర్తల అరెస్ట్!
నెల్లూరు రూరల్ అభివృద్ధి అద్భుతం.. 60 రోజుల్లోనే 339 అభివృద్ధి పనులు పూర్తి! మంత్రి ప్రశంసలు
పాన్ ఇండియన్ సోషియో కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో.. జాతీయ సాంస్కృతోత్సవ పురస్కార వేడుక!
ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి!
అడ్డంగా బుక్కైన ప్రపంచ యాత్రికుడు అన్వేష్.. పోలీస్ కేసు నమోదు.. ఏం జరిగిందంటే?
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: