విశాఖ నగరం మధురవాడలో భర్త చేతిలో అనూష అనే నిండు గర్భిణి సోమవారం దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. కేజీహెచ్ ఆస్పత్రిలో మంగళవారం ఆమె మృతదేహానికి పోస్టు మార్టం నిర్వహించారు. గర్భం నుంచి ఆడ మృత శిశువును బయటకి తీశారు. అక్కడికి చేరుకున్న మృతురాలి బందువులు కన్నీరు మున్నీరయ్యారు. ప్రత్యక్షంగా భార్యను, పరోక్షంగా తల్లి కడుపులో బిడ్డను హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని మృతురాలి కుటుంబసభ్యులు కోరుతున్నారు. నిందితుడు జ్ఞానేశ్వర్ను పీఎం పాలెం పోలీసులు భీమిలి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. వేర్వేరు కులాలకు చెందిన గెద్దాడ జ్ఞానేశ్వర్, అనూష (27) దంపతులు మదురవాడలోని ఓ అపార్ట్ మెంట్ లో నివసించేవారు. వీరిద్దరూ 2022లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అతడు ప్రస్తుతం రెండు ఫాస్ట్ఫుడ్ కేంద్రాలు నడుపుతున్నాడు.
ఇది కూడా చదవండి: భారతీయులకు ట్రంప్ మరో ఎదురుదెబ్బ.. వారికి భారీ షాక్.. ఇక వీసా రానట్లే.! రిజిస్ట్రేషన్ తప్పనిసరి - లేదంటే భారీ జరిమానాలు, జైలు శిక్ష!
వివాహమై రెండేళ్లు దాటినా భార్యను ఇంత వరకు తల్లిదండ్రులకు పరిచయం చేయలేదు. వివాహం జరిగిన విషయాన్నీ వారికి చెప్పకుండా నగరంలోనే ఉద్యోగం చేస్తున్నానని నమ్మించాడు. అత్తమామల వద్దకు వెళ్లామని ఆమె ఎప్పుడు అడిగినా ఏవేవో కారణాలు చెప్పి తప్పించుకుంటూ వచ్చాడు. ఓసారి తనకు క్యాన్సర్ వచ్చిందని, విడాకులు తీసుకుని వేరే పెళ్లి చేసుకోవాలని భార్యను మోసగించే ప్రయత్నం చేశాడు. నీతోనే జీవితమని ఆమె తెగేసి చెప్పేయడంతో వీరి మధ్య తరచుగా మాటల యుద్ధం జరిగేది. ఆదివారం రాత్రి భర్తతో కలిసే పడుకుంది. ఇదే అదనుగా భావించిన జ్ఞానేశ్వర్ సోమవారం తెల్లవారుజామున నిద్రలో ఉన్న భార్యను పీక నులిమి హత్య చేశాడు. ఏమీ ఎరగనట్లు స్థానికులతో కలిసి కేజీహెచ్కు తీసుకెళ్లాడు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీనిపై సమాచారం అందుకున్న పీఎం పాలెం పోలీసులు జ్ఞానేశ్వర్ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు.
ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్.. కొత్తగా నేషనల్ హైవే.. ఈ రూట్లో ఆరులైన్లుగా - భూముల ధరలకు రెక్కలు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
తిరుమలలో భక్తులకు వసతి, కౌంటర్.. టీటీడీ కీలక నిర్ణయం! ఇక బస్సుల్లోనే..!
నేడు చంద్రబాబు అధ్యక్షతన ఏపీ క్యాబినేట్ కీలక సమావేశం.. పలు కీలక అంశాలపై చర్చ!
ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్ గా మళ్లీ ఆయనే ఫిక్స్! వీవీఎస్ లక్ష్మణ్‌కు కూడా..!
ఆ కీలక ప్రాజెక్టుకు గ్రీన్‌సిగ్నల్! టెండర్లు మళ్లీ ప్రారంభం!
సీఆర్‌డీఏ కీలక ప్రతిపాదన! వేల ఎకరాల భూమి సమీకరణ! అవి మళ్లీ ప్రారంభం!
వైసీపీకి మరో బిగ్ షాక్! కీలక నేత రాజీనామా! జనసేన పార్టీ లోకి చేరిక?
వైసీపీకి భారీ షాక్.. రాజకీయాల్లోకి ఏబీ వెంకటేశ్వరరావు.. జగన్ అక్రమాలన్నీ బయటకు తెస్తా..
వారందరికీ పండుగ లాంటి వార్త.. ఆ జిల్లా చుట్టూ పెరగనున్న భూముల ధరలు! ప్రభుత్వం సంచలన నిర్ణయం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: