ప్రదీప్ రంగనాధన్ నటుడిగా దర్శకుడిగా అనేక సినిమాల్లో తన ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకున్నారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన కోమలి, లవ్ టుడే చిత్రాల్లో నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. డ్రాగన్ చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమ తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. ప్రదీప్ రంగనాధన్ మరచిత్రం ఈ దీపావళికి విడుదలడానికి సిద్ధమవుతుంది.
ప్రదీప్ మమితా బైజు జంటగా కీర్తిశ్వరన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన కొత్త చిత్రం డ్యూడ్ దీపావళి సందర్భంగా థియేటర్లలో రాబోతోంది. సాయి అభయంకర్ సంగీతం అందించి, నేహా శెట్టి, శరత్ కుమార్, రోహిణి, సత్య ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు. మేకర్స్ తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ ఇప్పటికే సోషల్ మీడియాలో హైప్ క్రియేట్ చేసింది.
ట్రైలర్‌లో మొదటి సీన్ నుంచి చివరి వరకు కథ ప్రదీప్ చుట్టూ మలిచినట్లు అనిపిస్తుంది. డైలాగ్స్, ఫన్నీ సీన్స్, ఎమోషన్స్ అని ప్రదీప్ పాత్ర ద్వారా నడుస్తున్నాయి. నేహా శెట్టి కూడా ఓ కీలక సీన్‌లో కనిపించడం, ప్రేక్షకులను షాక్ ఇచ్చేలా ఉంది.
కథ యూత్‌ను నేరుగా ఆకర్షించే సింగిల్ లైనర్స్, మాన్యరిజమ్స్‌తో నిండింది. కొన్ని డైలాగ్స్ బాగా ఆకట్టుకుంటుంది.
లైఫ్‌లో ఒక్క విషయం డీల్ చేస్తే.. లైఫ్ నిన్ను లెఫ్ట్ హ్యాండ్‌తో డీల్ చేస్తుంది
బాగుంటే ఇద్దరి లైఫ్ బాగుండాలి, లేకుంటే నాశనం ఈ డైలాగ్ మాత్రం ట్రైలర్ హైప్ క్రియేట్ చేశాయని చెప్పుకోవాలి
ట్రైలర్ ఎండింగ్‌లో ప్రదీప్, మమితా మధ్య కారులో వచ్చే ఎమోషనల్ సీన్, వారి ఎక్స్‌ప్రెషన్స్ హైలైట్‌గా ఉన్నాయని చెప్పుకోవాలి.మొత్తం చూస్తే, ట్రైలర్ ప్రదీప్ ఖాతాలో మరో బ్లాక్‌బస్టర్ సినిమా రాబోతోందని స్పష్టం చేస్తుంది. ఫన్, ఎమోషన్స్, యూత్-ఫ్రెండ్లీ డైలాగ్స్‌తో కూడిన డ్యూడ్ దీపావళి సీజన్‌లో ప్రేక్షకులకు మెగా ఎంటర్టైన్‌మెంట్ ఇస్తుందని అంచనా.