అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నోబెల్ శాంతి బహుమతి గెలుచుకోవాలని తీవ్రంగా ఆసక్తి చూపుతున్నారు. ప్రపంచంలో జరుగుతున్న వివిధ యుద్ధాలను తనవల్ల ఆపుతున్నట్లు, అంతర్జాతీయ శాంతికి తన కృషి ఎంతగానో ఉపయోగపడిందని ట్రంప్ ఇన్‌డైరెక్ట్‌గా చెప్పుకుంటున్నారు. ఏంటబ్బా, ట్రంప్ ఇంత సడన్‌గా ప్రపంచ శాంతి గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? అనే ప్రశ్న తలెత్తవచ్చు.
రేపు నోబెల్ శాంతి బహుమతి విజేతను ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో, ట్రంప్ ప్రతిపాదించిన గాజా ఒప్పందం తొలి దశకు ఇజ్రాయెల్, హమాస్ అంగీకారం తెలిపారు. వైట్‌హౌస్ ఈ ఘట్టం విజయవంతమైన వెంటనే ఒక అధికారిక ట్వీట్ ద్వారా ట్రంప్‌ను “హది పీస్ ప్రెసిడెంట్ అని పిలుస్తూ, ఆయన శాంతి స్థాపనలో కీలక పాత్ర పోషించినట్లు సూచించింది. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ట్రంప్ తరచుగా తన శాంతి ప్రయత్నాలను హైలైట్ చేస్తూ ప్రపంచంలో ఏడు యుద్ధాలకు పరిష్కారం తీసుకువచ్చానని చెబుతున్నారు. మే నెలలో భారత్–పాకిస్తాన్ మధ్య నాలుగు రోజుల ఘర్షణను ఆపడంలో తన పాత్ర కీలకమని గుర్తు చేశారు. అయితే న్యూఢిల్లీ దీనిని తిరస్కరించింది.
ఇంకా, ఆజర్‌బైజాన్, అర్మేనియా మధ్య దశాబ్దాలుగా కొనసాగిన ఘర్షణను ముగించడంలో ట్రంప్ చారిత్రక పాత్ర పోషించారు. ఆగస్ట్‌లో ఆ దేశాల నాయకులను వైట్‌హౌస్‌కు ఆహ్వానించి, వారి సమక్షంలో ఒప్పందానికి సంతకం చేయించారు.
ట్రంప్ నోబెల్ శాంతి బహుమతి పొందగలడా అనే విషయంలో ఆయనకు అనిశ్చితి ఉంది. కొన్నిసార్లు, నోబెల్ కమిటీ తాను పొందకపోవడానికి ఏదో ఒక కారణం వెతుకుతుందంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం, రాయల్ స్వీడిష్ అకాడమీ వైద్య, భౌతిక, రసాయన శాస్త్రాలలో నోబెల్ గ్రహీతల పేర్లను ప్రకటిస్తోంది.
రేపు అత్యంత ఉత్కంఠభరితమైన నోబెల్ శాంతి బహుమతి విజేతను ప్రకటించనున్నారు. వైట్‌హౌస్ చేసిన ది పీస్ ప్రెసిడెంట్ ప్రకటన ద్వారా ట్రంప్ ఈ రేసులో ఉన్నట్లు పరోక్షంగా తెలుస్తోంది. నిజానికి ఆయన ఈ బహుమతి పొందుతాడా లేదా అనేది రేపు స్పష్టమవుతుంది.