డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు కాకినాడ జిల్లాలో పర్యటన చేయనున్నారు. ఆయన పర్యటనకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. పవన్ కళ్యాణ్ గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుండి రాజమండ్రి విమానాశ్రయంలోకి చేరుకున్నారు. అక్కడి నుంచి హెలికాఫ్టర్ ద్వారా కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్‌కి వెళ్ళనున్నారు. ఆ తర్వాత నేరుగా కాకినాడ కలెక్టరేట్‌కు చేరతారు.
కాకినాడ సమీపంలోని ఉప్పాడ సముద్ర తీరంలో దివిస్ ఫార్మా కంపెనీలు విడుదల చేసే రసాయనాల వల్ల కాలుష్యం పెరుగుతోంది. దీని ప్రభావంగా స్థానిక మత్స్యకారుల జీవనోపాధి తగ్గింది. మత్స్యకారులు గత కొన్ని రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. ఈ సమస్యలను పరిష్కరించడానికి కలెక్టరేట్‌లో మత్స్యకార సంఘాల ప్రతినిధులు మరియు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ సభ్యులతో పవన్ కళ్యాణ్ సమావేశం జరపనున్నారు. సముద్రంలో కాలుష్యం అధికమవడంతో మత్స్యకారుల నష్టాల గురించి, ఉప్పాడ తీరంలోని సమస్యలు ఇతర సమస్యలపై చర్చ జరుగుతుంది.
సమావేశం ముగిసిన తర్వాత పవన్ కళ్యాణ్ 3 గంటల నుంచి సాయంత్రం 4.30 వరకు ఉప్పాడ సెంట్రల్ బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ బహిరంగ సభలో మత్స్యకారులకు భరోసా కల్పించేలా మాట్లాడతారు.
పవన్ కళ్యాణ్ పర్యటనకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు అధికారులు. ఎటువంటి సమస్యలు రాకుండా అక్కడికి పోలీస్ వర్గం అన్ని సదుపాయాలను ఏర్పాటు చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ అభివృద్ధి వైపుకు సంబంధించిన పూర్తి విషయాన్ని చర్చించనున్నారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం పరిపాలన గురించి అక్కడ ప్రజలతో మాట్లాడనున్నారు.
పవన్ కళ్యాణ్ పర్యటన ద్వారా మత్స్యకారుల సమస్యలు పరిష్కరించబడతాయి, వారికి ఆర్థిక సాయం గురించి చర్చలు జరుగుతాయి. ఈ కార్యక్రమంలో ఎటువంటి అవంతరాలు ఏర్పడకుండా అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తిచేశారు. పర్యటనలో మత్స్యకారుల సమస్యలు, సముద్ర కాలుష్యం, స్థానికాభివృద్ధి, యువతకు అవకాశాలు వంటి అంశాలను ముఖ్యంగా పరిగణనలోకి తీసుకోనున్నారని అధికారులు తెలిపారు.