యూకే ప్రధాని కీర్ స్టార్మర్, భారత ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ, భారత్ భవిష్యత్తు అభివృద్ధి దిశలో అద్భుతమైన అడుగులు వేస్తోందని అన్నారు. న్యూ ఢిల్లీలో జరిగిన భారత్ బ్రిటన్ ద్వైపాక్షిక చర్చల తర్వాత మీడియా ముందు మాట్లాడిన స్టార్మర్, రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడతాయని విశ్వాసం వ్యక్తం చేశారు.
స్టార్మర్ మాట్లాడుతూ, “భారతదేశం గత పదేళ్లలో విప్లవాత్మక మార్పులు చూశింది. మోదీ నాయకత్వంలో భారత్ 2028 నాటికి ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతోంది. ఇది కేవలం అంచనా కాదు, మీ ఆర్థిక విధానాలు, టెక్నాలజీ విప్లవం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించే విధానం చూస్తే అది ఖచ్చితమైన నిజం” అని వ్యాఖ్యానించారు.
అలాగే ఆయన మాట్లాడుతూ, “మోదీ గారు వికసిత్ భారత్ విజన్‌తో దేశాన్ని 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుతామని చెప్పడం ఎంతో ప్రేరణాత్మకం. నేను ఈ లక్ష్యాన్ని సాధించగలరని నమ్ముతున్నాను. మీరు ఇప్పటివరకు చేసిన పనులు, మీ ఆర్థిక సంస్కరణలు, డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాలు ఆ దిశగా భారతదేశాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్తున్నాయి” అని అన్నారు.
భారత్ బ్రిటన్ మధ్య వ్యాపార, టెక్నాలజీ, విద్య, రక్షణ రంగాల్లో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని యూకే సిద్ధంగా ఉందని స్టార్మర్ పేర్కొన్నారు. ఇండియాలోని ఆవిష్కరణాత్మక శక్తి, యువత సామర్థ్యం, టెక్ ప్రతిభ మనకు కూడా ప్రేరణ. మీ జర్నీలో భాగం కావడం మాకు గౌరవంగా ఉంటుంది. భవిష్యత్తులో రెండు దేశాలు కలిసి ప్రపంచ సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర పోషిస్తాయి” అని అన్నారు.
దీనిపై స్పందించిన మోదీ గారు, భారత్ యూకే భాగస్వామ్యం కొత్త శకానికి నాంది పలికిందని తెలిపారు. రెండు దేశాలు కలిసి సస్టైనబుల్ ఎనర్జీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లీన్ టెక్నాలజీ రంగాల్లో సంయుక్త పరిశోధనలు చేపడతాయని తెలిపారు. భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలు దానిపై దృష్టి సారిస్తున్నాయి. IMF, వరల్డ్ బ్యాంక్ సహా పలు అంతర్జాతీయ సంస్థలు భారత్ వృద్ధి రేటుపై సానుకూల అంచనాలు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో యూకే ప్రధాని కీర్ స్టార్మర్ వ్యాఖ్యలు భారత అంతర్జాతీయ ప్రతిష్టను మరింత బలోపేతం చేస్తున్నాయి.
మొత్తం మీద, భారత అభివృద్ధి ప్రయాణంలో బ్రిటన్ భాగస్వామ్యానికి సిద్ధంగా ఉందని స్టార్మర్ స్పష్టంచేశారు. ఇండియాలోని శక్తి, ఆశయం, నిబద్ధత చూస్తే మాకు విశ్వాసం కలుగుతోంది. మీ జర్నీ కేవలం భారతదే కాదు, ప్రపంచ అభివృద్ధి దిశలో ఒక ముఖ్యమైన పథం అని వ్యాఖ్యానించారు. భారత్ బ్రిటన్ సంబంధాలు మరింత సుస్థిరంగా మారే సంకేతాలు ఈ సమావేశం ద్వారా స్పష్టమయ్యాయి. మోదీ స్టార్మర్ భేటీ రెండు దేశాల భవిష్యత్తుకు మార్గదర్శిగా నిలుస్తుందనే నమ్మకం వ్యక్తమవుతోంది.