Modis leadership : మోదీ నాయకత్వంలో భారత్ 2028 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక శక్తి.. స్టార్మర్ వ్యాఖ్యలు!

దక్షిణ భారత చిత్రసీమలో ‘లేడీ సూపర్ స్టార్’గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార తన సినీ కెరీర్‌లో మరో మైలురాయిని అందుకుంది. ఆమె సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 22 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ ప్రత్యేక సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ నయనతార సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు.

AP Lifetax Exemption: ఏపీలో ఆ వాహనాలు ఉన్నవారికి గుడ్‌న్యూస్! 100శాతం రాయితీ... రూ.3 లక్షలు కట్టక్కర్లేదు!

తన హృదయానికి దగ్గరైన మాటల్లో నయనతార ఇలా రాసింది నేను కెమెరా ముందుకు మొదటిసారి నిల్చొని 22 ఏళ్లు అవుతోంది. ఆ సమయంలో ఇది నా జీవితం అవుతుందని, సినిమాలు నా ప్రపంచమవుతాయని ఊహించలేదు. ప్రతి ఫ్రేమ్, ప్రతి షాట్, ప్రతి సైలెన్స్ కూడా నన్ను తీర్చిదిద్దాయి. నన్ను బలంగా మార్చాయి. నా జీవితాన్ని మారుస్తూ ముందుకు నడిపించాయి. ఈ ప్రయాణంలో నన్ను ప్రేమించిన, నమ్మిన, నాతో పాటు నడిచిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు” అని పేర్కొంది.

ట్రంప్ ది పీస్ ప్రెసిడెంట్.. నోబెల్ శాంతి బహుమతి ఆసక్తి.. వైరల్ అవుతున్న పోస్ట్!!

2003లో మలయాళంలో ‘మనస్సినక్కరే’ అనే సినిమాతో నయనతార తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించింది. మలయాళంలో చిన్న పాత్రలతో మొదలైన ఈ ప్రయాణం కొద్దికాలానికే తమిళం, తెలుగు, హిందీ సినిమాల వరకు విస్తరించింది. కొద్దికాలంలోనే ఆమె స్టార్ హోదాను సంపాదించింది. తన ప్రతిభతో, కష్టపడే తత్వంతో, స్క్రీన్ ప్రెజెన్స్‌తో నయనతార దక్షిణాదిలో అత్యధిక పారితోషికం పొందే నటిగా మారింది.

చంద్రబాబు పాలనలో పరిశ్రమల జోరు – అనంతపురం జిల్లాలో రేమండ్ గ్రూప్ భారీ పెట్టుబడి!!

తన కెరీర్‌లో నయనతార ఎన్నో రకాల పాత్రల్లో నటించింది రొమాంటిక్ గర్ల్‌గా, యాక్షన్ హీరోయిన్‌గా, సోషల్ సబ్జెక్ట్‌లలో బలమైన మహిళా పాత్రల్లో. ‘అరమ’, ‘మాయా’, ‘రాజరాణి’, ‘శ్రీరామరాజ్యం’ వంటి చిత్రాలు ఆమెకు ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్, విజయ్, అజిత్, బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున వంటి స్టార్ హీరోలతో నటించి తన స్థాయిని నిరూపించుకుంది.

Rural Banks: ఏపీలోని గ్రామీణ బ్యాంకుల విలీన ప్రక్రియ! ఐదు రోజుల పాటు బ్యాంకింగ్ సేవల్లో అంతరాయం..!

22 ఏళ్ల పాటు నిరంతరం టాప్ పొజిషన్‌లో కొనసాగడం సాధారణ విషయం కాదు. కానీ నయనతార తన క్రమశిక్షణ, డెడికేషన్, పాత్రల ఎంపికలో చూపిన జాగ్రత్తతో ఈ స్థాయిని నిలబెట్టుకుంది. ఇటీవల హిందీలో షారుక్ ఖాన్‌తో కలిసి ‘జవాన్’ సినిమాలో నటించి, దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది.

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉప్పాడ పర్యటన…

తన భర్త, ఫిల్మ్ మేకర్ విఘ్నేశ్ శివన్‌తో కలిసి నిర్మాణ రంగంలోకూ అడుగుపెట్టి ‘నయన్ విఘ్నేష్’ అనే బ్యానర్ కింద కొన్ని ప్రాజెక్టులు ప్రారంభించింది. తన జీవితం, కెరీర్ రెండింటినీ సమతూకంగా నడిపిస్తూ అభిమానుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించింది. ప్రస్తుతం నయనతార కొన్ని కొత్త ప్రాజెక్టుల్లో నటిస్తోంది. దక్షిణాదిలో ‘లేడీ సూపర్ స్టార్’గా పిలవబడే ఈ నటి తన ప్రతిభతో, కృషితో, అంకితభావంతో మరో కొత్త మైలురాయిని చేరేందుకు సిద్ధంగా ఉంది.

Ration Cut: ఏపీలో వారందరికీ రేషన్ కట్! ప్రభుత్వం కీలక నిర్ణయం!

22 ఏళ్ల ఈ సినీ ప్రయాణం ఆమెకే కాదు, అభిమానులకు కూడా గర్వకారణంగా మారింది. “నయనతార అంటే అందం మాత్రమే కాదు, ఆత్మవిశ్వాసం, కృషి, సమర్పణకు ప్రతీక” అని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

Foreign Minister: ఆఫ్ఘనిస్థాన్ విదేశాంగ మంత్రి ముత్తఖీ న్యూఢిల్లీలో..! భద్రతా, మౌలిక ప్రాజెక్టులపై కీలక చర్చలు..!
విజయ్‌ ఇంటికి బాంబు బెదిరింపు.. సభలు పెడితే జాగ్రత్త - తీవ్ర కలకలం! కంట్రోల్ రూమ్‌కు..
Navodaya: నవోదయ అడ్మిషన్‌ గడువు మరోసారి పొడిగింపు..! ఎప్పటి వరకు అంటే?
AP Government: ఏపీలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్! ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి పెంపు... ఎంతంటే!
విశాఖకు రానున్న మరో ప్రతిష్ఠాత్మక ఐటీ సంస్థ! రూ.87,250 కోట్ల పెట్టుబడి.. రైడైన్​తో ముందడుగు!
High way: హైదరాబాద్–విజయవాడ మార్గం హైటెక్ హైవేగా..! ఎన్‌హెచ్–65 విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..!
AP Land Conversion: ఏపీలో భూ వినియోగ మార్పిడి కొత్త మార్గదర్శకాలు! 30 రోజుల్లోగా పరిష్కరించకపోతే ఆమోదించినట్లే!