Bullet Train: హైదరాబాద్–బెంగళూరు బుల్లెట్ ట్రైన్... కేవలం 2 గంటల ప్రయాణం! ఏపీలో హాల్ట్ స్టేషన్లు ఇవే?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించే దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా అక్టోబర్ 2 నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు. ఇప్పటికే ఆగస్టు 15 నుంచి ఏపీ సచివాలయంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం అమల్లోకి వచ్చింది. ఇకపై ఈ నిషేధాన్ని రాష్ట్రంలోని అన్ని కార్యాలయాలకు విస్తరించనున్నారు.

New Model Car: రోజుకు వెయ్యి బుకింగ్స్.. లాంచ్‌కు ముందే ఫుల్ డిమాండ్! ధర మరి ఇంత తక్కువనా..!

విజయవాడలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరిగిన “స్వచ్ఛతా హీ సేవా” అవగాహన కార్యక్రమంలో మంత్రి నారాయణ పాల్గొని ఈ విషయాన్ని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో 50 చెత్త ప్రాసెసింగ్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభి చెప్పారు. దీనివల్ల ఆ రోజు వచ్చిన చెత్తను అదే రోజు ప్రాసెస్ చేయడం సులభం అవుతుందని పేర్కొన్నారు.

CBSE కొత్త గైడ్‌లైన్స్! డమ్మీ స్టూడెంట్స్, నిర్లక్ష్య పాఠశాలలకు షాక్..!

ముఖ్యంగా, 2026 జనవరి 1 నాటికి రాష్ట్రంలో చెత్త కనిపించకూడదని సీఎం చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వీధుల్లో వ్యర్థాలు కనిపిస్తే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు. దీనికి అనుగుణంగా ప్రభుత్వం పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించింది. చెత్త వేసిన వారికి సరుకులు ఉచితంగా ఇచ్చే పథకాలు, ప్రతి మూడో శనివారం స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమాలు చేపడుతోంది.

iPhone 17 లేటెస్ట్... ఈ ఆఫర్ మళ్ళీ రాదు! ఏకంగా రూ.54 వేలు తగ్గింపు!

అదే విధంగా, ప్లాస్టిక్ తగ్గించడంలో భాగంగా సచివాలయంలో ఇప్పటికే ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్‌ను నిషేధించి, ఎకో-ఫ్రెండ్లీ వాటర్ బాటిల్స్‌ను ఉద్యోగులకు అందిస్తున్నారు. అలాగే రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో కూడా దశలవారీగా ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేస్తున్నారు. విజయవాడ కనకదుర్గ ఆలయంలో ఈ నిషేధం ఇప్పటికే ప్రారంభమైంది. త్వరలో మిగతా ప్రధాన ఆలయాల్లో కూడా అమలు చేయనున్నారు.

APYouth: ఏపీ యువతకు మరో అవకాశం..! ప్రతిభ చూపితే నగదు బహుమతులు!

గ్రామీణ ప్రాంతాల్లో కూడా చెత్త నిర్వహణపై అవగాహన కల్పించడానికి ప్రభుత్వం “స్వచ్ఛరథం” కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ రథాల ద్వారా ఇళ్ల వద్ద చెత్త సేకరించి, దాని విలువకు సమానమైన వస్తువులను ప్రజలకు అందిస్తున్నారు. కొన్ని జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభమైన ఈ పద్ధతిని త్వరలో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నారు. అదనంగా, మురుగునీటి సమస్యల పరిష్కారం కోసం “మ్యాజిక్ డ్రెయిన్లు” కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. మొత్తంగా, 2026 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను “స్వచ్ఛాంధ్రప్రదేశ్”గా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

Recipe: కమ్మగా, కారంగా "నల్ల కారం పొడి.. ఈ పద్ధతిలో చేస్తే రుచి, వాసన అద్భుతంగా ఉంటాయి! ఆరు నెలల వరకు..
ఆ దేశంలో ఉద్యోగం, వ్యాపారం మీ కోసమే.. ఎలా వెళ్లాలి? ఏ వీసా కావాలి? తెలుసుకోకపోతే మోసపోతారు!
Scholarship : బాలికలకు శుభవార్త.. ఏడాదికి రూ.50వేల స్కాలర్షిప్.. ఆన్లైన్ దరఖాస్తు!
Iphone 17: మీరు ఐఫోన్ 17 కొనే ముందు ఇది తెలుసుకోండి.. 160 రోజులు పని చేయాలి.. ఇదేం లెక్క? షాకింగ్ నిజాలు!
BSNL బంపర్ ఆఫర్..! రూ.199కే రోజుకు 2GB డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్..!