కువైట్ దినార్ ప్రపంచంలో అత్యంత విలువైన కరెన్సీలలో ఒకటి. ప్రస్తుతం, ఒక కువైట్ దినార్ సుమారు 288.74 భారతీయ రూపాయలకు సమానం. బహుశా అందుకనేమో ఆంధ్రప్రదేశ్ నుండి, ముఖ్యంగా తూర్పు గోదావరి మరియు రాయలసీమ ప్రాంతాల ప్రజలు డ్రైవర్లు, వంటవారు, హోమ్ టేకర్లు మరియు కార్మికులుగా కువైట్‌కు వలస వెళ్తూ ఉంటారు. అయితే, కువైట్‌కు వెళ్లాలనుకునే చాలామందికి సరైన సమాచారం లేకపోవడం వల్ల ఏజెంట్లు లేదా ఏజెన్సీల చేతిలో మోసపోతున్నారు. ఈ సమస్యను నివారించడానికి, కువైట్‌కు వెళ్లడానికి సంబంధించిన అన్ని విషయాలను తెలుసుకోండి మరి.
కువైట్‌కు వెళ్లడానికి ప్రధాన మార్గం విమాన ప్రయాణం. భారతదేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు మరియు కేరళలోని కొచ్చి, తిరువనంతపురం వంటి నగరాల నుండి కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయానికి విమానాలు అందుబాటులో ఉన్నాయి. ఎయిర్ ఇండియా, కువైట్ ఎయిర్‌వేస్, ఇండిగో, ఫ్లై దుబాయ్, ఎమిరేట్స్ వంటి విమానయాన సంస్థలు ఈ సేవలను అందిస్తాయి.
భారతీయ పాస్‌పోర్ట్ ఉన్నవారు కువైట్‌కు వెళ్లడానికి తప్పనిసరిగా వీసా తీసుకోవాలి. ఏ ఉద్దేశ్యంతో కువైట్ కి వెళుతున్నారా అన్న దాన్ని బట్టి ఉంటుంది. పర్యాటకం, వ్యాపారం, ఉద్యోగం బట్టి వీసా రకాలు మారుతాయి.
పర్యాటక వీసా ఇది సాధారణంగా 30 రోజుల వరకు చెల్లుబాటు అవుతుంది. దీనికి మీ అసలు పాస్‌పోర్ట్ కనీసం 6 నెలల చెల్లుబాటుతో, సరిగ్గా నింపిన వీసా దరఖాస్తు ఫారమ్, రెండు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు నిర్ధారిత హోటల్ రిజర్వేషన్లు, రిటర్న్ ఫ్లైట్ టిక్కెట్లు, కువైట్‌లో మీ బసకు సరిపడా నిధులు ఉన్నాయని రుజువు అదేవిధంగా ప్రయాణ బీమా తప్పనిసరి.

కువైట్ కి వంటవారు, డ్రైవర్లు, కార్మికులు పని నిమిత్తం వెళ్లినవారు కష్టాలతో కూడుకుని ఉంటారు ఉదయం నుండి రాత్రి వరకు ఎక్కువ గంటలు పనిచేయాల్సి వస్తుంది.వీరు చిన్న గదుల్లో కనీస సౌకర్యాలతో జీవిస్తారు. చాలామంది తమ కుటుంబాలకు దూరంగా ఒంటరిగా జీవిస్తారు. అయినప్పటికీ, తమ కుటుంబాల భవిష్యత్తు కోసం వీరు ఎన్నో కష్టాలు భరిస్తూ, డబ్బులు సంపాదిస్తూ, ఇంటికి పంపుతుంటారు.
కువైట్లో వ్యాపారం చేయాలనుకుంటే, అక్కడి చట్టాలు మరియు నిబంధనలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. సాధారణంగా, ఒక విదేశీయుడు కువైట్‌లో వ్యాపారం ప్రారంభించాలంటే, ఒక కువైట్ పౌరుడిని భాగస్వామిగా లేదా స్పాన్సర్‌గా కలిగి ఉండాలి. కువైట్ కంపెనీ చట్టం ప్రకారం, విదేశీ పెట్టుబడిదారులకు కొన్ని పరిమితులు ఉండవచ్చు.
మీరు ఏ రకమైన వ్యాపారం చేయాలనుకుంటున్నారు అనే దానిపై ఆధారపడి, వివిధ రకాల కంపెనీ నిర్మాణాలు ఉంటాయి. వ్యాపారం ప్రారంభించడానికి ముందు సంబంధిత మంత్రిత్వ శాఖల నుండి అవసరమైన లైసెన్సులు మరియు అనుమతులు పొందాలి. మీరు మీ స్వదేశంలోని కువైట్ రాయబార కార్యాలయం లేదా కాన్సులేట్ ద్వారా లేదా గుర్తింపు పొందిన వీసా ప్రాసెసింగ్ కంపెనీ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
బహిరంగ ప్రదేశాల్లో మర్యాదపూర్వకమైన దుస్తులు ధరించాలి. స్త్రీలు తమ భుజాలు మరియు మోకాళ్లను కప్పి ఉంచే దుస్తులు తప్పనిసరి. అధికంగా శబ్దం చేయడం లేదా అసభ్యంగా ప్రవర్తించడం వంటివి చెయ్యరాదు డ్రగ్స్ వినియోగం లేదా అక్రమ రవాణాకు చాలా కఠినమైన శిక్షలు ఉంటాయి, ఇందులో సుదీర్ఘ జైలు శిక్షలు మరియు మరణశిక్ష కూడా ఉండవచ్చు. కువైట్ ఒక సంప్రదాయవాద ఇస్లామిక్ దేశం, కాబట్టి అక్కడి సంస్కృతి మరియు చట్టాలను గౌరవించడం చాలా ముఖ్యం. అందువలన కువైట్ కి వెళ్లాలనుకున్నవారు ఒకసారి ఇవన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది సుమీ.
Embassy of India, Kuwait
Diplomatic Enclave
Arabian Gulf Street,P O Box No.1450,Safat 13015, Kuwait
Ambassador: Dr. Adarsh Swaika
Embassy timing: 8.00 A.M. to 4.30 P.M (Sunday to Thursday) (Lunch Break: 1 p.m. to 1.30 p.m.)
Contact Information
Reception: +965-22530600/12/13/14, Emergency Helpline No. +965-6550194 (1630 hrs - 0800 hrs)
00965 22546958