iPhone 17 లేటెస్ట్... ఈ ఆఫర్ మళ్ళీ రాదు! ఏకంగా రూ.54 వేలు తగ్గింపు!

రోజూ టిఫిన్లలోకి చట్నీ చేయడం అంటే చాలామందికి ఒక పెద్ద పనిలా అనిపిస్తుంది. ఉదయం హడావిడిలో చట్నీ చేయడం అంటే చాలా కష్టం. అందుకే చాలామంది నిల్వ పచ్చళ్లు వాడుతుంటారు. కానీ, ఆ పచ్చళ్లు టిఫిన్లలోకి అంతగా రుచించవు. 

CBSE కొత్త గైడ్‌లైన్స్! డమ్మీ స్టూడెంట్స్, నిర్లక్ష్య పాఠశాలలకు షాక్..!

అందుకే చాలామంది వేడి వేడిగా ఇడ్లీ, దోసె, ఉప్మా, ఊతప్పం లాంటివి చేసినప్పుడు ఒక మంచి పొడి ఉంటే బాగుంటుంది అని అనుకుంటారు. అప్పుడే ఈ నల్ల కారం పొడి గురించి గుర్తు చేసుకోవాలి. ఈ పొడి ఒక్కసారి ఇంట్లో చేసుకుంటే, ఆరు నెలల వరకు హ్యాపీగా వాడుకోవచ్చు. ఇడ్లీ, దోసెలోకి ఈ పొడి వేసుకుని, కొద్దిగా నెయ్యి దట్టించి తింటుంటే.. అబ్బా! ఇంకేమీ అవసరం లేదు అనిపిస్తుంది.

New Model Car: రోజుకు వెయ్యి బుకింగ్స్.. లాంచ్‌కు ముందే ఫుల్ డిమాండ్! ధర మరి ఇంత తక్కువనా..!

ఈ నల్ల కారం పొడిని చేసుకోవడం చాలా సులభం. దీనికి కావలసిన పదార్థాలు కూడా మన వంటింట్లోనే ఉంటాయి. ఈ పొడిని ఎలా తయారు చేసుకోవాలో, దానికి ఏమేం కావాలో ఇక్కడ చూద్దాం.

Praja Vedika: నేడు (17/9) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

కావలసిన పదార్థాలు:
నూనె: 2 స్పూన్లు
ఎండు మిర్చి: 25
మెంతులు: పావు టీ స్పూన్
పొట్టు మినపగుండ్లు: పావు కప్పు
పచ్చి శనగపప్పు: పావు కప్పు

PM Modi: ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షల వెల్లువ.. రాష్ట్రపతి, ముఖ్యమంత్రులు, ప్రముఖుల అభినందనలు!

ధనియాలు: పావు కప్పు
జీలకర్ర: 1 స్పూన్
కరివేపాకు: 5 రెమ్మలు
చింతపండు: నిమ్మకాయ సైజు
ఉప్పు: రుచికి సరిపడా
వెల్లుల్లిపాయలు: 8
పసుపు: చిటికెడు

Bullet Train: హైదరాబాద్–బెంగళూరు బుల్లెట్ ట్రైన్... కేవలం 2 గంటల ప్రయాణం! ఏపీలో హాల్ట్ స్టేషన్లు ఇవే?

నల్ల కారం పొడి తయారీ విధానం…
ఈ పొడిని తయారు చేయడం చాలా సులభం. ఈ స్టెప్స్ ఫాలో అయితే రుచికరమైన పొడి రెడీ అవుతుంది.

ఒకే ఇంట్లో 4271 ఓట్లు! యూపీలో ఎన్నికల జాబితాలో సంచలనం!

వేయించడం: ముందుగా స్టవ్ ఆన్ చేసి మందపాటి ఐరన్ కడాయి పెట్టుకుని ఒక స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కాక, అందులో 25 ఎండు మిర్చి వేసుకుని వేయించాలి. ఎండు మిర్చిని మీడియం నుంచి లో ఫ్లేమ్‌లో వేయించుకోవాలి. లేదంటే అవి మాడిపోతాయి. అవి కొద్దిగా నల్లగా మారుతుండగానే తీసి పక్కకు పెట్టుకోవాలి. ఈ రంగు వల్లే ఈ పొడికి నల్ల కారం పొడి అని పేరు వచ్చింది.

New Airport: ఏపీలో కొత్త ఎయిర్పోర్ట్ నిర్మాణానికి బాటలు... 1,098 ఎకరాల భూసేకరణ ప్రారంభం! భూముల ధరలకు రెక్కలు!

దినుసులను వేయించడం: అదే కడాయిలో మరో స్పూన్ నూనె వేసుకుని పావు టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. ముందుగా మెంతులు వేయడం వల్ల చేదు తగ్గుతుంది. ఆ తర్వాత పావు కప్పు పొట్టు మినపగుండ్లు, పావు కప్పు పచ్చి శనగపప్పు, పావు కప్పు ధనియాలు వేసుకుని బాగా వేయించుకోవాలి. ఇవి లోపలి వరకు బాగా వేగేలా చూసుకోవాలి. అవి మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి.

Housing Scheme: కేంద్రం వారికి తీపికబురు..! గృహనిర్మాణానికి రూ.1010 కోట్లు.. తొలి విడతలోనే 40 వేల ఇళ్లు!

జీలకర్ర, కరివేపాకు, చింతపండు: ఇప్పుడు 1 స్పూన్ జీలకర్ర వేసుకుని బాగా వేయించుకోవాలి. అన్ని దినుసులు మంచి రంగులోకి వచ్చిన తర్వాత వాటిని ఒక కప్పులోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. మళ్లీ అదే పాన్‌లో ఐదారు రెమ్మల కరివేపాకు వేసుకుని నూనె లేకుండా వేయించుకోవాలి. అలాగే, నిమ్మకాయ సైజులో ఉన్న చింతపండు రెబ్బలు విడదీసి వేసుకుని వేయించి పక్కన పెట్టుకోవాలి.

RAILWAY: ట్రైన్ టికెట్ కావాలంటే ఆధార్ తప్పనిసరి..! టికెట్ బుకింగ్‌లో కొత్త నిబంధనలు..!

గ్రైండ్ చేయడం: వేయించుకున్న అన్ని దినుసులు పూర్తిగా చల్లారిన తర్వాత వాటిని మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. అందులో రుచికి సరిపడా ఉప్పు, 8 వెల్లుల్లిపాయలు, చిటికెడు పసుపు వేసుకుని పల్స్ ఇస్తూ గ్రైండ్ చేయాలి. వెల్లుల్లి పాయలు మెత్తబడే వరకు గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది.

AP Rains: రేపు ఏపీలో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు.. మరో 17 జిల్లాల్లో.! రైతులు, ప్రజలు అప్రమత్తంగా..

చల్లారిన తర్వాత ఈ కారం పొడిని గాజు సీసాలో నిల్వ చేసుకుంటే ఆరు నెలల వరకు వాడుకోవచ్చు. ఈ నల్ల కారం పొడి ఇడ్లీ, దోసె, వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అద్భుతంగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ కారం పొడిని ట్రై చేసి చూడండి!

Transgender Jobs : హైదరాబాద్ మెట్రోలో చారిత్రాత్మక నిర్ణయం.. ట్రాన్స్ జెండర్లకు ఉద్యోగాలు!