రాజస్థాన్‌లో కుండపోత వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. కోట, సవాయ్ మాధోపూర్, బుండి, ఝలావర్ జిల్లాల్లో పలు గ్రామాలు నీట మునిగాయి. నదులు, చెరువులు పొంగిపొర్లడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
సవాయ్ మాధోపూర్ జిల్లాలోని సవాయ్ మాధోపూర్, జడావట్ గ్రామాల వద్ద భూమి విరిగిపడింది. దాంతో 2 కిలోమీటర్ల పొడవు, 55 అడుగుల లోతు, 100 అడుగుల వెడల్పుతో భారీ గుంత ఏర్పడింది. ఈ భూకోత వల్ల గ్రామ శివార్లలో పెద్ద ఎత్తున విధ్వంసం చోటుచేసుకుంది.
ఈ గుంతలో రెండు ఇళ్లు, రెండు దుకాణాలు, రెండు ఆలయాలు కొట్టుకుపోయాయి. అంతేకాక సమీపంలోని సుర్వాల్ డ్యామ్ నిండిపోవడంతో వరద నీరు చుట్టుపక్కల గ్రామాలను ముంచెత్తింది. దీంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.