ఆకాశంలో అంతెత్తున ఎగిరే గద్దలను చాలా జంతువులు చూసి భయపడతాయి. సాధారణంగా గద్దలు కోడి పిల్లలు, చిన్న పక్షులు, పాములను పట్టుకుని ఎత్తుకెళ్తూ ఉంటాయి. కానీ పెద్దగా బరువున్న జంతువులను మాత్రం గద్దలు ఎగరలేవని మనం అనుకుంటాం. అయితే గద్ద శక్తి ఎంత వింతగా, అద్భుతంగా ఉంటుందో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో చూపిస్తోంది. ఈ వీడియోలో గద్ద తన శక్తివంతమైన రెక్కలతో, గోళ్లతో ఒక జింక పిల్లను వేటాడి పట్టుకుంది.
@Crazymoments01 అనే ఎక్స్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీడియోలో గద్ద పర్వత ప్రాంతంలో ఆహారం కోసం వెతుకుతూ తిరుగుతుండగా, దాని కంట ఒక జింక పిల్ల కనిపించింది. ఒక్కసారిగా వేగంగా కిందికి దూకి ఆ జింక పిల్లపై గద్ద దాడి చేసింది. తన కాళ్లలోని గోళ్లతో బలంగా పట్టుకుని, జింక పిల్లను గాల్లోకి ఎత్తుకుపోయింది. ఈ దృశ్యం చూసిన వారందరూ ఆశ్చర్యంతో మైమరచిపోయారు.
గద్ద వేటాడే పద్ధతి ఎంతో ప్రత్యేకం. ఏ జంతువును పట్టుకున్నా అది ముందుగా దాని కళ్లపై దాడి చేస్తుంది. కళ్ళు పీకేయడంతో ఆ జంతువు సగం శక్తిని కోల్పోయి బలహీనమవుతుంది. దాంతో తప్పించుకునే శక్తి లేకుండా గద్దకు సులభంగా బలి అవుతుంది. ఈ టెక్నిక్ వల్లే గద్ద వేటలో ఎప్పుడూ విజయం సాధిస్తుంది.
వైరల్ అయిన ఈ వీడియోను చూసినవారు షాక్ అయ్యేలా రియాక్ట్ అవుతున్నారు. "గద్దకు ఇంత బలం ఉందా?" అని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ వీడియోను 26 లక్షల మంది వీక్షించగా, దాదాపు నాలుగు వేల మంది లైక్ చేశారు. కొందరు నెటిజన్లు గద్ద శక్తిని ప్రశంసిస్తుండగా, మరికొందరు ఆ జింక పిల్ల ఆవేదన చూసి బాధపడుతున్నారు.
మొత్తం మీద ఈ వీడియో గద్ద శక్తి, వేటాడే ధైర్యం, ప్రకృతి నియమాలను మనకు గుర్తుచేస్తోంది. ఒక చిన్న జింక పిల్ల గద్ద బారిన పడటం కఠినంగా అనిపించినా, ఇది ప్రకృతిలో సహజమైన ఆహార గొలుసు. "సహజసిద్ధ శక్తి ముందు ఏ జంతువైనా బలహీనమే" అని ఈ వీడియో మరోసారి రుజువు చేసింది.