హైదరాబాద్‌లోని ప్రసిద్ధ బల్కంపేట ఎల్లమ్మ దేవస్థానానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ రూ. కోటి విరాళాన్ని అందించారు. ఈ విరాళాన్ని ఆలయ అధికారిక బ్యాంక్ ఖాతాలో బుధవారం జమ చేసినట్టు తెలుస్తోంది. దేవస్థానం ఈ మొత్తాన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్‌గా నిలుపుతూ, దానిపై వచ్చే వడ్డీతో నిత్యాన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ ఇన్‌ఛార్జి ఈవో మహేందర్ గౌడ్ తెలిపారు. ఈ విరాళం ఆలయ సేవా కార్యక్రమాలకు పెద్దగా దోహదపడుతుందని చెప్పారు.

ఇది కూడా చదవండి: Real estate: ఈ ప్రాంతంలో భూమి కొంటే కోటీశ్వ‌రులు కావ‌డం ఖాయం.. కీలక ప్రణాళికలు సిద్ధం, కొన్ని మండలాల్లో!

గతంలో, 2024 ఏప్రిల్ 23న నీతా అంబానీ తల్లి పూర్ణిమ దలాల్, సోదరి మమతా దలాల్ కలిసి బల్కంపేట దేవస్థానాన్ని సందర్శించారు. ఆ సందర్బంగా అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అప్పట్లో ఆలయ ఈవో కృష్ణ, దేవస్థానం విశిష్టత, అభివృద్ధి అవసరాలు, భక్తులకోసం చేపడుతున్న కార్యక్రమాల గురించి వివరించారు. ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యాల మెరుగుదల కోసం సహాయం చేయాలని కోరిన విజ్ఞప్తికి నీతా అంబానీ సానుకూలంగా స్పందించారని ఆలయ యాజమాన్యం తెలిపింది. ఈ విరాళం ఆలయ సేవలకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.

ఇది కూడా చదవండి: మంగళగిరి మీదుగా మరో రైల్వే లైన్! రూ.2,000 కోట్లతో.. రూట్ మ్యాప్ ఇదే!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు 

 International News: కుప్పకూలుతున్న రష్యా ఆర్థిక వ్యవస్థ! అదే కారణమా!

Student Kits: విద్యార్థులపై కూటమి దృష్టి! మంగళగిరిలో స్టూడెంట్ కిట్స్ పంపిణీ !

AP News: ఏపీలో కొత్తగా మూడో రైల్వే లైన్.. ఈ రూట్‌లోనే - ఈ జిల్లా దశ తిరిగింది! భూసేకరణ ప్రారంభం!

Visa New Rules: విద్యార్థి వీసాలకు కొత్త నిబంధనలు! సోషల్ మీడియా పోస్టులపై అమెరికా కళ్లు! అవి తప్పనిసరి.

Future Transport: కేంద్రం గ్రీన్ సిగ్నల్! ఈ ఐదు జిల్లాల వారికి పండగే పండుగ!

Road Development: ఏపీలోని ఆ రెండు రోడ్లకు మహర్దశ! రూ.800 కోట్లతో.. 4 వరుసలుగా

Political Update: వైసీపీ నేతలకు బిగుస్తున్న ఉచ్చు! కలకత్తా పోలీసులు అదుపులో మాజీ మంత్రి!

ఏపీలో కొత్తగా నాలుగు లైన్ల నేషనల్ హైవే! రూ.4,609 కోట్లతో, ఈ రూట్‌లోనే..

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group