మంగళగిరి మండలం నవులూరు గ్రామంలోని గాంధీనగర్, ఉడా కాలనీల్లో గుంటూరు జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు వేమూరి మైనర్ బాబు నేతృత్వంలో విద్యార్థులకు నోట్‌బుక్స్, బ్యాగులు, యూనిఫాం, షూస్ ఉచితంగా పంపిణీ చేశారు. పాఠశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో, కూటమి ప్రభుత్వం విద్యార్థుల విద్యా అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ సందర్భంగా వేమూరి మాట్లాడుతూ, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా వారి తల్లుల ఖాతాలో “తల్లికి వందనం” ద్వారా నగదు జమ చేయడం ఒక చరిత్రాత్మక చర్యగా అభివర్ణించారు. విద్యాశాఖ అభివృద్ధికి ఐటీ విద్యాశాఖ మంత్రి, స్థానిక శాసనసభ్యులు నారా లోకేష్ పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.