LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Health Tips: పక్షవాతానికి ముందు వచ్చే డేంజర్ బెల్స్.. మైక్రో స్ట్రోక్ పై వైద్యుల వివరణ!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Lifestyle

Traffic Challan Settlement: పెండింగ్ చలాన్లు ఉన్నాయా? అయితే ఈ ఛాన్స్ అస్సలు వదలకండి..!!

Traffic Challan Settlement: మీ వాహనంపై ట్రాఫిక్ చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయా? నేషనల్ లోక్ అదాలత్ 2026 ద్వారా వాటిని తక్కువ ధరకే సెటిల్ చేసుకునే సువర్ణావకాశం. నేడు జరిగే ఈ ప్రత్యేక కోర్టులో చలాన్లను ఎలా క్లియర్ చేసుకోవాలో, ఏయే డాక్యుమెంట్లు కావాలో పూర్తి వివరాలు తెలుసుకోండి

AndhraPravasi News Desk 2 min read
Traffic Challan Settlement: పెండింగ్ చలాన్లు ఉన్నాయా? అయితే ఈ ఛాన్స్ అస్సలు వదలకండి..!!

Traffic Challan Settlement: మీ బైక్ లేదా కారు మీద ఏవైనా ట్రాఫిక్ చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయా? వాటిని కట్టడానికి డబ్బులు సరిపోక ఇబ్బంది పడుతున్నారా? అయితే మీకు ఒక మంచి అవకాశం వచ్చేసింది. దేశవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న చిన్నపాటి వివాదాలను, ముఖ్యంగా ట్రాఫిక్ చలాన్లను తక్కువ ఖర్చుతో, త్వరగా పరిష్కరించుకోవడానికి 'నేషనల్ లోక్ అదాలత్ 2026' సిద్ధమైంది. ఈ అదాలత్ ద్వారా వేల రూపాయల ఫైన్లను పరస్పర అంగీకారంతో వదిలించుకోవచ్చు.

సాధారణంగా ఏదైనా కేసు కోర్టుకు వెళ్తే అది తేలడానికి నెలలు, ఏళ్లు పడుతుంది. కానీ లోక్ అదాలత్ అలా కాదు. ఇక్కడ న్యాయమూర్తుల సమక్షంలో రెండు పార్టీలు కూర్చుని మాట్లాడుకుని, పెండింగ్‌లో ఉన్న సమస్యను అక్కడికక్కడే పరిష్కరించుకోవచ్చు. చాలా రాష్ట్రాల్లో ఈ ఏడాది (నేడు) మార్చి 14న శనివారం లోక్ అదాలత్ నిర్వహిస్తుండగా, ఢిల్లీలో మాత్రం మార్చి 22న జరగనుంది. తెలుగు రాష్ట్రాల్లోని వాహనదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

ఈ లోక్ అదాలత్‌లో కేవలం ట్రాఫిక్ చలాన్లు మాత్రమే కాదు.. బ్యాంకు లోన్ రికవరీ కేసులు, కరెంటు బిల్లుల వివాదాలు, చెక్ బౌన్స్ కేసులు  చిన్నపాటి సివిల్ గొడవలను కూడా పరిష్కరిస్తారు. అయితే హత్యలు, తీవ్రమైన నేరాలు  విడాకులకు సంబంధించిన కేసులను ఇక్కడ డీల్ చేయరు. వాహనదారుల విషయానికి వస్తే.. హెల్మెట్ లేకపోవడం, రాంగ్ రూట్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్ వంటి కారణాల వల్ల పడిన ఈ-చలాన్లను ఇక్కడ క్లియర్ చేసుకోవచ్చు.

అయితే అన్ని రకాల ట్రాఫిక్ ఉల్లంఘనలకు ఇక్కడ మినహాయింపు ఉండదు. ఉదాహరణకు తాగి వాహనం నడపడం మైనర్లు డ్రైవింగ్ చేయడం, రేసింగ్‌లకు పాల్పడటం వంటి తీవ్రమైన కేసులను లోక్ అదాలత్ అంగీకరించదు. కేవలం పొరపాటున చేసే చిన్న చిన్న తప్పులకు సంబంధించిన పెనాల్టీల మీద మాత్రమే అధికారులు రాయితీ ఇచ్చే అవకాశం ఉంటుంది. దీనివల్ల సామాన్యుల మీద ఆర్థిక భారం తగ్గుతుంది.

మీరు ఈ లోక్ అదాలత్‌కు వెళ్లాలనుకుంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముందుగా మీ వాహనం మీద ఎన్ని చలాన్లు ఉన్నాయో ఆన్‌లైన్‌లో 'పారివాహన్' వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోండి. ఒకవేళ మీ చలాన్ కోర్టుకు వెళ్లినట్లు చూపిస్తే, మీరు లోక్ అదాలత్‌కు వెళ్లి దాన్ని సెటిల్ చేసుకోవచ్చు. అక్కడికి వెళ్లేటప్పుడు మీ డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ బుక్, చలాన్ కాపీ  ఆధార్ కార్డు వంటి పత్రాలను వెంట తీసుకెళ్లడం మర్చిపోకండి. ఈ అవకాశం మళ్లీ మళ్లీ రాదు కాబట్టి వెంటనే చెక్ చేసుకోండి…

Be the first to react

More Coverage

Highway Signboards: మీరు ఎప్పుడైనా గమనించారా? రోడ్డు పక్కన ఉండే ఆకుపచ్చ బోర్డుల వెనుక ఇంత పెద్ద సైన్స్ ఉందా? తెలిస్తే అబ్బా అంటారు!

Highway Signboards: మీరు ఎప్పుడైనా గమనించారా? రోడ్డు పక్కన ఉండే ఆకుపచ్చ బోర్డుల వెనుక ఇంత పెద్ద సైన్స్ ఉందా? తెలిస్తే అబ్బా అంటారు!

Highway Signboards: మీరు ఎప్పుడైనా హైవేలపై ప్రయాణించినప్పుడు రోడ్డు పక్కన లేదా పైన ఉండే బోర్డులను గమ…

South Korea: కొరియాలో ఉద్యోగం అంత కష్టమా? ‘భారతీయులెవరూ ఇక్కడికి రావద్దు’ అంటూ యువతి వైరల్ వీడియో!

South Korea: కొరియాలో ఉద్యోగం అంత కష్టమా? ‘భారతీయులెవరూ ఇక్కడికి రావద్దు’ అంటూ యువతి వైరల్ వీడియో!

South Korea: దక్షిణ కొరియాలో ఉద్యోగం చేయాలనుకుంటున్న భారతీయులను హెచ్చరిస్తూ ఓ యువతి పోస్ట్ చేసిన వీడ…