ఊహించినట్టే.. భారత్- పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. రెండు దేశాల జవాన్లు ఎదురు కాల్పులకు దిగారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత కాశ్మీర్ సమీపంలో నియంత్రణ రేఖ పొడవునా ఈ ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ విషయాన్ని భారత ఆర్మీ అధికారులు ధృవీకరించారు.
ఏప్రిల్ 25-26 తేదీల రాత్రి వేళ కాశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి వివిధ పాకిస్తాన్ ఆర్మీ పోస్టులు.. ఎటువంటి కవ్వింపు లేకుండా తేలికపాటి కాల్పులు జరిపాయని ఆర్మీ అధికారులు అధికారికంగా ప్రకటించారు. దీనితో సరిహద్దు భద్రత దళాలు తక్షణమే ఎదురుదాడికి దిగాయని, ఈ కాల్పులను తిప్పి కొట్టాయని చెప్పారు. ఈ కాల్పుల్లో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని తెలిపారు.
ఇది కూడా చదవండి: వీరయ్య చౌదరి హత్య కేసులో కీలక ఆధారాలు! స్కూటీ స్వాధీనం! వారిద్దరు నిందితులుగా గుర్తింపు!
జమ్మూ కాశ్మీర్ పహల్గామ్‌లో ఉగ్రవాదుల కిరాతక దాడి తరువాత అనూహ్య పరిణామలు ఏర్పడుతున్నాయి. ఈ దాడికి ప్రతీకారంగా కేంద్ర ప్రభుత్వం పలు నిర్ణయాలను తీసుకుంది. ఈ మారణహోమానికి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులే కారణం కావడం వల్ల ఆ దేశంపై కఠిన ఆంక్షలకు దిగింది. అటు పాకిస్తాన్‌లో కూడా అనేక పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి.
పహల్గామ్ దాడి జరిగినప్పటి నుంచి ఆ దేశంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అదే సమయంలో మిస్సైల్ పరీక్షలకు దిగింది పాకిస్తాన్. ఉపరితలం నుంచి ఉపరితలం క్షిపణులను పరీక్షించింది కూడా. కరాచీ తీర ప్రాంతంలో మిస్సైల్ టెస్టులను చేపట్టింది. రెండు రోజుల పాటు ఇవి కొనసాగుతాయని వెల్లడించింది. తీరాన్ని పంచుకుంటోన్నందున భారత్‌కూ ఈ సమాచారాన్ని అందించింది. దీనికి తగ్గ నౌకాదళ సిబ్బంది, సైన్యాన్ని మోహరింపజేసినట్లు స్పష్ట చేసింది పాకిస్తాన్ ఆర్మీ.
అదే సమయంలో ఇప్పుడు తాజాగా ఎటువంటి కవ్వింపు చర్యలు లేకుండా ఒక్కసారిగా నియంత్రణ రేఖ పొడువనా ఉన్న భారత్ అవుట్ పోస్టులపై పాకిస్తాన్ సైనికులు కాల్పులు జరపడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ కాల్పులు ఏ ఒక్క సెక్టార్‌కో పరిమితం కాలేదు. ఎల్ఓసీ పొడవునా కొనసాగాయి. తేలికపాటి కాల్పులే అయినప్పటికీ- పహల్గామ్ ఉగ్రవాదుల దాడి అనంతరం ఈ రెండు దేశాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకోవడం అసాధారణంగా భావిస్తోన్నారు. ఇది- ఇక్కడితో పరిమితం కాకపోవచ్చని, భారత ఆర్మీ ఓ అడుగు ముందుకు వేయవచ్చని అంటున్నారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఢిల్లీలో జరిగిన గంటల చర్చలు.. కీలక నిర్ణయాలు ! వాటికి ఓకే చెప్పిన మోదీ!
మరో నామినేటెడ్ పోస్ట్ లిస్ట్ రెడీ! కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఎప్పుడంటే?
సీఎంలకు హోం మంత్రి అమిత్ షా ఫొన్.. 48 గంటల లోపు.. ఎందుకంటే.!
మహిళలకు ప్రభుత్వం శుభవార్త.. 2-3 రోజుల్లో అకౌంట్లలోకి డబ్బులు.! వారికి ఇక పండగే పండగ..
సస్పెండ్ విషయంలో దువ్వాడ కీలక వ్యాఖ్యలు! తాను ఎప్పుడూ పార్టీకి..
మరోసారి బరితెగించిన వైసీపీ మూకలు..! ఏం చేశారంటే..!
వైసీపీ గుట్టు రట్టు! సెక్షన్లకే షాక్ ఇస్తున్న సునీల్ కుమార్ కేసులు!
ఏపీ ప్రజలకు శుభవార్త! కొత్త పెన్షన్లకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్!
విశాఖలో వైసీపీకి ఊహించని షాక్! ఒకవైపు అరెస్టుల కలకలం... మరోవైపు కీలక నేతలు పార్టీకి గుడ్‌బై!
ఉత్తరాంధ్రకు రెడ్ అలర్ట్! రాబోయే మూడు రోజులు ఈ జిల్లాలకు పిడుగులతో కూడిన కుండపోత వర్షం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: