ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. మహిళలకు ఊరట కలిగే ప్రకటన చేసింది. దీని వల్ల చాలా మందికి ప్రయోజనం కలుగనుంది. ఏంటని అనుకుంటున్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే. ఇంరో 2 లేదా 3 రోజుల్లో రుణ మంజూరు జరగనుంది. మహిళల అకౌంట్లలో డబ్బులు జమ కానున్నాయి. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఎస్సీ, ఎస్టీ మహిళల కోసం ప్రభుత్వం ఉన్నతి స్కీమ్‌ను అమలు చేస్తోంది. దీని ద్వారా అర్హత కలిగిన వారికి రుణాలు అందిస్తోంది. గత ఆర్థిక సంవత్సరం లక్ష్యాలను జనవరి నాటికే పూర్తి చేశారు. ఇక ఈ ఆర్థిక సంవత్సరం లక్ష్యాల సాకారం దిశగా అధికారులు వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఈ స్కీమ్ కింద అర్హత కలిగిన లబ్దిదారులకు గరిష్టంగా రూ. 3 లక్షల వరకు రుణాన్ని మంజూరు చేస్తారు. అలాగే కనిష్టంగా రూ. 50 వేల వరకు కూడా లోన్ తీసుకోవచ్చు. టైలరింగ్ యూనిట్, ట్రాకర్ట్ కొనుగోలు, హోటల్ ఏర్పాటు, దుకాణాలు, పాడి పరిశ్రమ, కంప్యూటర్ ఆంబ్రాయిడరీ వంటి యూనిట్లు పెట్టుకోవచ్చు.
ఇది కూడా చదవండి: సస్పెండ్ విషయంలో దువ్వాడ కీలక వ్యాఖ్యలు! తాను ఎప్పుడూ పార్టీకి..
ఉన్నతి స్కీమ్ కింద అర్హత కలిగిన వారికి వడ్డీ లేని రుణాలు వస్తాయి. విజయనగరం జిల్లాలో ఈ ఏడాదికి రూ.9.19 కోట్ల రుణ మంజూరును లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. దాదాపు రూ. 1800 మందికి పైగా ప్రయోజనం కలుగనుంది. అందువల్ల అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. వెలుగు శాఖలో సంప్రదించొచ్చు. విజయనగరం డీఆర్డీఏ కల్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ.. ఉన్నతి స్కీమ్ కింద గరిష్టంగా రూ. 3 లక్షల వరకు రుణం మంజూరు అవుతుందని తెలిపారు. దీని ద్వారా ఆటోలు, టాటా ఏస్ వంటి వెహికల్స్ కూడా కొనుగోలు చేయొచ్చని పేర్కొన్నారు. రుణ మంజూరు అనేది మండలాల వారీగా లక్ష్యాలు నిర్దేశించామని వెల్లడించారు. రెండు, మూడు రోజుల్లో సభ్యుతలకు రుణాలు మంజూరు చేస్తామని వివరించారు. ఇకపోతే జిల్లాలో ఉన్నతి రుణాల వసూళ్లలో కొంత అలసత్వం కనిపిస్తోంది. అంటే మొండి బకాయిలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గతేడాదిలో రూ.13.9 కోట్ల రుణాలు మంజూరు అయితే వసూళ్లు మాత్రం రూ.10 కోట్ల వరకే ఉన్నాయి. మెరకముడిదాం, మెంటాడ, తెర్లాం, రత్తిరాజేరు మండలాల్లో రికవరి శాతం తక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఏది ఏమైనా ఇలాంటి పథకాల కింద లభించే ప్రయోజనాలు మహిళలు పొందటం ఉత్తమం. దీని ద్వారా ఆర్థికంగా పైకి ఎదగొచ్చు. అందువల్ల అర్హత కలిగిన మహిళలు మాత్రం కచ్చితంగా ఈ స్కీమ్ కింద దరఖాస్తు చేసుకోండి. ప్రభుత్వం అందించే ప్రయోజనం పొందండి. సొంతంగా ఉపాధి పొందొచ్చు.
ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్.. కొత్తగా నేషనల్ హైవే.. ఆ జిల్లాలో క్లోవర్ లీఫ్! ఆకాశనంటుతున్న భూముల ధరలు..
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
మరోసారి బరితెగించిన వైసీపీ మూకలు..! ఏం చేశారంటే..!
వైసీపీ గుట్టు రట్టు! సెక్షన్లకే షాక్ ఇస్తున్న సునీల్ కుమార్ కేసులు!
ఏపీ ప్రజలకు శుభవార్త! కొత్త పెన్షన్లకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్!
విశాఖలో వైసీపీకి ఊహించని షాక్! ఒకవైపు అరెస్టుల కలకలం... మరోవైపు కీలక నేతలు పార్టీకి గుడ్‌బై!
ఉత్తరాంధ్రకు రెడ్ అలర్ట్! రాబోయే మూడు రోజులు ఈ జిల్లాలకు పిడుగులతో కూడిన కుండపోత వర్షం!
అంతా ఒక్కటయ్యారు! ఓకే బ్యారక్ లో ముగ్గురు కీలక నిందితులు!
వైసీపీ కి మరో షాక్.. ఆ కేసులో కీలక పరిణామం! మాజీ మంత్రి అనుచరుడు అరెస్టు!
ఉగ్రవాదులకు కలలో కూడా ఊహించని శిక్ష.. పహల్గాం ఘటనపై మోదీ స్ట్రాంగ్ వార్నింగ్!
ఆంజనేయులు కోరికను తిరస్కరించిన అధికారులు.. జైలు నిబంధనల ప్రకారం..
వైసీపీకి దెబ్బ మీద దెబ్బ.. మరో షాక్! ఆ జిల్లాలో ఘోర పరాజయం..
ప్రభుత్వం కీలక నిర్ణయం! అంగన్వాడి టీచర్ల భర్తీకి కొత్త రూల్స్! ఇకనుండి అది తప్పనిసరి!
హైకోర్టు సీరియస్ వార్నింగ్! ఇకపై లక్ష రూపాయల జరిమానా!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: