'కన్నడ భాష తమిళం నుంచే పుట్టింది' అని ప్రముఖ నటుడు కమల్ హాసన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు కర్ణాటకలో దుమారం రేపుతున్నాయి. తన తాజా చిత్రం ‘థగ్ లైఫ్’ ఆడియో రిలీజ్ ఈవెంట్‌లో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు కన్నడిగుల ఆగ్రహానికి కారణమయ్యాయి. ఆయన వ్యాఖ్యల నేపథ్యంలో కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఈ క్రమంలో కమల్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ కర్ణాటక రక్షణ వేదిక (కేఆర్‌వీ) రంగంలోకి దిగింది. బెంగళూరులోని ఆర్‌టీ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఆయనపై ఫిర్యాదు చేసింది. కమల్ వ్యాఖ్యలు కన్నడిగుల మనోభావాలను దెబ్బతీశాయని, కన్నడిగులు, తమిళుల మధ్య విద్వేషాలను సృష్టించేలా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొంది. ఆయనపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కేఆర్‌వీ డిమాండ్ చేసింది. దీంతో కమల్‌పై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అయితే, తన వ్యాఖ్యలపై కమల్ హాసన్ స్పందిస్తూ ఇప్పటికే సారీ చెప్పారు.
ఇది కూడా చదవండి: కడపలో మహానాడు వేదికపై స్పృహ తప్పి పడిపోయిన మాజీ ఎమ్మెల్యే! హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు..
తాను ప్రేమతో ఆ వ్యాఖ్యలు చేశానని, ఎవరినీ అగౌరవపరచాలనే ఉద్దేశం తనకు లేదని అన్నారు. భాషల చరిత్ర గురించి మాట్లాడే అర్హత రాజకీయ నాయకులకు లేదని పేర్కొన్నారు. ఈ చర్చను చరిత్రకారులు, భాషా నిపుణులకు వదిలేయాలని అన్నారు. ఇక, కమల్ హాసన్ వ్యాఖ్యల కారణంగా కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో కన్నడిగులు నిరసనలకు దిగారు. కొన్నిచోట్ల ఆయన థగ్ లైఫ్ మూవీ పోస్టర్లను దహనం చేయడంతో పాటు కమల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ వివాదం ‘థగ్ లైఫ్’ సినిమా రిలీజ్‌పై కూడా ప్రభావం చూపే అవకాశం లేకపోలేదని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. కాగా, ఈ వివాదంపై కర్ణాటక రాజకీయ నేతలు కూడా స్పందించారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ, కమల్‌కు కన్నడ భాష చరిత్రపై సరైన అవగాహన లేదన్నారు. ఇతర భాషలను అవమానించడం సరైంది కాదని పేర్కొన్నారు. కర్ణాటక బీజేపీ చీఫ్ బీవై విజయేంద్ర కూడా కమల్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పలువురు నేతలు కమల్ హాసన్ సినిమాలను కర్ణాటకలో నిషేధించాలని కోరారు.
ఇది కూడా చదవండి: ఏపీలో మరో గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే.. రూ.1400 కోట్లతో..! ఆ రూట్లోనే, కేంద్రం గ్రీన్ సిగ్నల్!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
అమెరికాలో భారతీయులు మృతి.. అందుకు కారకులకు జైలు శిక్ష! భారీ మంచు తుఫాన్..
మహానాడు వేదికగా చంద్రబాబు కీలక ప్రకటన! దెబ్బకు అంతా సైలెంట్!
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. ధరలు పెంపు! క్వార్టర్‌కు రూ.6 నుండి రూ.30 వరకు..
14 ఏళ్ల తర్వాత తెలంగాణలో గద్దర్ అవార్డుల ప్రకటన.. ఉత్తమ నటుడిగా.. విజేతలు వీరే.!
ఏపీలో మహిళలకు గుడ్‌న్యూస్..! ఒక్కొక్కరికి ఉచితంగానే రూ.15వేలు, మరో కొత్త పథకం!
వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వ్యక్తిపై దాడి కేసు.. 3 రోజుల పోలీసు కస్టడీకి మాజీ ఎంపీ!
లోకేష్క కీలక పదవి.. మహానాడులో ప్రతిపాదన.. చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే!
ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా.. తారక్ ఎమోషనల్ పోస్ట్!
పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. మళ్లీ తగ్గిన బంగారం ధర..! తులం ఎంతంటే…?
కొన్ని గంటల్లోనే టీడీపీ అకౌంట్లోకి వచ్చి పడిన రూ.17 కోట్లు! అసలు విషయం ఏమిటంటే?
ఊహించని ధరకు మోటో నుంచి ఎడ్జ్ 60 స్టైలస్.. ఫీచర్లు ఇవే! తమ్ముళ్లు డబ్బు రెడీ చేసుకోండి..
టీడీపీ జెండా.. తెలుగు జాతికి అండ! వైసీపీకి రాజకీయ భవిష్యత్తు లేదు.. యువగళం పేరుతో..
ఏం అదృష్టం సార్..! అడ్డిమార్ గుడ్డిదెబ్బ కొడితే.. రూ. 231 కోట్ల జాక్ పాట్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: