LIVE
World History: ప్రపంచంలోనే అరుదైన గుర్తింపు.. ఓ మహిళ పేరు మీదున్న ప్రపంచంలోని ఏకైక దేశం ఇదే! ఆ దేశం ఎక్కడుంది?  •  Defence: రూ.1.78 లక్షల కోట్లకు చేరిన భారత రక్షణ ఉత్పత్తి.. కొత్త రికార్డు నమోదు!  •  LPG: సామాన్యుడికి తప్పని గ్యాస్ మంట.. కేంద్ర ప్రభుత్వం సంచలనం.. వారికి బిగ్ షాక్..!!  •  NEET: నీట్ రీ-ఎగ్జామ్ ముందు అప్రమత్తమైన ఎన్టీఏ.. సోషల్ మీడియాలో మోసగాళ్లపై నిఘా!  •  ROB: నిడమర్రు ఆర్‌ఓబీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రులు నారా లోకేష్, పెమ్మసాని చంద్రశేఖర్!  •  Modi: జీ7 వేదికగా మోదీ-ట్రంప్ కీలక భేటీ.. వరుస ద్వైపాక్షిక భేటీలు!  •  Donald Trump: ఇరాన్ ముందు మోకరిల్లిన ట్రంప్.. అమెరికా, ఇరాన్ మధ్య 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం!  •  Indian Railways: ప్రయాణికులకు అలర్ట్... జూన్ 20 నుండి ఆ ఎక్స్‌ప్రెస్ సమయాల్లో మార్పు!  •  Gold Rate Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధరలు! తాజా రేట్లు ఇవే!  •  Pakistan: హాలిడే ట్రిప్‌లో ఊహించని విషాదం.. పాకిస్థాన్‌లో ఘోరం.. 9 ఏళ్ల చిన్నారిని కాల్చి చంపిన పోలీసులు!  • 
NRI

Iran War: ఇరాన్ సెగ.. జపాన్, సౌత్ కొరియాల్లో వణుకు.. అసలు లింక్ ఏంటి?

Iran War: మనం తెలుగులో ఒక సామెత వాడుతుంటాం.. "సుబ్బి పెళ్లి ఇంకి చావుకి వచ్చింది" అని. ఇప్పుడు ఇరాన్ మరియు అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను చూస్తుంటే సరిగ్గా ఇదే సామెత గుర్తుకు వస్తుంది. ఇరాన్ మీద అమెరికా గనక యుద్ధానికి దిగితే, ఎక్కడో దూరంగా ఉన్న జపాన్, దక్షిణ కొరియా (సౌత్ కొర…

AndhraPravasi News Desk 2 min read
Iran War: ఇరాన్ సెగ.. జపాన్, సౌత్ కొరియాల్లో వణుకు.. అసలు లింక్ ఏంటి?
  • ఇరాన్ పై యుద్ధంతో జపాన్, దక్షిణ కొరియాలో ఎందుకు ఆందోళన?
     
  • ట్రంప్ వైఖరి మరియు తైవాన్ భయం…

Iran War: మనం తెలుగులో ఒక సామెత వాడుతుంటాం.. "సుబ్బి పెళ్లి ఇంకి చావుకి వచ్చింది" అని. ఇప్పుడు ఇరాన్ మరియు అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను చూస్తుంటే సరిగ్గా ఇదే సామెత గుర్తుకు వస్తుంది. ఇరాన్ మీద అమెరికా గనక యుద్ధానికి దిగితే, ఎక్కడో దూరంగా ఉన్న జపాన్, దక్షిణ కొరియా (సౌత్ కొరియా) వంటి దేశాలు ఎందుకు టెన్షన్ పడుతున్నాయి? వాటికీ ఈ యుద్ధానికి సంబంధం ఏంటి? అనే సందేహం మనందరికీ రావచ్చు. 

అమెరికా 'సెక్యూరిటీ' భరోసా.. ఇప్పుడు ప్రశ్నార్థకం?
జపాన్ మరియు దక్షిణ కొరియాలు తమ రక్షణ కోసం చాలా కాలంగా అమెరికాపైనే ఆధారపడుతున్నాయి. దీన్నే 'సెక్యూరిటీ అవుట్‌సోర్సింగ్' అని కూడా అనవచ్చు. జపాన్‌కు చైనా నుంచి, దక్షిణ కొరియాకు ఉత్తర కొరియా (నార్త్ కొరియా) నుంచి నిరంతరం ముప్పు పొంచి ఉంటుంది. ఈ దేశాలను కాపాడటానికి అమెరికా తన సైనిక స్థావరాలను (మిలిటరీ బేసెస్) అక్కడే ఏర్పాటు చేసింది. ఉదాహరణకు, జపాన్‌లోని అకినావో ఐలాండ్స్‌లో అమెరికాకు పెద్ద మిలిటరీ బేస్ ఉంది. అయితే, ఇప్పుడు అమెరికా దృష్టి మొత్తం వెస్ట్ ఏషియా లేదా మిడిల్ ఈస్ట్ వైపు మళ్లింది. దీనివల్ల తమకు రక్షణగా ఉండాల్సిన అమెరికా సైన్యం అక్కడికి వెళ్ళిపోతుందేమో అన్నది ఆ దేశాల ప్రధాన ఆందోళన.

యుద్ధ నౌకలన్నీ ఇరాన్ వైపే..
సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ నివేదిక ప్రకారం, ప్రస్తుతం అమెరికాకు చెందిన దాదాపు 40% యుద్ధ నౌకలు (వార్ షిప్స్) ఇరాన్ వైపే ఉన్నాయి. అమెరికా ఇప్పటికే ఉక్రెయిన్‌కు ఆయుధాల సరఫరాను తగ్గించేసి, తన పూర్తి శక్తిని ఇరాన్ సరిహద్దుల్లో కేంద్రీకరిస్తోంది. సౌదీ అరేబియా, యూఏఈ, బహ్రెయిన్, కతార్ వంటి దేశాల్లో ఉన్న తన మిలిటరీ బేసులకు అమెరికా తన ఆస్తులను (సైనికులు, నౌకలు) తరలిస్తోంది. ఇలాంటి సమయంలో చైనా గానీ, ఉత్తర కొరియా గానీ తమపై దాడి చేస్తే పరిస్థితి ఏంటి అన్నది జపాన్, సౌత్ కొరియాల భయం.

మరోవైపు, డొనాల్డ్ ట్రంప్ గతంలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ గురించి మాట్లాడటమే మానేశారు, అలాగే చైనాతో కూడా పెద్దగా ఘర్షణ పడటానికి ఇష్టపడలేదు. చైనా విషయంలో ఆయన అనుసరించే ఎత్తుగడలు జపాన్ వంటి దేశాలకు కొంత ఆందోళన కలిగిస్తున్నాయి. ఒకవేళ అమెరికా మిడిల్ ఈస్ట్ యుద్ధంలో మునిగిపోతే, చైనా తైవాన్‌ను ఆక్రమించుకోవడానికి ప్రయత్నించవచ్చు. తైవాన్ విషయంలో చైనా చాలా కఠినంగా ఉంది, అవసరమైతే బలప్రయోగం (Use of Force) ద్వారానైనా తమ దేశంలో విలీనం చేసుకుంటామని చెబుతోంది. ఒకవేళ చైనా తైవాన్‌పై దాడి చేస్తే, జపాన్ కూడా అనివార్యంగా ఆ యుద్ధంలోకి దిగాల్సి వస్తుంది. ఇది ఆ ప్రాంతంలో పెద్ద అలజడికి దారి తీస్తుంది.

ఆర్ధికంగానే కాదు.. రక్షణ పరంగానూ ముప్పే!
సాధారణంగా ఎక్కడైనా యుద్ధం జరిగితే చమురు ధరలు పెరుగుతాయి, ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. మనం రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సమయంలో అది చూశాం. కానీ ఇక్కడ సమస్య కేవలం ఆర్థికమైనది మాత్రమే కాదు, అది సెక్యూరిటీ ఛాలెంజ్ కూడా. జపాన్, దక్షిణ కొరియా మరియు తైవాన్ వంటి దేశాలు అమెరికా రక్షణలో (Protectorates) ఉన్న దేశాలు. ఒకచోట యుద్ధం జరిగితే దాని ప్రభావం రిపిల్ ఎఫెక్ట్ (Ripple Effect) లాగా ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. ఇరాన్ మీద జరిగే దాడి కేవలం ఆ దేశానికే పరిమితం కాదు. ఇది తూర్పు ఆసియాలోని దేశాల భద్రతను కూడా ప్రమాదంలో పడేస్తోంది. అందుకే "సుబ్బి పెళ్లి ఇంకి చావుకి వచ్చింది" అనే సామెతను ఇప్పుడు "సుబ్బి చావు ఇంకి చావుకి వచ్చింది" అని మార్చి చెప్పాల్సి ఉంటుందేమో అనిపిస్తుంది. అమెరికా తన దృష్టిని ఎక్కడ కేంద్రీకరిస్తే, అక్కడ గెలుపు ఓటముల కంటే కూడా మిగిలిన ప్రపంచ దేశాల ప్రయోజనాలే ఎక్కువగా ప్రభావితమవుతున్నాయి.

Be the first to react

More Coverage

Yogandhra: ఉపమాకలో పండగ వాతావరణంలో యోగాంధ్ర కార్యక్రమం.. యోగాసనాలు వేసిన హోంమంత్రి అనిత, ఎంపీ సీఎం రమేష్!

Yogandhra: ఉపమాకలో పండగ వాతావరణంలో యోగాంధ్ర కార్యక్రమం.. యోగాసనాలు వేసిన హోంమంత్రి అనిత, ఎంపీ సీఎం రమేష్!

Yogandhra: అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉపమాకలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో నిర్వహిం…