Tirumala Latest Update: సెలవుల వేళ పెరుగుతున్న రద్దీ... 18 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులు! దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే... TTD: తిరుమల యాత్రకు వెళ్తున్నారా? టీటీడీ కొత్త రూల్స్ ఇవే! Indrakeeladri: విజయవాడ దుర్గగుడి పాలకమండలి కీలక నిర్ణయాలు..! భక్తుల సౌకర్యాలకే పెద్దపీట...! Tirumala Devotees: గతేడాదితో పోలిస్తే 4.57 శాతం పెరిగిన తిరుమల భక్తుల సంఖ్య! కారణం ఇదే.. Tirumala Update: తిరుమల సర్వదర్శనానికి 8 గంటల నిరీక్షణ! సింహాచలం నేటి నుంచే ఆఫ్‌లైన్ టికెట్లు.... TTD Updates: జ్ఞానాన్ని, ప్రశాంతతను పంచే ప్రవచనం.. చాగంటి కోటేశ్వరరావు గారి ఉపన్యాసానికి సర్వం సిద్ధం.! Tirumala Updates: శ్రీవారి భక్తులకు అలెర్ట్... జూలై నెల దర్శన కోటా విడుదల తేదీలు....! Annavaram Temple Development: అన్నవరం క్షేత్రంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి... భారీ అభివృద్ధి పనులకు శ్రీకారం! Tirumala Darshanam: శ్రీవారి దర్శనాల జోరు.. 4.57 శాతం వృద్ధితో తిరుమల సరికొత్త హిస్టరీ! Tirumala Laddu: తిరుమల శ్రీవారి లడ్డు రికార్డుల వేట.. 2025-26లో ఆల్ టైమ్ హై విక్రయాలు! Tirumala Latest Update: సెలవుల వేళ పెరుగుతున్న రద్దీ... 18 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులు! దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే... TTD: తిరుమల యాత్రకు వెళ్తున్నారా? టీటీడీ కొత్త రూల్స్ ఇవే! Indrakeeladri: విజయవాడ దుర్గగుడి పాలకమండలి కీలక నిర్ణయాలు..! భక్తుల సౌకర్యాలకే పెద్దపీట...! Tirumala Devotees: గతేడాదితో పోలిస్తే 4.57 శాతం పెరిగిన తిరుమల భక్తుల సంఖ్య! కారణం ఇదే.. Tirumala Update: తిరుమల సర్వదర్శనానికి 8 గంటల నిరీక్షణ! సింహాచలం నేటి నుంచే ఆఫ్‌లైన్ టికెట్లు.... TTD Updates: జ్ఞానాన్ని, ప్రశాంతతను పంచే ప్రవచనం.. చాగంటి కోటేశ్వరరావు గారి ఉపన్యాసానికి సర్వం సిద్ధం.! Tirumala Updates: శ్రీవారి భక్తులకు అలెర్ట్... జూలై నెల దర్శన కోటా విడుదల తేదీలు....! Annavaram Temple Development: అన్నవరం క్షేత్రంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి... భారీ అభివృద్ధి పనులకు శ్రీకారం! Tirumala Darshanam: శ్రీవారి దర్శనాల జోరు.. 4.57 శాతం వృద్ధితో తిరుమల సరికొత్త హిస్టరీ! Tirumala Laddu: తిరుమల శ్రీవారి లడ్డు రికార్డుల వేట.. 2025-26లో ఆల్ టైమ్ హై విక్రయాలు!

Tirumala: తిరుమల లైవ్ అప్‌డేట్స్! పెరిగిన భక్తుల రద్దీ... సర్వదర్శనానికి 24 గంటల సమయం!

Tirumala Darshanam: సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు శ్రీవారి దర్శనానికి దాదాపు 6 గంటల సమయం పడుతోంది. అలాగే రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం (శీఘ్రదర్శనం) టికెట్లు కలిగిన భక్తులు సుమారు 4 గంటల్లో స్వామివారిని దర్శించుకుంటున్నారు.

Published : 2026-03-13 10:10:00

తిరుమలలో కిటకిటలాడుతున్న కంపార్ట్‌మెంట్లు…

నిన్న స్వామివారిని దర్శించుకున్న 68 వేల మంది భక్తులు…

Tirumala Darshanam: తిరుమల పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ సాధారణం కంటే ఎక్కువగా కొనసాగుతోంది. శ్రీవారి ఉచిత దర్శనం (సర్వదర్శనం) కోసం వేచి ఉన్న భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. ప్రస్తుతం క్యూ లైన్ కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు ఉంది. ఈ క్రమంలో టోకెన్లు లేని భక్తులకు స్వామివారి దర్శనానికి సుమారు 18 నుండి 24 గంటల సుదీర్ఘ సమయం పడుతోంది.

సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు శ్రీవారి దర్శనానికి దాదాపు 6 గంటల సమయం పడుతోంది. అలాగే రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం (శీఘ్రదర్శనం) టికెట్లు కలిగిన భక్తులు సుమారు 4 గంటల్లో స్వామివారిని దర్శించుకుంటున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారులు క్యూ లైన్లలో అవసరమైన సౌకర్యాలను పర్యవేక్షిస్తున్నారు.

నిన్న తిరుమల క్షేత్రంలో భక్తుల సందడి గణనీయంగా నమోదైంది. మొత్తం 68,754 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, వారిలో 25,569 మంది భక్తులు మొక్కులు చెల్లించి తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా స్వామివారి హుండీ ఆదాయం రూ. 3.68 కోట్లుగా నమోదైంది. భక్తులు తమ దర్శన సమయాలను దృష్టిలో ఉంచుకుని యాత్రను ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Spotlight

Read More →