ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేసేందుకు గణనీయమైన చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో, కేంద్ర ప్రభుత్వ సహకారంతో "పీఎం - ఈ బస్ సేవా పథకం" కింద రాష్ట్రానికి 750 ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించాలని నిర్ణయించబడింది. ఈ పథకాన్ని అమలు చేయడానికి మూడు లక్షల జనాభా పైగా ఉన్న పట్టణాలను ఎంపిక చేయాలని నిర్ణయించగా, మచిలీపట్నం (1.80 లక్షలు) మరియు గుడివాడ (1.40 లక్షలు) కలిపి 3 లక్షలకు పైగా జనాభా ఉండడంతో ఈ పట్టణాలు ఎంపికయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ డిపోలకు ఎలక్ట్రిక్ బస్సులు అందించే దిశగా ప్రతిపాదనలు కోరగా, మచిలీపట్నం, గుడివాడకు కలిపి 95 బస్సులు అవసరమని అధికారులు నివేదిక పంపారు.

ఇది కూడా చదవండి: రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్! వరి, పత్తి సహా 14 రకాల పంటల మద్దతు ధర పెంపు!

మచిలీపట్నం ప్రస్తుతం వేగంగా విస్తరిస్తుండటంతో పాటు, మచిలీపట్నం పోర్టు వల్ల పారిశ్రామిక అభివృద్ధికి అవకాశాలు పెరుగుతున్నాయి. గుడివాడ కూడా క్రమంగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతోంది. ఈ నగరాల భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం రోడ్ల విస్తరణ, వసతుల కల్పన తదితర చర్యలు ప్రారంభించింది. ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వస్తే ప్రయాణికులకు మెరుగైన, సౌకర్యవంతమైన రవాణా సేవలు లభించడంతో పాటు వాతావరణానికి కూడా మేలు కలుగుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

ఇది కూడా చదవండి: ఏపీలో మరో గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే.. రూ.1400 కోట్లతో..! ఆ రూట్లోనే, కేంద్రం గ్రీన్ సిగ్నల్!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు


కొన్ని గంటల్లోనే టీడీపీ అకౌంట్లోకి వచ్చి పడిన రూ.17 కోట్లు! అసలు విషయం ఏమిటంటే?


గూగుల్ క్రోమ్ వాడేవారికి కేంద్ర ప్రభుత్వం కీలక హెచ్చరిక! ప్రమాదకరమైన లోపాలు గుర్తింపు!


వల్లభనేని వంశీకి హైకోర్టులో ఎదురుదెబ్బ...! అత్యవసర విచారణకు నిరాకరణ!


విశాఖ నుంచి ఈ మూడు మార్గాల్లో ప్రత్యేక రైళ్లు! హాల్ట్ స్టేషన్లు..!


తీపి క‌బురు చెప్పిన ఫ్లిప్‌కార్ట్..! ఈ ఏడాది 5 వేల ఉద్యోగాల భ‌ర్తీ!


కొడాలి నానిని చూసేందుకు ఎవరూ రావద్దు! నాని కుటుంబ సభ్యులు!


కేటీఆర్‌కు ఏసీబీ షాక్..! నోటీసులు జారీ!


విశాఖ విమ్స్ లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల! రాతపరీక్ష లేకుండా నేరుగా ఉద్యోగం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group