ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు "అన్నదాత సుఖీభవ" పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద రాష్ట్రంలోని చిన్న, సన్నకారు రైతులు, కౌలు రైతులు లబ్ధిపొందనున్నారు. ఈ పథకం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకానికి అనుబంధంగా రూపొందించబడింది. పీఎం కిసాన్ కింద వచ్చే రూ.6,000కు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.14,000 మంజూరు చేయడంతో రైతులకు మొత్తం రూ.20,000ల పెట్టుబడి సాయం లభిస్తుంది. ఈ మొత్తాన్ని మూడు విడతలుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో డైరెక్ట్‌గా జమ చేస్తారు.
ఈ పథకానికి అర్హులైన వారు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 18 సంవత్సరాలు పైబడిన చిన్న, సన్నకారు భూస్వాములు మరియు ధ్రువీకరిత కౌలు రైతులు కావాలి. ఆధార్ కార్డు, భూమి పత్రాలు, బ్యాంక్ వివరాలు, మొబైల్ నంబర్ వంటి పత్రాలు తప్పనిసరి. పీఎం కిసాన్‌కు అర్హత ఉన్న రైతులు ఈ పథకానికి కూడా అర్హులు. అయితే ఆదాయపన్ను చెల్లించేవారు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, రూ.10,000 పింఛన్ పైగా పొందేవారికి ఈ పథకం వర్తించదు. ఈ పథకాన్ని కుటుంబ యూనిట్ ప్రాతిపదికన అమలు చేస్తారు, అంటే ఒక కుటుంబానికి ఒకరికి మాత్రమే లబ్ధి చేకూరుతుంది.
ఇది కూడా చదవండి: రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్! వరి, పత్తి సహా 14 రకాల పంటల మద్దతు ధర పెంపు!
రైతులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే తమ సమీప రైతు సేవా కేంద్రంలో అవసరమైన పత్రాలతో కలిసి వెళ్లి నమోదు చేసుకోవాలి. అక్కడి అధికారులు పత్రాలను ధృవీకరించి, లబ్ధిదారుల జాబితాలో రైతుని చేర్పిస్తారు. దరఖాస్తు స్టేటస్‌ను అధికారిక వెబ్‌సైట్ [https://annadathasukhibhava.ap.gov.in](https://annadathasukhibhava.ap.gov.in) ద్వారా తెలుసుకోవచ్చు. 2025కు సంబంధించిన దరఖాస్తుల గడువు మే 25గా నిర్ణయించబడింది. ఈ పథకం ద్వారా రైతులకు నేరుగా ఆర్థిక సాయం అందించి వ్యవసాయంలో వారి స్థిరత్వాన్ని, ఉత్సాహాన్ని పెంపొందించడమే ప్రభుత్వ లక్ష్యం.
ఇది కూడా చదవండి: రేషన్ కార్డు దారులకు అలర్ట్! రేషన్ కొత్త టైమింగ్స్, తేదీలు ఇవే..!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఆలస్యంగా ఓటీటీ ట్రాక్ పైకి.. ఫారిన్ కష్టాలు పడితేనే గాని తెలియదు..!
ఏపీ మద్యం కేసులో నలుగురు నిందితులకు కస్టడీ! న్యాయవాది సమక్షంలో..
బెయిల్.. అయినా తప్పదు జైలు అన్నట్టుగా వల్లభనేని వంశీ పరిస్థితి! కీలక ఆదేశాలు జారీ.!
చిక్కుల్లో కమల్ హాసన్.. బెంగళూరులో కేసు నమోదు! ఆయన వ్యాఖ్యలపై కన్నడిగుల ఆగ్రహం..
ఈ సంప్రదాయం కళాకారులకు గొప్ప.. సీఎంకి కృతజ్ఞతలు తెలిపిన చిరంజీవి!
కన్నీటి గాధ! ఉద్యోగాల కోసం వెళ్లి మయన్మార్ లో చిక్కుకున్న భారతీయులకు చిత్రహింసలు!
ఉద్యోగులకు గుడ్ న్యూస్! భారీగా పెరగనున్న జీతాలు! ఎంతంటే?
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: