కాకినాడ జిల్లా తుని వద్ద జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అపోలో ఫార్మసీ ఉద్యోగులు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో ఈ దుర్ఘటన సంభవించింది. వివరాల్లోకి వెళితే, రాజమహేంద్రవరం అపోలో ఫార్మసీలో ఉద్యోగులుగా పనిచేస్తున్న కొందరు యువకులు విశాఖపట్నంలో శుక్రవారం జరిగిన సమావేశానికి హాజరై తిరుగు ప్రయాణంలో ఉన్నారు. తుని వద్ద జాతీయ రహదారి పక్కన ఆగి ఉన్న ఐరన్ లోడ్ లారీని వారు ప్రయాణిస్తున్న కారు వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాజమహేంద్రవరానికి చెందిన గెడ్డం రామరాజు, హజరత్ వాలీ, మరియు తణుకుకు చెందిన వరాడ సుధీర్ అక్కడికక్కడే మృతి చెందగా, గోనా శివశంకర్, వెంకట సుబ్బారావులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ రోడ్డు ప్రమాదంపై మంత్రి నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవులపై జోరుగా చర్చలు.. మరో జాబితా లిస్ట్ రెడీ! చంద్రబాబు కీలక సూచన - వారిపై ఎక్కువ దృష్టి!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఎన్నారైలకు షాక్! యూఎస్ నుంచి సొమ్ము పంపితే అదనపు భారం!
వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వల్లభనేని వంశీపై మరో కేసు! ఇక పర్మినెంట్ గా జైల్లోనేనా.?
ఈ-పాస్‌పోర్ట్ వచ్చేసింది! విదేశాంగ శాఖ కీలక నిర్ణయం!
లోకేశ్ తాజాగా కీలక సూచనలు.. అందరూ అలా చేయండి! అమ్మ లాంటి పార్టీని మరచిపోవద్దు!
మెగా డీఎస్సీ గడువు పొడగింపుపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు..! అభ్యర్థులకు ఊహించని..!
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే ఫైబర్ నెట్.. ఆ వివరాలు మీకోసం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: