ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీ అయిన ఒక రాజ్యసభ స్థానం ఎన్‌డీఏ కూటమికి దక్కింది. ఈ సీటు బీజేపీకి కేటాయించేందుకు టీడీపీ, జనసేన పార్టీలు అంగీకరించాయి. దీంతో ఈ స్థానం ద్వారా బీజేపీ ఎవరిని రాజ్యసభకు పంపించనుంది అన్నది హాట్ టాపిక్‌గా మారింది. తాజా సమాచారం ప్రకారం తమిళనాడు మాజీ బీజేపీ అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి అన్నామలై పేరే బలంగా వినిపిస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఏపీ సీఎం చంద్రబాబు మధ్య జరిగిన సుదీర్ఘ సమావేశంలో ఈ అంశంపై చర్చ జరిగినట్లు సమాచారం. ఇదే కారణంగా "తెలుగు తంబి అన్నామలై" అనే కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ నిర్ణయం వెనుక కీలక కారణాల్లో తమిళనాడులో రాబోయే అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయని భావిస్తున్నారు. తమిళనాడులో పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో బీజేపీ అన్నామలైను రాజ్యసభకు పంపి, తర్వాత ఆయనను కేంద్ర కేబినెట్‌లోకి చేర్చే వ్యూహాన్ని రూపొందించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి కొత్త వ్యక్తిని నియమించే ప్రక్రియలో కిషన్ రెడ్డిని ఇన్‌ఛార్జ్‌గా నియమించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారాలన్నింటిలో కిషన్ రెడ్డి, అమిత్ షా మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం, వీటికి చంద్రబాబు భేటీతో మరింత బలం చేకూరింది.
ఇది కూడా చదవండి: మరో బైపాస్ కు గ్రీన్ సిగ్నల్.. ఇక దూసుకెళ్లిపోవచ్చు! ఆ భూముల రేట్లకు హద్దుల్లేవ్!
ఇక మరోవైపు కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ పేరూ రాజ్యసభ అభ్యర్థుల రేసులో వినిపిస్తోంది. ఆమె 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయిన నేపథ్యంలో, మహిళా ప్రాతినిధ్యం పెంచేందుకు, కాంగ్రెస్ సీనియర్ నేత సోనియాగాంధీకి రాజ్యసభలో గట్టి కౌంటర్ ఇవ్వాలనే వ్యూహంతో బీజేపీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, తమిళనాడులో పార్టీకి ఊపు తేవాలంటే అన్నామలై ప్రయోజనకరమని బీజేపీ భావిస్తోంది.
ఈ నెల 15న విడుదలైన షెడ్యూల్ ప్రకారం, ఏప్రిల్ 29న నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ. మే 9న ఎన్నిక జరగనుంది. అయితే కూటమికి స్పష్టమైన మెజారిటీ ఉండటంతో అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. మరికొన్ని రోజుల్లో అభ్యర్థిపై స్పష్టత రానుంది. తుది నిర్ణయం బీజేపీ అధిష్టానంపై ఉండగా, ఇప్పటికే రాజకీయంగా "తమిళ తంబి ⇒ తెలుగు తంబి"గా అన్నామలై మారుతున్నారనే వ్యాఖ్యలు ఊపందుకుంటున్నాయి.
ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు భారీ శుభవార్త.. వారందరికీ ఇళ్లు ఇవ్వనున్న ప్రభుత్వం.! దాదాపు 3 లక్షల మందికి..
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
పదో తగరతి విద్యార్ధులకు అలర్ట్.. పబ్లిక్ పరీక్షల ఫలితాల తేదీ వచ్చేసింది! ఎప్పుడంటే..?
లిక్కర్ స్కాం లో జగన్ కు భారీ షాక్! నకిలీ పాస్పోర్టుతో సిట్ అధికారులకు దొరికిపోయిన కసి రెడ్డి!
అమిత్ షాతో చంద్రబాబు భేటీ! ఏపీకి మరో కేంద్ర మంత్రి, రాజ్యసభ సీట్ ఆయనకి ఫిక్స్!
మళ్ళీ రాజకీయాల్లోకి వస్తానంటున్న విసా రెడ్డి! ఆ పార్టీలో చేరేందుకు సిద్ధం!
కసిరెడ్డి కేసులో కీలక మలుపు! రేపు సిట్ ముందు హాజరు! వారికి ఇక మూడిందే!
వైసీపీకి బిగ్ షాక్.. ఆన్‌లైన్ బెట్టింగ్ లో ముఠా గుట్టురట్టు కీలక నేతపై కేసు!
సొంత ఊరిలో మాజీ మంత్రి పరువు పోయిందిగా.. ర్యాలీని రాజకీయం చేయొద్దు.. వెళ్లిపోండి!
జగన్ ఖాతాలో మరో స్కెచ్ రెడీ! 22, 23 తేదీల్లో ప్రకటనలు!
జగన్ కోసమే అలా చేశా..! శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!
మంత్రితో పాటు పార్టీ నేతలకు తప్పిన ప్రమాదం! పోలీసులు, ఫైర్ సిబ్బంది వెంటనే..
ఏపీ బీజేపీ కొత్త సారథి ఎవరు..? రేసులో 'ఆ నలుగురు' నేతలు.. అధిష్టానం ఆశీస్సులు ఎవరికో!
వైసీపీకి మరో భారీ షాక్.. విశాఖ మేయర్ పీఠం కూటమి కైవసం! ఒక్కొక్కరుగా పార్టీని వీడటంతో..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: