హైదరాబాద్-విశాఖపట్నం మధ్య ప్రయాణ దూరాన్ని తగ్గించడంలో భాగంగా చేపట్టిన గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి పనులు రైతుల పాలిట శాపంగా మారాయి. ఇప్పటికే పరిహారం విషయంలో తీవ్రంగా నష్టపోయిన రైతులు తమ పొలాల్లోకి వెళ్లేందుకు దారిలేక, పంట ఉత్పత్తులు తెచ్చుకునే అవకాశం లేక తలలు పట్టుకుంటున్నారు. రహదారి నిర్మాణ సమయంలో ఇబ్బంది లేకుండా చూస్తామంటూ హామీ ఇచ్చిన అధికారులు ఇప్పుడు పత్తా లేకుండా పోయారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Lokesh Tour: నెల్లూరు రొట్టెల పండుగలో పాల్గొన్న లోకేశ్.. ఏ రొట్టె తీసుకున్నారంటే.?

గ్రీన్ ఫీల్డ్ హైవే తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా తల్లాడ నుంచి ప్రారంభమై ఇల్లందు మీదుగా తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి వద్ద రాజమహేంద్రవరంలో కలుస్తుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్ నుంచి విశాఖ, రాజమహేంద్రవరం మధ్య దూరం తగ్గనుంది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలోని పలు గ్రామాల మీదుగా ఈ రహదారి వెళ్తుండగా భూసేకరణ సమయంలో బహిరంగ మార్కెట్ కంటే చాలా తక్కువ ధరకే ఈ ప్రాజెక్టు కోసం భూములు సేకరించారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: KRIS City: ఏపీలో కొత్తగా క్రిస్ సిటీ.. రూ.37,500 కోట్లతో.. ఆ జిల్లా దశ తిరిగినట్లే! రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం!

ప్రస్తుతం రహదారి నిర్మాణం చివరి దశకు చేరుకుని మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. అయితే ఈ రహదారి పైకి వెళ్లేందుకు, పంట ఉత్పత్తులు తెచ్చుకునేందుకు సర్వీసు రోడ్లు లేకుండా చేశారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూసేకరణ సమయంలో సర్వీసు రోడ్లు ఇస్తామని చెప్పిన గుత్తేదారు సంస్థ ప్రతినిధులు ఇప్పుడు పత్తాలేకుండా పోయారని చెబుతున్నారు. ఇదే విషయమై అధికారులు చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 

ఇది కూడా చదవండి: PM Kissan/ Annadatha Sukheebhava: పీఎం కిసాన్ , అన్నదాత సుఖీభవ నిధులు ఒకే సారి! ముమూర్తం ఖరారు, వీరికే..!

 

రహదారి నిర్మాణ సమయంలో సర్వీసు రోడ్లు సహా పక్కనే ఉన్న వాగుపై వంతెన నిర్మిస్తామని హామీ ఇచ్చిన అధికారులు ఇప్పుడు పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. రోడ్డు కోసం భూమి ఇచ్చి ఇప్పుడు బతుకుదెరువు కోల్పోయామంటూ గుండెలు బాదుకుంటున్నారు. పరిహారం విషయంలో అన్యాయం జరిగినా కనీసం సర్వీసు రోడ్లైనా నిర్మిస్తే పొలాలకు వెళ్లి వచ్చేందుకు వీలుంటుందని చెబుతున్నారు. కూటమి ప్రభుత్వమైనా తమ గోడు పట్టించుకుని న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Rs.7 Lakhs: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! వారికి ఒక్కొక్కరికి రూ.7 లక్షల డబ్బులు!

"పొలాల్లోకి వెళ్లేందుకు దారిలేక, పంట ఉత్పత్తులు తెచ్చుకునే అవకాశం లేక మాకు తీవ్ర ఇబ్బందిగా ఉంది. భూసేకరణ సమయంలో సర్వీసు రోడ్లు వేస్తామని చెప్పిన గుత్తేదారు సంస్థ ప్రతినిధులు ఇప్పుడు మొహం చాటేశారు. రహదారి నిర్మాణ సమయంలో సర్వీసు రోడ్లు సహా పక్కనే ఉన్న వాగుపై వంతెన నిర్మిస్తామని హామీ ఇచ్చిన అధికారులు ఇప్పుడు పట్టించుకోవడం లేదు. కూటమి ప్రభుత్వమైనా మా గోడు పట్టించుకుని న్యాయం చేయాలి.

ఇది కూడా చదవండి: New Airport: ఏపీలో కొత్త ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్! రూ.150 కోట్లతో.. భూముల ధరలకు రెక్కలు!

ఆంధ్ర తెలంగాణలను కలుపుతూ కేంద్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న గ్రీన్ ఫీల్డ్ ఎక్స్​ప్రెస్ హైవే 365-BG ప్రారంభానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే నిర్మాణం పూర్తవ్వాల్సి ఉన్నప్పటికీ భూ సేకరణలో జాప్యం, అధిక వర్షాలతో నిర్మాణం పూర్తి కాలేదు. ఖమ్మం-దేవరపల్లి మధ్య దాదాపు 162 కిలోమీటర్ల మేర నిర్మిస్తోన్న ఈ రహదారి మిగతా వాటికంటే పూర్తి భిన్నమైనది. పచ్చని పొలాల మధ్యలో ప్రకృతిని ఆస్వాదిస్తూ ప్రయాణం సాగించవచ్చు. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే హైదరాబాద్ - విశాఖ మధ్య విజయవాడ వెళ్లకుండానే రయ్ రయ్ మంటూ దూసుకెళ్లవచ్చు.

ఇది కూడా చదవండి: Farmers Relief: ఏపీ రైతులకు శుభవార్త! మీ అకౌంట్‌లో డబ్బులు పడ్డాయా.. చెక్ చేసుకోండి!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

Atchannaidu Meeting: వ్యవసాయ శాఖపై మంత్రి అచ్చెన్న కీలక నిర్ణయాలు! ఏపీలో దాదాపుగా 64 శాతం..

Mobile Bills: మొబైల్‌ యూజర్లకు చేదువార్త.. రీఛార్జీలపై చార్జీల మోత! కొత్త రీఛార్జ్ ప్యాక్స్!

 Anna Canteen: మరో 70 అన్న క్యాంటీన్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్! ఎక్కడెక్కడంటే ?

 Serious Illness: మాజీ ఎమ్మెల్యేకి తీవ్ర అస్వస్థత! ఆస్పత్రికి తరలింపు!

New Airport: ఏపీలో కొత్త ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్! రూ.150 కోట్లతో.. భూముల ధరలకు రెక్కలు!

 Road Construction:  9 జిల్లాల ప్రజలకు శుభవార్త.. 373 రోడ్లకు ఇక నో టోల్ గేట్లు.. ఆ రోజు నుంచే.!

 Anna Canteen: మరో 70 అన్న క్యాంటీన్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్! ఎక్కడెక్కడంటే ?

Jagan Shock : వైసీపీకి బిగ్ షాక్.. కీలక నేతలకు నోటీసులు జారీ! పోలీస్ స్టేషన్‌కి..

Gulf News: గల్ఫ్ కార్మికుడిని అక్కున చేర్చుకున్న నిమ్స్! రూ.2 లక్షల ఆర్థిక సహాయం..

Pura Mithra: ఏపీ ప్రజలకు శుభవార్త! ఈ ఒక్క యాప్

Toll Fee: వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త.. ఈ మార్గాల్లో టోల్ ఫీజు తగ్గింపు!

Vijayawada Railway: మీకు ఇది తెల్సా.! రైల్వే ఛార్జీలు బాగా పెరిగాయ్.. కానీ లోకల్ ట్రైన్స్‌లో..

Indian Railways: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రైలు మార్గాల్లో కొత్త సరిహద్దులు! కొత్తగా 240 కిమీ రైల్వే ట్రాక్!

Ration Card: ఏపీలో కొత్త రేషన్ కార్డులు వచ్చేస్తున్నాయి..! లిస్టులో మీ పేరుందాఇలా సింపుల్‌గా చెక్ చేస్కోండి!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group